Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
1953వ సంవత్సరంలో నా వ్యాపారం నష్టాల పాలయ్యింది. నా భాగస్వామి తన స్వార్ధం కోసం రూ. 5 లక్షలు విషయంలో అబద్ధమడాడు. అటువంటి క్లిష్టమైన పరిస్థితులలో నేను చాలా టెన్షన్ కి లోనయ్యాను. దురదృష్టవశాత్తూ ఆ టెన్సన్ వలన నేను నా మాట కోల్పోయాను. అర్ధాంతరంగా నేను మూగవాడిని అయిపోయాను.
నా తండ్రి అన్ని రకాల మందులను ప్రయత్నించాడు. కానీ ఏ ఔషదం నన్ను నయం చేయలేకపోయింది. కాబట్టి, నా తండ్రి ఏమన్నారంటే నా మూగతనం నయమవ్వటం కోసం నన్ను ఏ స్థలానికి పంపిస్తానని చెప్పారు. ఆ ప్రదేశాన్ని ఎన్నుకోమని నన్ను అడిగారు.
ఇదివరకు 1927లో నేను తిరుపతికి వెళ్ళినప్పుడు షిరిడీకి వెళ్ళాను. ఇప్పుడు ఎందుకో మా నాన్న ఎక్కడికి వెళ్తావని అడిగినప్పుడు నేను షిర్డీకి ప్రాధాన్యతనిచ్చి తక్షణమే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పను.
నేను 1954లో షిర్డీకి వెళ్లి మూడు నెలలు అక్కడే ఉన్నాను. ఈ సమయంలో నేను బాబాకు తీవ్రంగా ప్రార్థన చేసాను. “బాబా, నేను ఆర్ధికంగా, శారీరకంగా చాలా బాధపడుతున్నాను. దయచేసి నాకు మాటలు వచ్చేలా చేయండి!” అని గట్టిగా ప్రార్ధించాను. బాబా నా ప్రార్థన విని నా అభ్యర్థనను మన్నించారు.
శ్రీ సాయిబాబా యొక్క దయతో నాకు మాటలు వచ్చాయి. నేను సరళంగా మాట్లాడగలిగాను. తరువాత నేను ఇంటికి తిరిగి వచ్చాను. చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు.
బాబా యొక్క కృపకు గుర్తుగా నేను 1954లో జలగావ్ లో ఒక సాయిబాబా మందిరాన్ని నిర్మించాను. అప్పటినుండి నేను నేటి వరకు ఆయనను సేవ చేస్తున్నాను.
శ్రీ కాశీనాథ్ లతి,
పోలన్ పేట్
జలగావ్,
మహారాష్ట్ర
source: సాయి లీల మ్యాగజైన్ జనవరి_ఫిబ్రవరి 2004
సర్వం సాయినాథర్పాణమస్తు
Latest Miracles:
- శ్రీ సాయిదాసుగారు నంధ్యాలనుండి శ్రీ శైలము ట్రాన్సఫర్ లోని బాబా లీల.
- మళ్ళీ మళ్ళీ దర్శించాలనిపించే గురువుగారి సుందరరూపం.
- బాబా ప్రసాదించిన సంతానం
- బాబా సచ్చరిత్ర పారాయణం లీల
- మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ మరణించడం నిజమా?
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments