ఎంత వడ్డించిన ఎంతకీ తరగని ఆహరం – అద్భుతమైన బాబా లీల



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

బాలాజీ పాటిల్ నేవాస్కర్ బాబా సేవా చేసుకోవడం కోసం షిర్డీ వచ్చాడు. అతను బాబా రోజు నడిచే వీధులను తుడిచి శుభ్రం చేసేవాడు. తనకున్న కొద్ది పొలంలో పండిన పంట చేతికి వచ్చినప్పుడు అతను మొత్తం పంటను ద్వారకామయికి తీసుకొని వచ్చి బాబాకు సమర్పించేవాడు. అతను మరియు అతని కుటుంబం సంతోషంగా బాబా ఇచ్చిన దాని మీద నివసించెవారు.

సచ్చరిత్రలో మూడు రేట్లు అదికంగా వచ్చిన అతిథులకు ఎలా భోజనం పెట్టరో ఆ అద్భుతమైన లీల ఉంది. బాల (సంవత్సరికం) శ్రద్ధ కార్యక్రమనికి భోజనాలు సిద్ధం చేసారు. భోజన వేళకు అతని కోడలు చుస్తే, అనుకున్న దానికన్నా అదికంగా మూడు రెట్లు జనాభా వచ్చారు. ఊధి వంట పాత్రలలో వేసి వడ్డన ప్రారంభించారు. బాబా దయ వలన చివరి అతిధి వరకు ఆహారాన్ని సమృద్ధిగా అందించగలిగారు.(సాయి సచ్చరిత్రా 35వ అధ్యాయం).

అటువంటి మరో అద్భుతమైన లీల ఇది. బాబా యొక్క కృప వలన మూడు రెట్లే కాదు అంతకన్నా ఎక్కువ మంది అతిథులకు ఆహారం సమర్పించబడ్డ అద్భుత లీల.

ఒకసారి పురందరే షిర్డి సందర్శించినప్పుడు, అతను బాలా షింపి ఇంటిలో ఉన్నాడు. బాబా ఇద్దరు ఫకీర్లతో పాటు అతనింటికి వచ్చి  భోజనం చేస్తానని అతనితో చెప్పారు. గొప్ప ఆనందంతో పురందరే బాబాను ఏమి సిద్ధం చేయాలి అని అడిగాడు. “అన్నం, షీరా, భాజీ, రెండు కూరలు మరియు మసాలా కిచిడి తయారు చేయు” అని  బాబా చెప్పారు.

మధ్యహ్న ఆరతి తరువాత అతడు ఇంటికి వచ్చినప్పటికి ఆ పదార్ధాలన్నీ  సిద్ధంగా ఉండటం చూశాడు. అప్పుడు ఐదుగురు ఫకీర్లు వచ్చి భోజనం చేశారు. భోజనాంతరం వాళ్ళు వెళ్ళిపోతూ ఇంకా చాలామంది త్వరలో వస్తారని అతనికి చెప్పారు. ఆ ఫకీర్లు చెప్పినట్లుగానే తరువాత ఇరవై మంది ఫకీర్లు వచ్చారు. సంతృప్తి చెంది వారు కూడా వెళ్ళిపోయారు.

తరువాత మరో పది మంది ఫకీర్లు వచ్చారు. వాళ్ళకి కూడా ఆహారం సమృద్ధిగా సమర్పించబడింది. అంతమంది భోజనం చేసినప్పటికీ కూడా వండిన ఆహార పదార్ధాలు ఇంకా మిగిలి ఉన్నాయి. అప్పుడు పురందరే తాంబూలం మరియు దక్షిణతో బాబా వద్దకు వెళ్లి భోజనానికి ఆయనను ఆహ్వానించాడు.

బాబా నవ్వి “నేను చాలా సంతృప్తిగా, సంతుష్టిగా భుజించాను” అని చెప్పి, ఇపుడు నువ్వు వెళ్లి బాల షింపితో కలిసి భోజనం చేయు అని చెప్పారు. అప్పుడు పురందర కుటుంబం మరియు బాల షింపి కుటుంబం కలిసి భోజనాలు చేసారు. అయినప్పటికీ ఆహార పదార్ధాలు ఇంకా మిగిలి ఉన్నాయి. అతను ఆ ఆహారాన్ని బొంబాయికి తీసుకెళ్ళి తన స్నేహితులకు మరియు బంధువులకు పంపిణీ చేసి, అందరికీ ఈ అద్భుతమైన లీల గురించి చెప్పాడు.

source: Ambrosia in Shirdi – Part-I (Baba’s Leelas before 1918)

సర్వం సాయినాథర్పాణమస్తు

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “ఎంత వడ్డించిన ఎంతకీ తరగని ఆహరం – అద్భుతమైన బాబా లీల

Sreenivas Murthy

Sai Baba…Sai Baba…Sai Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles