Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
నా మాటలలోని అర్ధం నీకు బోధ పడిందా? నా బోధలోని మర్మాన్ని గ్రహించి ఎల్లప్పుడూ తదనుగుణంగా ఆచరిస్తూ ఉండు
ఒకరోజు సగుణమేరు బాబా దర్శనానికి వెళ్ళినపుడు. అతని మీద బాబాకు చాలా కోపం వచ్చింది. నేను చెప్పినట్లుగా నువ్వు నడుచుకోవటల్లేదని బాగా చివాట్లు పెట్టారు.
తన వల్ల ఏవిధమయిన తప్పు జరిగిందా అని సగుణ మేరు చాలా కలవర పడ్డాడు. అప్పుడు అతని కనిపించింది, బహుశా ఎవరో బాగా ఆకలితో ఉండి ఉంటారని. అతను వెంటనే వాడాకు వెళ్ళి, మగవాళ్ళు, కాని, ఆడవాళ్ళు కాని ఎవరన్నా భోజనం చేయకుండా ఆకలితో ఉండిపోయారా అని విచారించాడు.
ఇద్దరు భక్తులు భోజనం చేయకుండా ఉండిపోయారని తెలిసింది. అప్పుడు వారిద్దరినీ పిలిచి కడుపునిండా భోజనం పెట్టి వాళ్ళని తృప్తి పరిచాడు. తరువాత ద్వారకామాయికి తిరిగి వచ్చాడు.
బాబా నవ్వుతూ “నా మాటలలోని అర్ధం నీకు బోధ పడిందా? ఎల్లప్పుడూ అదే విధంగా ఆచరిస్తూ ఉండు” అన్నారు.
ఆహారం పరబ్రహ్మ స్వరూపమని, సర్వ జీవరాసులలో ఆకలి ఒకే విధంగా ఉంటుందని, బాబా తన ప్రవర్తన, ఆచరణ ద్వారా తన భక్తులకు బోధించారు.
సాయి సత్చరిత్రలో బాబా, లక్ష్మీబాయి తో “ఎవరయితే ఆకలితో ఉన్నవారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే “ అన్నారు బాబా
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నా పిల్లలను ఉపవాసం ఉండనిస్తానా? వారు ఆకలితో ఉంటే చూస్తూ ఊరుకుంటానా?—Audio
- నా పిల్లలను ఆకలితో ఉంచగలనా? – రెండవ బాగం….
- ‘నీకు ఏం కావాలో నేను అదే! నీకు అక్కరలేనిది కూడా నేనే!’’
- సింహపురిలో సాయికి భోజనం…..సాయి@366 సెప్టెంబర్ 27….Audio
- లక్ష్మీ, ఆకలితో ఉన్న ఆకుక్కకు రొట్టె పెట్టినావు, ఆ రొట్టె నాకే చెందినది నా ఆకలి తీరినది-Gopal Rao –13–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments