సింహపురిలో సాయికి భోజనం…..సాయి@366 సెప్టెంబర్ 27….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


సింహపురిలో సాయి మందిర నిర్మాణ కారకుడు డాక్టర్‌ ఎం.కె. రాజగోపాలాచారి గారు. ఆయన ధర్మపత్ని పేరు దొరై అమ్మాళ్‌

అది 1929వ సంవత్సరం సెప్టెంబరు నెలలో నెల్లూరు పట్టణంలో ఒక విచిత్రము జరిగినది.

ఆ రోజు శుక్రవారం.  వలలక్ష్మీ  వ్రత పర్వదినం. సమయం 11 గంటలు. అప్పుడు డాక్టర్‌ రాజగోపాలాచారి ఇంటికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు.

ఆయన చాలా పొడగరి. తేజోవంతమైన విశాల నేత్రాలు కలిగిన వాడు. చంకలో చిన్న మూట ఉన్నది. ”అమ్మా! నాకు చాలా ఆకలిగా ఉన్నది. భోజనము పెట్టు” అని దొరై అమ్మాళ్‌ను అడిగాడు.

ఆమె భోనానికి ఇది సమయం కాదు డాక్టరుగారు ఇంటిలో లేరని, ఆయన వచ్చిన తరువాత వీలవుతుందని చెప్పింది సౌమ్యంగా.

ఆ అతిథి ఆమె మాటలు వినలేదు. ఆకలితో ఉన్నప్పుడు పెట్టిన భోజనము, దప్పికతో ఉన్నప్పుడు ఇచ్చిన నీరు, సార్ధకతమవుతాయని ఆయన చెప్పాడు.

అప్పుడు అక్కడే ఉన్న వారాలబ్బాయి, డాక్టరుగారి కూతురుకు వీణ నేర్పే యువతి అక్కడే ఉన్నారు. ”ఏమిటయ్యా పొమ్మంటే పోవేం?” అని ఆ అబ్బాయి ”పోవయ్యా, పో” అని ఆ యువతి కసిరారు దొరై అమ్మాళ్‌కు మద్దతుగా

”ఇది నీ ఇల్లు కాదు. దుష్ప్రవర్తనలో ఉండు నీకు నాతో మాట్లాడే హక్కు లేదు” అన్నాడు అతిధి  వీణ నేర్పే యువతితో

”ఏవమ్మా! నాకు డబ్బు లేక కాదు  మీ ఇంటికి భోజనానికి వచ్చింది. నేను మీ ఇంట్లో ఒక పూటైనా భోజనం చేయవలయుననే నీ భర్త కోరికను నెరవేర్చుటకు వచ్చినాను” అని ఆయన తనవద్ద ఉన్న డబ్బును ఆమెకు చూపాడు.

ఆమె భోజనం పెట్టటానికి సమ్మతించి పెట్టింది. తృప్తిగా ఆ అతిథి  తిని వెళ్ళబోయాడు. డాక్టరు గారి భార్య ఆ అతిధి భోజనం పీటవద్ద వదలిన రూపాయలను, వక్కలను తీసుకొని వెళ్ళమన్నది.

ఆమెకు ఆ అతిథి తన సేవింగ్స్ పాస్‌ బుక్కు తెరచి చూపాడు. అందులో ఎన్నో వేల రూపాయలు ఉన్నాయి. ”నేను పీట వద్ద వదిలినది మీ క్షేమం కోసమే” అని అతను వెళ్ళిపోయాడు.

అతను వెళ్ళిన కొద్దిసేపటికే డాక్టరు గారు రాగా భార్య జరిగినదంతా చెప్పింది. డాక్టరు గారు వెంటనే బయటకు వెళ్ళి అతిథి కోసం చూచారు కాని ఆయన కనపడలేదు.

శ్రీ బి.వి. నరసింహ స్వామి గారు డాక్టరుతో భౌతికంగా సాయి దర్శనం ఇస్తాడని చెప్పినప్పుడు, ”నా ఇంట్లో కూడా సాయి ఒక పూటైన భోజనం చేయకూడదా” అనుకునే వారు. ఆయన కోర్కెను సాయి తీర్చారు అలా!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles