రచన – ఆచరణ….సాయి@366 సెప్టెంబర్ 14…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


సాయి లీలలు విచిత్రంగా ఉంటాయి – సమాధికి పూర్వం అయినా, సమాధి అనంతరం అయినా. సాయి లీలలను, బోధలను, తత్వాన్ని ఆకళింపు చేసుకోవటం వేరు, రచనలో పెట్టటం వేరు, ఆచరించి చూపెట్టటం వేరు.

సెప్టెంబరు 14, 1902న శ్రీ బాపట్ల హనుమంతరావు గారు జన్మించారు. ఆయన ‘సాయి ఆస్థాన కవి’గా తెలుగు వారి హృదయాలలో నిలచిపోయారు.

వారి రచనలెన్నో ఉన్నాయి. తెలుగు సాహిత్య ప్రక్రియలైన శతకము, పద్యము, గద్యము, నాటకము, బుర్రకథం, జంగమ కథ, అనువాదము, పరిశోధన మొదలైన వివిధ రంగాలలో రచనలు గావించారు.

ఏమీ! నిన్ను ఉపేక్షింతునా; శ్రీ సాయినాథ బోధామృతము, శ్రీ సాయిబాబా కూడా దేవుడేనా? శ్రీ సాయి అనుసరణము ఇలా ఎన్నో రచనలున్నాయి వారివి.

ఒకనాడు పంతులు గారు రచనావ్యాసంగంలో ఉండగా ఒక కుక్క వారి పాదరక్షలలో ఒక దానిని నోట కరచుకొని పోవుచుండగా, రెండవ పాదరక్షను దాని మీదకు విసిరినారు.

మరుక్షణంలో వారికి శ్రీ సాయి గుర్తుకు వచ్చి పశ్చాత్తాపముతో ”తండ్రి! నిన్ను గుర్తించలేక పాదరక్షను నీపై విసరినందుకు శిక్షగా ఇప్పటి నుండి పాదరక్షలను ధరించను” అని సాయికి విన్నవించుకున్నారు ఆయన.

చెప్పులు లేకుండా మండుటెండలో ఆయన తిరగలేకున్నారు. పైగా వార్థక్యము. అరికాళ్ళు బొబ్బలు ఎక్కి పుండ్లు అయినాయి.

ఒక రోజున ”ఎండలో నడవటం కష్టంగా ఉన్నది తండ్రి” అంటూ ఒక చెట్టు నీడన నిలబడ్డారు.

ఒక వ్యక్తి చెప్పుల జతను కర్రకు తగిలించుకొని ”పంతులు గారు, మీ కాళ్ళకు ఈ జత సరిపోతుంది. జేబులో ఉన్న 2 రూపాయలు ఇవ్వండి చాలు” అన్నాడు.

పంతులు గారు జేబులో చూడగా 2 రూపాయలే ఉన్నాయి. చెప్పులు ఆయన కాళ్ళకు చక్కగా అమరినాయి. పంతులు గారు ఆ 2 రూపాయలు ఇచ్చి చెప్పులు తీసుకొని ధరించారు.

ఆయనకు అప్పుడు అనుమానం వచ్చింది ఆ చెప్పులు ఆయనకు సరిపోతాయని అతనికి ఎలా తెలిసింది? తన జేబులో 2 రూపాయలు ఉన్న సంగతి కూడా ఎలా తెలిసింది? ఇది సాయి కరుణయే అనుకున్నాడు. ఆ వ్యక్తి కనుచూపు మేరలో కనిపించలేదు.

సూక్తులను, గాధలను చదివి ప్రభావితం అవటంతో సరికాదు, ఆచరణలో హృదయపూర్వకంగా పెట్టాలి వాటిని.

ఈనాడు సెప్టెంబరు 14. పంతులు గారిని స్మరించెదము గాక!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles