Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా షిరిడీ చేరినప్పటి నుండి మంచి వైద్యునిగా పేరు తెచ్చుకున్నాడు.
వైద్యం అనేది భౌతికంగాను, ఆధ్యాత్మికంగాను కూడా పరిగణించవచ్చును.
1888 సెప్టెంబర్ 14న జన్మించిన అనుకూల్ చంద్ర చిన్నప్పటి నుండి ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉండేవాడు.
పాఠశాలకు పోయినప్పుడు బాగానే పోయేవాడు. వచ్చేటప్పుడు అప్పుడప్పుడు చొక్కా లేకుండా ఇంటికి వచ్చేవాడు.
కారణం అడిగితే చొక్కా లేని పిల్లవాడు కనిపిస్తే, చొక్కాను ఇచ్చాను అనేవాడు.
మెట్రిక్యులేషన్ ఫీజు కట్టమని డబ్బు ఇచ్చి పంపితే, దారిలో మెట్రిక్యులేషన్ ఫీజుకు డబ్బు లేదని ఏడుస్తుంటే, అతడి ఫీజు కట్టి వచ్చాడు అనుకూల్ చంద్ర.
వైద్య కళాశాలలో చదువుతున్నా, సాయంకాలం పూట రోగులకు ఉచిత చికిత్స చేసేవాడు. తన వద్దకు రాలేని రోగుల ఇండ్లకే పోయి చికిత్స చేసేవాడు.
మధురమైన కంఠ స్వరంతో గానం చేసేవాడు. అందరూ భక్తి భావంలో మునిగి పోయేవారు. దొంగలు కూడా సన్మార్గులయ్యారు.
ఈయనను దైవత్వం మూర్తీభవించిన అవతారంగా భావించేవారు అక్కడి వారు.
ఎక్కడో ఉండి కానరాని దైవానికై పరితపించ వద్దు. కంటికి కనిపించే జీవులను ఆదరించండి అని ప్రోత్సహించే వాడు.
నేతాజీ సుభాష్ చంద్ర బోస్, శరత్ చంద్ర ఛటర్జీ, లాల్ బహుదూర్ శాస్త్రి మొదలగు వారు – వివిధ రంగాలకు చెందిన వారిని ఈయన దర్శించే వాడు.
ఈయన పుట్టినది ప్రస్తుతం బంగ్లా దేశంలో ఉన్నా, అప్పటి బీహార్ లో ఉన్న గ్రామం (హిమైత్ పూర్) దేవఘర్ లో స్థిరపడ్డాడు. జాతీయ, అంతర్హాతీయంగా పేరు సంపాదించాడు.
బీహార్ లో ఈయన పేరు ప్రఖ్యాతులు విన్న ఇరువురు హిమైత్ పూర్ గ్రామవాసులు ఆయనను దర్శించటానికి వెళ్ళారు. వారు నిరుపేదలు.
ఆనాడు అనుకూల్ చంద్ర వద్ద వందల సంఖ్యలో సందర్శకులున్నారు. అయినా వారిద్దరిని గుర్తించి, దగ్గరకు పిలిపించుకొని ఆ గ్రామవాసులతో తనవితీర ముచ్చటలాడారు.
చివరకు వారు ఇవ్వ గలిగిన రెండు చిన్న నాణెములను ప్రేమతో స్వీకరించారు.
తనని ప్యాజింజరు రైలు బండిగా పోల్చుకునే వాడు. ప్యాసింజర్ రైలు బండి ప్రతి స్టేషన్ లో ఆగి, ప్రయాణీకులను ఎక్కించుకుంటుంది. అనుకూల్ చంద్ర కూడా అంతే. ఏ కొందరికో పరిమితం కాదు.
నేడు సెప్టెంబర్ 14. ఠాకూర్ అనుకూల్ చంద్ర జన్మ దినం.
నేడు అయన వాక్కును స్మరించెదము గాక!
“సూర్య చంద్ర గ్రహ గతులు మార్చవచ్చు.
భూగోళాన్ని ముక్కలు చేయవచ్చు, కానీ, హృదయంలో ప్రేమ లేకుంటే సాధించేదేముంది?”
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- ఫకీరుగా ఉంచండి …. మహనీయులు – 2020… సెప్టెంబరు 21
- రెండు అడుగులు …. మహనీయులు – 2020… సెప్టెంబరు 3
- అన్నింటా గురువే! …. మహనీయులు – 2020… సెప్టెంబరు 25
- తెలుగు వారి శారదా మాత! …. మహనీయులు – 2020… సెప్టెంబరు 12
- చెప్పుదెబ్బలు …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 28
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments