తెలుగు వారి శారదా మాత! …. మహనీయులు – 2020… సెప్టెంబరు 12



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


యోగుల జీవిత చరిత్రలు చాలా విచిత్రంగా ఉంటాయి. సాయిబాబా లాంటి వారు వివాహమే చేసుకోరు.

జిల్లెళ్ళమూడి  అమ్మ లాంటి వారి వైవాహిక జీవితం గడుపుతారు. రామకృష్ణ పరమహంస, శారదా దేవి లాంటి వారు వివాహం చేసుకుంటారు. కానీ, వైవాహిక జీవితమే గడపరు. ఇటువంటి కోవకు చెందిన వారు దర్గాబాబా గారు.

నీలకంఠరావు పేట కొణిజేటి అనంతయ్య, సుబ్బుమ్మ గార్ల కుమార్తె రంగనాయకమ్మ గారే అనంతరం అమ్మయ్యగారుగా పిలవబడ్డారు.

ఆమె బాల్యం నుండి హాస్యానికైనా అబద్దం చెప్పలేదు. తగవులాడటం, పరుషోక్తులు ఆమె జీవితంలో కానరావు.

ఆమెకు 17వ ఏట దర్గాబాబా గారితో వివాహం అయింది. దర్గాస్వామి ఆమెతో శారీరక సంబంధం లేకుండా మనం జీవించటం దేవదూత ఆదేశమన్నారు.

ఆమె అంగీకరించింది. పైగా “అంతకంటే మహాభాగ్యమా?” అన్నది ఆమె. ఆమె తెలుగు వారి శారదా దేవి.

ఒకసారి దర్గాస్వామి “ఎవరు ఎవరిని కాపాడుతారు?” అని అడిగారు. “అందరినీ కాపాడే వాడు ఆ పరమాత్మ. అందరికీ అతడే రక్షకుడు” అన్నదామె. అట్టి సమాధానం మహా యోగినులే చెప్పగలరు.

వివాహం అయిన తరువాత దర్గాస్వామి గారు తనకున్న లక్షల ఆస్తిని దాన ధర్మాలకై వాడారు. ఇంకా అమ్మయ్య (భార్య) గారి ఆస్తి యావత్తు దాన ధర్మాలకు భర్త వినియోగించిన, అమ్మయ్య గారు కలత చెందలేదు.

దైవం ఇచ్చే సంపద తరుగదని ఆమె భావన. మాతాజీగా పేరు గడించిన అమ్మయ్య స్వామితో కలసి భక్తుల వివాహాలు జరిపించటమే కాకుండా, విద్యార్జనకై ధనాన్ని సాయం చేసేవారు.

ఒకసారి మాతాజీని దర్శించటానికి ఆమె మేనమామ వచ్చాడు. ఒక ఫర్లాంగు దూరం నుండే మాతాజీ చుట్టూ జ్యోతి వలయాన్ని చూచారాయన.

మాతాజీ ఆశ్రమంలో ఉన్న గోనెపట్టా మీద కూర్చున్నది. ఆ పట్టా క్రింద రెండు పాములున్నాయి.

మాతాజీ లేవగానే, అవి కూడా జరజరా ప్రాకుతూ వెళ్లిపోయాయి. సర్వ భూతాల హితవును కోరే అమ్మను ఏ విష జంతువూ ఏమి చేయగలదు?

ఆమెకు గల అతీత శక్తులను తన శ్రేయస్సు కొరకు, తన ప్రాణ రక్షణ కొరకు వాడుకొన లేదు. దైవపు ఇచ్చనే ఆమె పాటించారు.

ఒకనాడు ఆమె, దర్గాస్వామితో “స్వామీ, ఈ రోజు నాకేదో కీడు జరగబోతోంది” అన్నారు. అలాగే ఆమెకు శారీరక బాధ కలిగింది.

ఆనాడు సెప్టెంబర్ 11, 2004. మాతాజీ నిర్యాణం చెందారు. అనంత శాంతి, నైర్మల్యాలు ఆమె ముఖంలో భాసిస్తున్నాయి.

ఆ నాటి వరకు స్వామీజీ, మాతాజీలు ఇద్దరు, బౌతికంగా ఇద్దరూ వేరే కదా! కానీ ఆత్మ పరంగా ఒక్కరే. ఆ నాటి నుండి భౌతిక పరంగా, ఆత్మ పరంగా ఒక్కరే.

ఆమె మనకు తెలిసిన ఈ దిగువ సూక్తులను పాటిద్దాం.

“మీ పని మీరు చేసుకోండి, ఇతరులతో మాటలు వద్దు. సంపాదించటం గొప్ప కాదు. సంపాదించిన దానిని సద్వినియోగ పరచటమే గొప్ప”.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles