సిమ్లాలో మాతాజీ కృష్ణప్రియ యింటికి బాబా వచ్చుట



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా     …            సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా.

మాతాజీ గురించి ఎన్నో ఇంతకు ముందే తెలుసుకున్నాము. ఆ సమయమున మాతాజీ భర్తతో కలసి సిమ్లాలో ఉంటున్నది.

ఒకరోజున శ్రీ సాయిబాబా ఒక ముదుసలి సాధురూపమున డాక్టరు హన్సరాజు అనేడి వారి యింటివాకిట నిలిచి, వాసుదేవ్! అని ఆ యింటిపని కుర్రవానిని పేరుపెట్టి పిలిచారు.

ఆ సమయములో వర్షపు చినుకులు పడుచుండెను. ఆ పనికుర్రవాడు తలుపు తెరచి, నన్ను పిలచినవారెవరని చూడ అతనికి వృద్ధసాధువు కనిపించెను.

ఆ సాధువు “ఇచ్చట ఎవరైనా ఆంధ్ర వనిత (తెలుగు వారు) వున్నారా? వున్నచో ఆమె గృహమును నీవు నాకు చూపగలవా?” అని ఆ పనికుర్రవానిని అడిగెను.

వెంటనే ఆ కుర్రవాడు ఒక గొడుగును తీసుకొని బయటకు వచ్చి, వర్షమునకు ఆ సాధువు తడవకుండా వారికి గొడుగు పట్టి, మాతాజీ కృష్ణప్రియ యింటి వద్దకు వారిని తీసుకొని వచ్చినాడు.

ఆ సాధువు తలుపును తట్టగా, మాతాజీయే తలుపు తీసి, అచ్చట నిలిచియున్న సాధువుని చూచి, వారిని సాయిబాబాగా గుర్తించి, ఏమియు తోచక నిశ్చేష్టురాలై భక్తి – ప్రేమలతో బాబాను చూచుచు నిలుచుండిపోయెను.

సాధువు లోనికి వెళ్లగా ఆ కుర్రవాడు బయట సాధువు కొరకు నిలిచి యుండెను. అలా సాధురూపమున వచ్చిన బాబా యింటి లోపలకు వచ్చి అచేతన స్థితిలో యున్న ఆమెకు చెప్పి తనకు ఆసనము వేయించుకొని కూర్చిండిరి.

తనకు ఆమెచే పూజచేయించుకొని, భోజనమును పెట్టమని వారే మాతాజీతో చెప్పి, భోజనమును పెట్టించుకుని తినిరి. మాతాజీ కృష్ణప్రియను, వారి పిల్లలను దీవించి వారు బయటకు వచ్చిరి.

వాకిటిలోనే నిలిచియున్న వాసుదేవ్ ఆసాదువు ఎటువెళ్ళునాయని వారిని గమనించుచు వెంబడించెను కానీ వాసుదేవ ఆ సాధువుతో నడవలేకపోయెను. సాధురూపముతో యున్న బాబా ఆ వీధి చివరకు వెళ్ళి అదృశ్యులైరి.

వారదృశ్యులగుట చూచిన వాసుదేవు మరియు అచ్చటనే వీధులు చిమ్ముచున్న పనివారు ఆ సాధువు వీధిచివరలోయున్న లోయలోపడి మరణించి యుందురని భయపడుచు, అచ్చటకు వచ్చి లోయలోకి చూచిరి. కానీ లోయలో ఎవరు పడిన జాడ వారికి కనిపించలేదు.

ఆ సాధువు మహనీయులగుటచే అదృశ్యమై యుందురని వారు తలచినారు. ఎందుకీ అద్భుత లీల బాబా చూపిరి. ఎప్పుడు బాబా మాతాజీకి దర్శనమిస్తూనే యున్నారు కదా! పనికట్టుకు బయట నుండి ఎందుకురావాలి? ఓహో! సాయి బాబా నైనా నేను ఈ మాతాజీ కృష్ణప్రియ యింటికి వచ్చినానని అందరికి తెలియ చెప్పాటానికా! అది నిజము కావచ్చు.

రోజు ఆమె ఇంట్లోనే యుండు బాబాకు ఆమె ఇల్లు తెలియదా? మరి హన్సరాజు ఇంటిముందుకు ఎందుకు ఆగాలి? తెలిసిన వానిలా వారి నొకరును మరీ పిలిచి, మాతాజీ ఇల్లు తెలియని వానిలా ప్రవర్తించిరి. దానికి యున్న కారణమేమిటో చూద్దాం.

వాసుదేవ్ తన యజమాని హన్సరాజు వద్దకు వచ్చి ఆ సాధువును గురించి చెప్పెను. అప్పుడు హన్సరాజు మాతాజీ వద్దకు వచ్చి ఆ సాధువెవరు? అని అడిగినాడు. ఆయన శ్రీషిరిడీ సాయిబాబాయని మాతాజీ చెప్పెను.

అప్పుడు సాయిబాబా యొక్క అద్భుత లీలను వారికి ఆమె చెప్పిరి. అప్పటి నుండి హన్సరాజు ఆయన భార్య జగదీశయు మాతాజీ కృష్ణప్రియ దగ్గరకు వచ్చుచు, మాతాజీ తెలుపుచున్న బాబా లీలలు, బోధలు వినుచు వారును బాబా భక్తులైరి.

ఇదియెగా బాబా అలా మాతాజీ ఇంటికీ వచ్చుటలోని అంశము. హన్సరాజు యొక్క అనేక జన్మల వృత్తాంతమును కూడా బాబా తెలిపి, మాతాజీకి నీవు అతి సన్నిహితుడని తెలిపెను.

అటు తరువాత హన్సరాజు ఋషికేష్ లో ఆశ్రమము నెలకొల్పుకొని కృష్ణధ్యానమున గడిపెను. మాతాజీ ద్వారా బాబా ప్రకటించిన లీలలు ఒక పుస్తకమగును.

సంపాదకీయం: సద్గురులీల

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

సాయి బాబా     …            సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles