Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా.
శ్రీమతి సాయిలీలమ్మగారు కలకత్తాలో యుండగా నడుమునొప్పితో బాధపడుచున్నది.ట్యూమర్ ఉన్నదని, అది ముందు, ముందు క్యాన్సర్ గా మారవచ్చునని, కనుక గర్భసంచి తీసివేయవలెనని డాక్టర్లు చెప్పిరి. పెద్దాపరేషన్ చేశారు.
ఆపరిస్థితిలో ఇవ్వకూడని మందు నర్సు ఇవ్వటంతో అప్సమరక స్థితిలోకి వెళ్ళారు లీలమ్మగారు. బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు బాబా తమ చమత్కారం చూపారు.
తెల్లని దుస్తులు ధరించి బాబా లీలమ్మ గారి వద్దకు వచ్చి, ఆప్యాయముగా “అదేమిటి వీళ్ళు నీకు విభూతి పెట్టలేదా? అని ప్రశ్నించారు. అపస్మారకం నుండి తేరుకున్న లీలమ్మ గారు ఆ స్థితిలో “బాబా! మీరెందుకు కష్టపడతారు అనుచు తన కుమార్తె లలితను అమ్మగారు పిలవగా ఆమె వచ్చి విభూతి పెట్టినది. అప్పుడు బాబా అంతర్థానమైనారు. అంతే ఆమె ఆరోగ్యం మెరుగుపడసాగింది.
ఆమెను పరీక్షించుచున్న డాక్టర్లు ఆమె ఆరోగ్యము మెరుగుపడటం చూచి విస్మయం చెందారు. లీలమ్మగారి భర్త స్నేహితునకు బాబా స్వప్నంలో కనిపించి ఆమె ఆరోగ్యము బాగవుతుందని దైర్యంగా యుండమని చెప్పామన్నారు.
ఇరువది ఒకటవ రోజు మాతాజీని ఆస్పత్రినుండి ఇంటికి పంపినారు. ఆరు నెలలు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. ఇంటి వద్ద ఉన్న పనిమనిషి మాములు పనులు చేస్తుంది కానీ పిల్లల పని, తన పని ఎవరు చూచుకుంటారని మాతాజీ ఆలోచన చేయసాగింది.
ఇంటిపట్టునేయుండి శ్రద్దగా ఇవన్నీ చూచుకునేందుకు ఎవరన్నా తెలుగువచ్చిన యువకుడు దొరికితే బాగుండుననుకొని శ్రీ సాయినాధుని హృదయపూర్వకంగా వేడుకున్నది.
లీలమ్మ గారు అలా అనుకున్న తరువాత ఆమె ఇంటికి వచ్చిన మూడవ రోజు ఒక కుర్రవాడు వారి ఇంటి తలుపు తట్టారు.రామారావు గారు వెళ్లి తలుపు తీస్తే ఆ కుర్రవాడు తెలుగులో మాట్లాడుతు.
ఇంట్లో పని ఉంటె చేస్తానన్నాడు. ఆ పిల్లవాడిని అమ్మగారి దగ్గరకు తీసుకొని వచ్చి పనిచేస్తానంటున్నాడు మాట్లాడు అని చెప్పి పరిచయము చేశారు రామారావు గారు.
ఆ కుర్రవాడు 16 సం: వయస్సు వానిగా యున్నాడు. లీలమ్మ గారు చూచింది. కుర్రవాడు బాగానే యున్నాడు కాని బట్టలు బాగాలేవు.
బాబా నా మోర ఆలకించాడన్నమాట. కలకత్తాలో తెలుగువారు దొరకటమేమిటనుకుంటూ, నీ పేరేమిటి బాబు అని అడిగితె, నాకు పేరు లేదు. ఎపేరైనాసరే, మూర్తి అని పిలువండమ్మా.
నా అమ్మ నాన్నా చిన్నప్పుడే పోయారు. ఎవరు లేరు అని అన్నాడు ఆ కుర్రవాడు.
బీరువాలో చొక్కా గుడ్డయుంటే దానిని కూతురు చేత తెప్పించి గుడ్డ అతనికి చలదేమోఅనుకుంటూ అమ్మగారే కుట్టింది.ఆ కుర్రవాడు స్నానం చేసి వచ్చి ఆ చొక్కా వేసుకుంటే సరిపోయినట్లు అనిపించింది అమ్మగార్కి.
ఇంట్లో పనంతా చూచుకుంటున్నాడు. పిల్లలిద్దరికీ అన్ని సమయానికి చూస్తున్నాడు. అంతకు ముందున్న పనిమనిషిని మాన్పించాడు. ఆ పనిచేస్తున్నాడు అమ్మకు మందులివ్వటం దగ్గర నుండి అన్ని తనే చూస్తున్నాడు.
పనిమనిషిని ఎందుకు వద్దన్నావని అమ్మ అడిగితె ఎందుకమ్మా నేను నీదగ్గరేవున్నాగా! నీకు ఆపరేషన్ చేసినప్పుడు చాలా రక్తం పోయిందిగా? ఇప్పుడు నీ ప్రక్కనే వున్నాగా. ఆ పనిమనిషికి ఇచ్చే 21 రూపాయలు నీ ఆరోగ్యానికి పండ్ల కొరకు వాడొచ్చుగా” అని అన్నాడు.
స్నానానికి అన్ని సిద్ధం చేసేవాడు. స్నానం చేసేటప్పుడు మగపిల్లలు రాకూడదు” అని అమ్మగారంటే చిన్న పిల్లవానిగా కనిపించాడు. ఇట్లు అనేక చమత్కారాలు చేస్తున్నా మాతాజీ గుర్తించలేకపోయింది మాయచేత.
పిల్లవాడి మాటలు సాయిసచ్చరిత్రతో పోలివున్నవని తెలుసున్నా కూడా బాబాని గుర్తించలేకపోయింది.
భోజనం చేసేటప్పుడు దగ్గరుండి తీనిపించేవాడు. ఆరు నెలలు తరువాత డాక్టర్లు చూసి అంతాబాగుంది ఇంకా ఒక్క నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలన్నారు.
ఇంటికి వచ్చేటప్పటికి కుర్రవాడు ఇంట్లోలేడు. అమ్మగారు వాడేమై నాడోనని బాధపడింది. మూడురోజుల తరువాత వచ్చాడు.
ఏమైనావురా? అని ఆంటే నన్ను పోలీసులు పట్టుకెళ్లి జైల్లో పెట్టారు. నీవు మహ్మదీయుడవన్నారు. కాదు హిందువన్నారు. అప్పుడు వెంటనే నిక్కరు విప్పి చూపిస్తే వదిలేశారు అని చెప్పాడు.
నెల గడిచింది. మరలా డాక్టర్ల దగ్గరకు మాతాజీ సాయిలీలమ్మగారు వెళితే అంతా బాగుంది. మీరు మాములుగా పనులు చేసుకోవచ్చన్నారు.
ఆమె ఇంటికి వచ్చేటప్పటికి ఆ కుర్రవాడు లేదు. తిరిగి యిక రానేలేదు. ఎక్కడి నుంచి వచ్చాడు. ఇంట్లో ఎప్పుడుండేవాడు. ఎక్కడికెళ్ళాడు? ఆమెకు ఆర్డమే కాలేదు.
అతను వున్నప్పుడు మాట్లాడిన మాటలన్నీ సచ్చరిత్రలోని బాబా మాటలేనని గుర్తుకు వస్తున్నాయి. బాబా! మీరా ఇలా పని పిల్లవాడిగా ఉంది కాపాడినది అని బాధపడ్డది. గుర్తించలేకపోయినందుకు చింతించింది.
ఇలా ఆమెకు బాబా ఎప్పుడు నిదర్శననిస్తూనే యున్నారు.
మాతాజీ లీలమ్మ గారు చిన్నప్పటి నుండి బాబా భక్తులే. మొదట విజయవాడలో వుండేవారు.
1954 లో షిర్డీలో శ్రీ ప్రత్తినారాయణరావు గారిచే తెలుగు అనువాదం చేసిన సచ్చరిత్ర ఆవిష్కరణ సమయములో మొదటి కాపీ వీరికి ఇవ్వబడినది. వారు ఎవరిని పలకరించినా బాబా అనే సంబోధిస్తారు.
సంపాదకీయం: సద్గురులీల
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా.
Latest Miracles:
- మాతాజీ సాయిలీలమ్మకు సపర్యలు చేసిన బాబా.
- సిమ్లాలో మాతాజీ కృష్ణప్రియ యింటికి బాబా వచ్చుట
- నిశ్చేష్టురాలై,భక్తి-ప్రేమలతో బాబాను చూచుచు మాతాజీ నిలుచుండిపోయెను.
- మాతాజీ క్రిష్ణ ప్రియాను సద్గురువు చేసిన జగద్గురువు
- మాతాజీ కృష్ణ ప్రియా ను బాబా తాను పాదాలు చెంతకు చేర్చుకొనుట.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “మాతాజీ సాయిలీలమ్మకు సపర్యలు చేసిన బాబా”
Prathibha sainathuni
June 24, 2017 at 3:19 pmNice…
Prathibha sainathuni
June 24, 2017 at 3:30 pm[6/24, 4:49 PM] Prathibha Srikanth: Sai leelamma gari anubhavam bagundi
Konni sarlu baba manaki premato ivvalanukunedanni Maya valla manam gurtinchalem..gurtinchesariki anta aipotundi… Maya shaktivantam ainde kani aa mayani kuda bhaktula karmaku anukulanga marche baba,guruvu Gari mundu adi chinnabotundi…jarigevatikannitiki maname karanam anukuni mana bujala media baram vesukokunda baba, guruvu gari meda baram vesi mana tappulanu sarididdukuntu munduku sagela chusi eappatiki ayana biddaluga undagalige LA cheyamani prardinchadame manam cheyavalasindi