Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
ఈరోజు నుండి సాయి మహా భక్త శ్రీ కృష్ణారావు జగేశ్వర్ భీష్మ గురించి తెలుసుకుందాం…
కృష్ణారావు జగేశ్వర్ భీష్మ మొదటి భాగం…
ఒక సంస్కృత గ్రంథం “శఠేషు జయతే సురాః, సహస్రేషుచ పండితః” అనగా “వందల మందిలో ఒక్కడు మాత్రమే యోధుడు, వేలమందిలో ఒక్కరు మాత్రమే పండితునిగా జన్మించబడతారు” అని చెబుతోంది. శ్రీస్వామి కృష్ణానంద (కృష్ణారావు జగేశ్వర్ భీష్మ) కూడా అటువంటి వేలాదిమందిలో ఒక పండితునిగా జన్మించారు.
పరమపూజ్య శ్రీభీష్మ గొప్ప వ్యక్తిత్వం గలవారు. కానీ చాలా కొద్దిమందికి మాత్రమే ఆయన యొక్క గొప్పతనం గురించి తెలుసు. అతను విప్లవాత్మక భావాలు కలిగివుండడమే కాకుండా, ఆధ్యాత్మిక క్రమంలో ఒక అత్యున్నత ఆధ్యాత్మిక వ్యక్తి కూడా. సామాజిక సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన తన పూర్తి జీవితాన్ని అంకితం చేశారు. విశేషమైన విప్లవాత్మకత మరియు ఆధ్యాత్మిక వ్యక్తిత్వం కలిగి ఉన్న శ్రీభీష్మకు సంబంధించిన వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.
శ్రీకృష్ణారావు జగేశ్వర్ భీష్మ నాగపూర్ జిల్లాలోని బూటిబోరి (ఇప్పుడు ఒక పారిశ్రామిక శివారు) గ్రామంలో ఆగష్టు 16, 1854 న జన్మించారు. ఆయన 10 ఎకరాల వ్యవసాయ భూములను కలిగి ఉన్న గొప్ప కుటుంబంలో జన్మించారు. దేవుని దయవలన భీష్మ చిన్నవయస్సులోనే రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉద్యోగాన్ని చేయడం మొదలుపెట్టారు. కానీ, అతని మనసు ఎల్లవేళలా పూర్తిగా దేశభక్తితో నిండివుండేది. 1910వ సంవత్సరంలో మనదేశ స్వరాజ్యం కోసం గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమంలో కూడా పాల్గొన్నారు.
1904-1906 మధ్యకాలంలో డాక్టర్.ఖనాఖోజే మరియు శ్రీ రాంలాల్ వాజపాయిలు నాగపూర్ వద్ద ఒక రహస్యసంస్థను ప్రారంభించారు. ఈ సంస్థలో యువత చేరడం ప్రారంభమైంది. శ్రీగోపాలరావు టోంగో, శ్రీబావుజీ కవ్రే, శ్రీఅప్పా జి.హాల్డే, శ్రీభవానీ శంకర్ నియోగీ, శ్రీ గోవింద్ రావు దేశముఖ్ మరియు శ్రీకృష్ణారావు భీష్మ ఈ సంస్థలో చేరారు. ఈ సంస్థ యొక్క రహస్య సమావేశాలు శ్రీమతి సాలూబాయి మోహితే పాత ఇంటి సెల్లార్ లో జరిగేవి. సాలూబాయి ఒక యువరాణి, విప్లవకారులకు ఆర్థిక సహాయాన్ని అందించేవారు. ప్రతి ఒక్కరి అంతిమ లక్ష్యం – బ్రిటీష్ పరిపాలన నుండి భారతదేశాన్ని విముక్తి చేయడం.
పైన పేర్కొన్న సంస్థతో సంబంధం కలిగి ఉండటంతో పాటు, శ్రీభీష్మ Dr. మున్జే మరియు డాక్టర్ హెడ్గేవార్ తో కూడా సంబంధం కలిగి ఉన్నారు. ఒకరోజు డాక్టర్ మున్జే తన ఇంట్లో పూజ జరుపుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో శ్రీభీష్మ కూడా ఆ ఇంట్లో ఉన్నారు. Dr. మున్జే వద్ద గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీవీర్ సావర్కార్ వ్రాసిన “1857 చే స్వతంత్ర సమర్” అనే పుస్తకం ఉంది.
బ్రిటిష్ ప్రభుత్వం ఈ పుస్తకాన్ని నిషేధించింది. పోలీసులు రహస్య గూడచారుల నుండి పొందిన సమాచారం ఆధారంగా డాక్టర్ మున్జే ఇంటిని తనిఖీ చేసి అతని ఇంటిని మూసివేశారు. శ్రీ భీష్మ ఆ పుస్తకాన్ని ఒక చెత్తబుట్టలో దాచిపెట్టారు. అందువల్ల, పోలీసు సిబ్బంది ఆ పుస్తకాన్ని కనిపెట్టలేకపోయారు. అందువల్ల, పోలీసులు Dr.మున్జే మరియు శ్రీభీష్మలను క్షమాపణ కోరారు. ఈ విధంగా స్వేచ్ఛ కోసం పోరాటం దేశంలో రహస్యంగా జరుగుతోంది.
ఈ కాలంలోనే భీష్మ భార్య మరణించారు. భీష్మకు నలుగురు పిల్లలు (ఇద్దరు కొడుకులు మరియు ఇద్దరు కూతుర్లు) ఉన్నారు. భార్య యొక్క అకాల మరణం కారణంగా, భీష్మ హృదయం వికలమైపోయింది. అతని మనస్సు ఏకాంతంగా ఉండటం వైపు మళ్ళింది. అందువల్ల, భీష్మ కీర్తనలు, భజనలు, పూజలలో నిమగ్నమవుతూనే దేశ ప్రజలకు దేశభక్తిని బోధిస్తూ ఉండేవారు.
ఈ సమయంలో, అతను యథార్థ రామాయణం, శ్రీ భగవద్గీత, శ్రీ సత్యనారాయణ కథ లోని 7 అధ్యాయాలు, రామాయణ కాలం నాటి జీవనవిధానం, భౌగోళిక పరిస్థితులు మరియు పరిపాలన, ఛత్రపతి శివాజీ మహరాజ్ మొదలైన వాటి ఆధారంగా అనేక చారిత్రక ప్రాముఖ్యతలను గురించి పద్యాలు రచించారు. ఈ చారిత్రక కవితలు మరియు ఉపన్యాసాల ద్వారా, అతను బ్రిటీష్ వారి నుండి స్వేచ్ఛను సాధించడం కోసం దేశభక్తిని మన దేశ ప్రజల మనస్సులలో నాటడంలో విజయవంతమయ్యారు.
రేపు తరువాయి భాగం….
తరువాయి భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి ….
(Source: Shri Sai Leela, September 1985 Issue, Personal Interview Smt.Shreya Nagaraj had with Shri.Pramod Bhishma, Great Grand Son of Shri.Krishnashastri Jageshwar Bhishma on 1st September 2015)
http://www.saiamrithadhara.com/mahabhakthas/krishnashastri_jageshwar_bhishma.html
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s : శ్రీనివాస మూర్తి 9704379333, సాయి సురేష్ 8096343992
Latest Miracles:
- కృష్ణారావు జగేశ్వర్ భీష్మ రెండవ భాగం…
- కృష్ణారావు జగేశ్వర్ భీష్మ మూడవ భాగం…
- కృష్ణారావు జగేశ్వర్ భీష్మ నాల్గవ బాగం…
- కృష్ణారావు జగేశ్వర్ భీష్మ ఐదవ బాగం…
- కృష్ణశాస్త్రి భీష్మ సాయి లీల పత్రికకు పంపించిన ఉత్తరంలోని సారాంశం మొదటి బాగం…
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments