Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
1921 జూలై 11న శ్రీ సద్గురు సాయినాథ సగుణోపాసన రచయిత వేదశాస్త్రి కృష్ణశాస్త్రి భీష్మ సాయి లీల పత్రికకు పంపించిన ఉత్తరంలోని సారాంశం మొదటి బాగం: ఇందులో 1918కి ముందు జరిగిన కొన్ని బాబా లీలలు ఉన్నాయి.
సాయిమహరాజుతో నా అనుభవాలు నా సన్నిహితులకు బాగా తెలుసు. అందువలన, ఈ లేఖలో ప్రత్యేకమైన విషయమేమీ లేదు. భక్తులకు ఇప్పటికే తెలిసిన, లేదా చదివిన అనుభవాలను ప్రచురించవద్దు.
సాయినాథ మహరాజుకు అతీంద్రియ శక్తుల అవగాహన ఉంది. సాయినాథుల వారు దేహాన్ని విడిచినప్పటికీ, నాకు మాత్రం వారు అమరులు. వారు ఎప్పుడూ ఉంటారు. సాయిమహరాజు ఎప్పటికప్పుడు నాకు దర్శనాలను ఇస్తున్నారు. కోరుకున్న పనులను చేయటానికి నాకు మార్గదర్శకత్వం చేస్తున్నారు. నేను చెప్పేది సత్యం.
ఒక సాయంత్రం మేము సాయినాథునితో కూర్చొని, చివరి ఆరతి అయిన శేజారతి కూడా చేసాము. మరుసటి రోజు మేము ఆయనను కలవడానికి వెళ్ళినప్పుడు సాయి, ‘నిన్న సాయంత్రం నేను బయటికి వెళ్ళాను’ అని అన్నారు. మేము నమ్మలేకపోయము. అసలు అదెలా సాధ్యం? ఎందుకంటే సాయంత్రం శేజారతి ముగిసేవరకు ఆయన మాతోనే ఉన్నారు.
కానీ కొన్ని నిమిషాల తర్వాత షిరిడీకి దక్షిణాన ఉన్న గ్రామం నుండి వచ్చిన ఒక వ్యక్తి, “నిన్న సాయంత్రం సాయిమహరాజ్ మా గ్రామంలో ఉన్నారు” అని చెప్పాడు. అప్పుడు సాయిమహారజుకు అతీంద్రియ శక్తులున్నాయని, కాబట్టి ఒకే సమయంలో రెండుచోట్ల ఉన్నారని మాకు అర్థమయ్యింది.
ఒకసారి, బల్వంతరావు ఖపర్డే ఇంటిలో నిద్రిస్తున్నప్పుడు, సాయి అతని కలలో దర్శనమిచ్చి, అతనితో భోజనం చేసి, పాన్ వేసుకొని, కాసేపు ఊగుతూ కూర్చుని వెళ్ళిపోయారు. వెంటనే బల్వంతరావు మేల్కొన్నాడు.
ఉదయం అతను తనకి వచ్చిన కల గురించి నాతో చెప్పినప్పుడు, నేను, ‘ఈ కలను ఎవరికీ చెప్పకుండా సాయిమహరాజు వద్దకు వెళ్ళు. సాయి ఈ దర్శనాన్ని మీకు ఇచ్చినట్లయితే, ఆయన మీకు ఏదైనా సూచన ఇస్తారు. ఇది ఒక సాధారణ కల అయితే, సాయి ఆ కల విషయమై ఒక్కమాట కూడా చెప్పరు’‘ అన్నాను. వెంటనే బల్వంతరావు సాయిమహరాజుని కలవడానికి వెళ్ళాడు.
అప్పుడు సాయి, “నిన్న నువ్వు విందు పెట్టావు; కానీ నువ్వు ఏ దక్షిణా ఇవ్వలేదు” అన్నారు. ఆ మాట విని బల్వంతరావు ఆశ్చర్యపోయాడు. కానీ వెంటనే అతను “ఎంత ఇవ్వాలి బాబా?” అని అడిగారు. అందుకు బాబా ‘ రూ. 25 / – ‘ అని చెప్పారు.
ఇవన్నీ బాబా యొక్క అతీంద్రియ శక్తులకు నిదర్శనాలు. కొందరు ఈ కథలు అబద్ధాలు అనుకోవచ్చు; కానీ మిస్టర్ యశ్వంత్ వెంకటేష్ కొల్హాత్కర్, బి. ఎ., ఎల్.ఎల్.బి. గారి పుస్తకం ‘శ్రీమద్భగవత్ దర్శన్’ ఆత్మ శాశ్వతమైనదని, అనేక అద్భుతాలు చేయగలదని నిరూపిస్తుంది. అందువలన మేలుకుని ఉన్నా లేదా కలలోనైనా తమ దర్శనాన్ని ప్రసాదించడం బాబాకు అసాధ్యమెలా అవుతుంది?
”జాగత్ రామ, సోవత్ రామ, సప్నే మే దేఖో రామ హి రామ,” అని సంత్ ఏకనాథ్ మహరాజ్ చెప్పారు. తదనుగుణంగా బాబా ఎప్పుడు దర్శనం ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇస్తారు.
చాందోగ్యోపనిషత్తు వాల్యూం 2 అధ్యాయం VIII, 4 వ వచనంలో, “కొన్నిసందర్భాలలో పరమానందాన్ని అనుభవించే ఆత్మ, శరీరాన్ని విడిచిపెట్టి, జ్ఞానాన్ని పొంది, పరమాత్మలో లీనమై ఏకత్వాన్ని అనుభవిస్తుంది. ఆ పరిస్థితిలో కూడా ఆత్మ శరీరాన్ని అపస్మారకస్థితిలో వదలాల్సిన అవసరం లేదు” అని చెప్పబడింది. సాయిమహరాజు తమ భావాలను, కోరికలను పూర్తి నియంత్రణలో ఉంచి సదా పరమాత్మలో ఐక్యమై మౌనంగా ఉండేవారు.
ఒక్కోసారి తాను నిద్రించే చావడి నుండి మసీదుకు వెళుతున్నప్పుడు బాబా తమ చేత ధరించే సటకా ఊపుతూ భయంకరంగా తిడుతూ ఉండేవారు. అటువంటి సమయాలలో ఆయన దరిదాపుల్లోకి వెళ్ళడానికి కూడా ఎవరికీ ధైర్యం ఉండేది కాదు. బాబా ఉచ్ఛస్వరంలో బయటకు చాలా చెడ్డగా తిడుతునప్పటికీ, ప్రజలు “అల్లాహ్ తేరా భాలా కరేగా” అని ఆయన పలికిన మృదుమధుర పదాలు కూడా వినగలిగేవారు.
కోపంతో ఉన్నప్పుడు ఎవరు ఆశీర్వాదాలు ఇస్తారు? అందువల్ల నా అభిప్రాయంలో బాబా కోపం కేవలం ఒక ప్రదర్శన మాత్రమే, కానీ ఆయన మనస్సు నిండా దయ, ప్రశాంతత ఉండేవి.
రేపు తరువాయి బాగం….
(Source: Published in Sai Leela Magazine)
http://www.saiamrithadhara.com/mainhome.html
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- కృష్ణశాస్త్రి భీష్మ సాయి లీల పత్రికకు పంపించిన ఉత్తరంలోని సారాంశం రెండవ బాగం …..
- శ్రీ సాయి లీలామృత ధార – శ్రీ షిరిడీ సాయి విభూతి లీల – మొదటి బాగం….
- కృష్ణారావు జగేశ్వర్ భీష్మ మొదటి భాగం…
- సాయి భక్త ముక్తారాం – మొదటి బాగం….
- సాయి బాబా చూపిన మార్గము మొదటి బాగం…
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments