Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
1921 జూలై 11న శ్రీ సద్గురు సాయినాథ సగుణోపాసన రచయిత వేదశాస్త్రి కృష్ణశాస్త్రి భీష్మ సాయి లీల పత్రికకు పంపించిన ఉత్తరంలోని సారాంశం నిన్నటి తరువాయి బాగం: ఇందులో 1918కి ముందు జరిగిన కొన్ని బాబా లీలలు ఉన్నాయి.
‘తుకారమ్ గాథ’ లో 4274 వ వచనంలో, దేవుడు తన భక్తుల భారం మోస్తూ ఎల్లప్పుడూ వారికి దగ్గరగా ఉంటాడు. ఒకరోజు మధ్యాహ్నం ఆరతి సమయంలో సాయిమహరాజ్ ప్రక్కన కూర్చుని ఉన్నాము. ఆ రోజుల్లో ఆచారం ప్రకారం బాపూసాహెబ్ జోగ్ ఆరతికి సిద్ధం చేస్తున్నాడు. కానీ, హఠాత్తుగా, ఏ విధమైన కోపము లేకుండా మహరాజు నరసింహ అవతారం ధరించారు.
ఆయన ఆరతి సామగ్రిని, ప్రసాదాలను విసిరేసి, సటకాతో బెదిరిస్తూ భక్తులను బయటకు తరిమేసారు. తర్వాత అయన తమ స్థానం విడిచి బయట వరండాలో వచ్చి కూర్చున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆరతి మొదలుకాలేదు. భక్తులందరూ ఆకలితో ఉన్నారు. కొందరు బాబా కూర్చునే ఆసనానికి ఆరతి చేయాలని సూచించారు.
కానీ, దాదాసాహెబ్ ఖపర్డే అందుకు అంగీకరించలేదు. బాబాకి మాత్రమే ఆరతి చేయాలని అన్నారు. కానీ బాపూసాహెబ్ చేతుల మీదుగా కాకుండా వాఘ్యా చేతులతో చేయాలనీ అన్నారు. దాని ప్రకారం ఆరతి పళ్ళెం వాఘ్యానికి ఇవ్వబడింది. కానీ అకస్మాత్తుగా బాబా తమ ఆసనంపై వచ్చి కూర్చున్నారు. అప్పుడు ఆరతి జరిగింది. కానీ, బాబా కోపం ఎవరికీ అర్థం కాలేదు.
మరుసటిరోజు కోపర్గాఁవ్ కి చెందిన ఒక న్యాయవాది వచ్చి ఇలా చెప్పాడు, ”ఒక బాబా భక్తుడికి వ్యతిరేకంగా క్రిమినల్ కేసు పెట్టబడింది. నేను అక్కడకు చేరుకునేసరికే, కోర్టు అతనికి శిక్ష విధించింది. నేను ఆ భక్తుని తరఫున కేసు తీసుకుని కోర్టులో అప్పీలు చేశాను. ఆశ్చర్యకరంగా కోర్టు నిందితుడి ప్రవర్తన గురించి నన్ను ప్రశ్నించింది. అతని మంచి ప్రవర్తన మరియు అమాయకత్వం గురించి నేను హామీ ఇవ్వడంతో, కోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది.
ఈ అద్భుతం ఎలా జరిగిందో బాబాను అడిగి తెలుసుకోవాలని బాబా దర్శనం చేసుకోవడానికి నేను షిర్డీ వచ్చాను. ఆ భక్తుడు బాబా గురించి చెప్పి, కేవలం బాబా అనుగ్రహం వల్లనే నేను విడుదలయ్యానని నాతో చెప్పాడు.” సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ ఆరతిలో విశ్వమంతా బ్రహ్మస్వరూపమే అని చెప్పబడింది. సాయి ఆ భావానికి అనుగుణంగా ప్రవర్తించేవారు.
బాబా వద్ద ఎప్పుడూ పాత చింకి గోనెగుడ్డ ఉండేది. అది బాబాకు చాలా ప్రియమైనది. దానినే బాబా ఎప్పుడూ ఆసనంగా ఉపయోగించేవారు. ఒకసారి బాబా బయటకు వెళ్ళినప్పుడు, ఒక భక్తుడు ఆ గోనెగుడ్డను తీసివేసి, దాని స్థానంలో పట్టుపరుపును పెట్టాడు. బాబా తిరిగి వచ్చి, అతను పెట్టిన కొత్త పరుపును చూసిన వెంటనే మండిపడి తిట్టడం మొదలుపెట్టారు. ఆయన ఆ పరుపును విసిరేసి, ధునిని కూడా చెదరగొట్టారు. పాత గోనెగుడ్డ తెచ్చి యథాస్థానంలో పెట్టిన తర్వాతే ఆయన శాంతించారు.
”ధీరో నా సోచతి” అని కఠోపనిషత్తు చెప్తుంది. ఆత్మసాక్షాత్కారం పొందిన ధైర్యవంతులైన వారు ఎన్నటికీ దుఃఖానికి గురికారు. ఒకవేళ విచారంతో బాధపడుతున్నప్పటికీ, వారు ఆ దుఃఖం నుండి తేరుకోవడానికి ఇతర ప్రజల సలహాలు అవసరం లేదు; వారు తమకి తాముగా బయటపడతారు.
మేఘ అనే గుజరాతీ బ్రాహ్మణుడు సాయిమహరాజు అమితంగా ప్రేమించే భక్తుడు. మొదట అతడు తన యజమాని అయిన సాఠే చెప్పడం వలన బాబా దర్శనార్ధం వచ్చాడు. కానీ ఒకరోజు తన మనస్సులో, ‘నేను ముస్లింను ఎందుకు సేవించాలి?’ అనుకున్నాడు. అందువల్ల ఒకరోజు అతను షిరిడీ విడిచి తన స్వస్థలానికి వెళ్ళిపోయాడు.
అక్కడ అతను అనారోగ్యానికి గురయ్యాడు. కోలుకున్న తర్వాత అతను శివాలయాన్ని సందర్శించడానికి వెళ్లాడు. కానీ అతను అక్కడ శివలింగం స్థానంలో సాయిమహరాజును చూశాడు. వెంటనే షిరిడీకి తిరిగి వచ్చాడు. తన మనస్సు నుండి చెడు ఆలోచనలు తొలగించడానికి బాబా అతనిని కొన్నిసార్లు గాయత్రీ మంత్రం జపించమన్నారు. అతడు అది పూర్తి చేసిన తరువాత బాబా అతనిని దీవించారు.
మేఘుడు మరణించినప్పుడు, బాబా స్వయంగా తమ చేతులతో అతని దేహమంతా తడుముతూ ఐదు నిముషాల పాటు హృదయవిదారకంగా శోకించారు. తరువాత, “ఎందుకంత రోదిస్తావు” అని తమను తామే ఓదార్చుకుంటూ, ఉపశమనం చెందారు. (కఠోపనిషత్తులో చెప్పినట్లుగా, ”ధీరో నా సోచతి”) తరువాత తుది ఆచారాలకు అనుమతి ఇచ్చారు.
రేపు తరువాయి బాగం….
(Source: Published in Sai Leela Magazine)
http://www.saiamrithadhara.com/mainhome.html
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- కృష్ణశాస్త్రి భీష్మ సాయి లీల పత్రికకు పంపించిన ఉత్తరంలోని సారాంశం మొదటి బాగం…
- షిర్డీ సాయి హారతులు – రెండవ భాగం
- సాయి మహాభక్త బాపూసాహెబ్ జోగ్ – రెండవ భాగం
- సాయి అమ్మ.. సాయి నాన్న.. సాయే అన్ని ఈ జీవితానికి, ఇంతకు మించి ఏమి కావాలి
- సాయి భక్త ముక్తారాం – రెండవ బాగం….
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments