Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
బాబా దేహదారిగా ఉన్నంతవరకు ద్వారకామాయిలో మధ్యాహ్న ఆరతి ఒక్కటే జరుగుచుండేడిది. ముందుగా మశీదులో గంట మ్రోగేడిది. అప్పుడు భక్తులందరూ మశీదులో చేరేడివారు మొదటగా బాబాను గంధాక్షతలతో పుజించేడివారు. బాబా తమ ఆసనంపై చిలుం గొట్టంతో కూర్చొని యుండేడివారు. మశీదు లోపల స్త్రీలు నిలిచి యుండేడివారు. పురుషులు మశీదు ముందు ఖాళీ స్థలంలో నిలిచేడివారు.
అప్పుడు జోగ్ బాబా ఎదుట నిల్చుని భక్తీ ప్రపత్తులతో కుడి చేతిలో ఐదు వత్తుల అరతిని పట్టుకొని ఆరతి ఇచ్చుచు, ఎడమ చేతిలో ఒక గంటను పట్టుకొని మ్రోగించు చుండేడివాడు. ఆరతి పాటలను పాల్గొన్న భక్తులందరూ పెద్దగ క్రమపద్దతిలో కలిసి పాడెడివారు.
ఆరతి పూర్తీ అగు సమయమున పాల్గొన్న వారందరూ ఉచ్చ స్వరంతో “శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ మహారాజ్ కీ జై” అని ఎలుగెత్తి చాటేవారు. చివరిగా జోగ్ బాబాకు కర్పూర ఆరతి ఇచ్చి బాబాకు పటిక బెల్లమును నైవేద్యంగా పెట్టేవారు. బాబా చేయి చాపగా జోగ్ ఆ పటిక బెల్లంలో కొంత భాగం బాబా చేతిలో పెట్టి, మిగిలినది అచట ఉన్న వారందరికి ప్రసాదముగా పంచి పెట్టవాడు.
మధ్యహ్న ఆరతి అయిన పిమ్మట బాబా మశీదు బయటకు వచ్చి మశీదు ముందు గోడ ప్రక్కన నిలబడి ప్రేమతో భక్తులకు ఊధి ప్రసాదము పంచి పెట్టేడివారు. బాబా భక్తుల చేతులలో పిడికెళ్ళతో ఊధి పోయుచు, వారి నుదుట తమ చేతులతో ఊధి ని పెట్టిదివారు.
“అన్నా! మధ్యాహ్న భోజనమునకు పొమ్ము!”, “బాబా! బసకుపో!” “బాపూ! భోజనము చేయుము” అని ప్రతి భక్తుని సాయి ఆదరముతో పలుకరించి ఇంటికి పంపేవారు. బాబా గోడ పక్కన నిల్చున్న స్థానములో ఇప్పుడు గుర్తుగా క్రింద మరియు 4 అడుగుల ఎత్తుగా గోడ కట్టి ఆగోడపై చిన్న బాబా పాదుకలు భక్తులు నమస్కరించుకోవడానికి అనువుగా అమర్చారు.
ఈ మధ్యాహ్న ఆరతి జరుగుచున్నప్పుడు మశీదు ముందు ఇప్పుడు కూర్మ చిహ్నం ఉన్న చోట అందంగా అలంకరించబడిన శ్యామ కర్ణ గుఱ్ఱం కాళ్ళకు గజ్జలతో నిలబడి ఆరతి పాటకు అనుగుణంగా లయానుసారముగా శిరస్సు నూపుచు కాళ్ళను అడించేడిది.
ఆరతి పూర్తీ కాగానే ద్వారకామాయి మెట్లపై తన ముందు కళ్ళు యుంచి బాబాకు వంగి నమస్కరించేది. బాబా ముందుగా దాని నొసటన ఊధి పెట్టి దీవించిన తరువాతనే ఇతరులకు బాబా ఊధి ఇచ్చేవారు. ఈవిధంగా అప్పటి ఆరతులు జరుగుచుండేవి. దీనిని గురించి చదువుతుంటేనే ఒళ్ళు గగుర్పోడుచుచుంటే అప్పుడు అందులో పాల్గొన్న భక్తుల ఆనందం వర్ణనాతీతము కదా!
బాబా దేహదారిగా యుండగా రోజు జరిగిన ఆరతులు మూడే. మధ్యహ్న ఆరతి ఒక్కటే మశీదులో జరిగేది. రోజు మర్చి రోజు బాబా చావడిలో పరుండు రోజు శేజారతి, మరుసటి రోజు కాకడ ఆరతి చావడిలో నిర్వహించబడేవి. సాయింత్రం ఆరతి మొదటిలో సాఠెవాడలో జరిగేడిది. తరువాత గురుస్థానములో కూడా జి. కే. దీక్షీత్ అను వారు సాయింత్రం ఆరతి చేసెడివారు. అటు తరువాత దీక్షిత్ వాడలో కూడా సాయింత్రం ఆరతి జరిగేడిది. ఖపర్డే మొదలగు భక్తులు ఇందులో పాల్గొనుట ఖపర్డే డైరీ లో చూడవచ్చు.
బాబా దేహనంతరం నాలుగు వేళల జరుగు ఈ ఆరతులు బూటి వాడ లోని బాబా సమాధి వద్ద నిర్వహించబడుచున్నవి. ఉదయం గం. 4.30 నిమషాలకి కాకడ ఆరతి, మధ్యాహ్నం గం. 12.00 లకి మధ్యాహ్న ఆరతి, సూర్యాస్త సమయమున సంధ్య ఆరతి, రాత్రి గం. 10. 30 నిమషాలకి శేజరతి జరుగుచున్నవి.
సంధ్య ఆరతికి ఒక వత్తితోను, మిగిలిన మూడు అరతులకు ఐదు వత్తులతో ఆరతి ఇవ్వబడుచున్నవి. అరతులకు ముందు బాబాకు మరియు ఆయన సమాధిపై వస్త్రములు మార్చుదురు. నాలుగు వేళల ధూపం వేయుదురు. కాకడ ఆరతి కి వెన్న నైవేద్యం, మధ్యహ్న ఆరతికి భోజనం మరియు రొట్టెల నైవేద్యం, సాయింత్రం మిఠాయిలు నైవేద్యం, శేజారతికి చపాతీలు నైవేద్యం పెట్టెదరు. అవి ప్రసాదముగా భక్తులకు పంచెదరు.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- షిర్డీ సాయి హారతులు – మొదటి భాగం
- షిర్డీ సాయి హారతులు – మూడవ భాగం
- సాయి మహాభక్త బాపూసాహెబ్ జోగ్ – రెండవ భాగం
- షిర్డీ లో నేను(సాయి సురేష్) పొందిన అనుభవాలు 2వ భాగం
- షిర్డీ లో నేను(సాయి సురేష్) పొందిన అనుభవాలు 1వ భాగం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments