Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
భీష్మ గురించి మీకు తెలియజేసినప్పుడు సాయి హరతుల గురించి పూర్తీ వివరాలు మీకు తెలియజేస్తానని ఒక ప్రామిస్ చేశాను కదా! ఆ వివరాలు ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను.
షిర్డిలో ఆరతులు ప్రారంభం:
ఈ హారతులు ఎప్పటి నుండి ప్రారంభించినది, ఏవిధంగా ఇచ్చేది సరియైన తేది. సమాచారం తెలియుటలేదు. సాయి సచ్చరిత్రననుసరించి తేది 10. 12. 1910న చావడిలో హారతులు పారంభామైనవని తెలియుచున్నది. దాదాసాహెబ్ ఖపర్డే గారు మొదటిసారిగా తేది 05. 12. 1910న షిర్డీ వచ్చి తేది 12.12.1910 వరకు ఉన్నారు.
అప్పుడు షిర్డీ లో ఉన్నప్పటి తన దినచర్య డైరీలో వ్రాసుకున్నారు. దానిలో తేది 06.12.1910న బాబా చావడికి వెళ్ళినట్లు, అలా వెళ్ళినప్పుడు ఊరేగింపుతో గొడుగు, వెండికర్ర చామరములు మొదలగు వాటితో వెళ్ళారని, రాధాకృష్ణమాయి దీపములతో వచ్చినదని, ఆమెను కొంచం దూరంలో తాను చూచానని, చావడి బాగా అందంగా అలంకరించబదినదని” వ్రాసియున్నారు.
కనుక అప్పటికి చావడి ఉత్సవం, బాబా రోజు విడిచి రోజు చావడిలో నిద్రించుట జరుగుచున్నట్లు స్పష్టమైనది. కాని అక్కడ రాత్రి, ఉదయం హరతి జరిగినట్లులేదు. అతను డైరీ లో తేది 10.12.1910న చావడిలో హారతులు పారంభామైనట్లు ప్రస్తావించలేదు. కనుక ఈ ఆరతులు ఆ తేది తరువాతనే ప్రారంభమయియుండాలి. మళ్ళి తేది 06.12.1911న ఖపర్డే షిర్డీ వచ్చినప్పుడు తేది 07. 12. 1911 రాత్రి శేజారతి, తేది 08. 12. 1911 ఉదయం కాకడారతి పాల్గొన్నట్లు వ్రాసియున్నారు.
బాబాకు ప్రధమముగా ఆరతి ఇచ్చినవారు తాత్యాసాహేబ్ నూల్కర్:
తాత్యాసాహేబ్ నూల్కర్ 1909లో మొదటిసారి షిర్డీ వచ్చారు. బాబా సముఖములో మొట్టమొదటి ఆరతి ఇచ్చినది నూల్కరే. ఈ విషయం శ్రీ సాయి శరణానంద ఇలా చెప్పారు. “మహాల్సాపతి, నానాసాహేబ్ చందోర్కర్ కుమారడు మహాదేవ్ మాత్రమే బాబాను పూజించేవారు. తరువాత ఆరతి ఇచ్చు పద్దతి ప్రారంభమైనది. ఉదయం క్కడ హారతి, రాత్రి శేజ ఆరతి చావడిలో నిర్వహించబడేవి.ద్వారకామాయిలో మధ్యాహ్న ఆరతి మాత్రం ఇవ్వబడుచుండేది. నూల్కర్ గారు మొట్ట మొదటగా ఈ అరతులను ఇచ్చుట ప్రారంభించిరి.”
అదేవిధంగా దీక్షిత్ గారు కూడా “తాత్యాసాహెబ్ నూల్కర్ మొదటిసారి బాబాకు ఆరతి ఇచ్చారు. అంతకు ముందు ఎవరు ఇవ్వలేదు” అని చెప్పిరి. కనుక షిర్డిలో బాబా సముఖములో మొదటగా ఆరతి ఇచ్చినది తాత్యాసాహెబ్ నూల్కర్ అనునది స్పష్టం. ఇతను ఎంతో భక్తీ ప్రపత్తులతో ఆరతి ఇచ్చేవారు.
బాబా సముఖంలో ఆరతులు ఇచ్చినవారు
- తాత్యాసాహెబ్ నూల్కర్:- సరియేనా తేది తెలియనప్పటికీ 10.12.1910 తరువాతనే తాత్యాసాహెబ్ నూల్కర్ మొదటగా అరతులను ప్రారంభించారు. 1911 మార్చిలో ఆయన చనిపోయేవరకు ఈ ఆరతులు కొనసాగించారు.
- మేఘ శ్యాముడు:- నూల్కర్ మరణానంతరం ఇతను బాబా సముఖంలో ఆరతులు ఇవ్వడం ప్రారభించాడు. 19.03.1911 నుండి అతను దేహత్యాగం చేసిన 1912 జనవరి 19 కి మూడు రోజుల ముందు వరకు ఇచ్చాడు. ఇతను ఆరతి ఇచ్చే సమయమున ఒంటి కాలుపై నుంచుని, తల కదలించకుండా ఆరతి ఇచ్చేవాడు.
19.01.1912న తెల్లవారుజామున 4 గంటలకు మేఘుడు చనిపోయాడు. మూడు రోజుల ముందు మేఘుడు ఆరతి ఇస్తుంటే ఇదే మేఘుని చివరి ఆరతి అని బాబా చెప్పారు.
17.01.1912న కాకడ ఆరతి బాపుసాహేబ్ జోగ్ ఇచ్చాడు.
18.01.1912న మధ్యాహ్న ఆరతి సీతారామ్ ఇచ్చాడు. అదేరోజు శేజ ఆరతి కూడా సీతారామ్ ఇచ్చాడు.
- 01.1912న కాకడ ఆరతి బాపుసాహేబ్ జోగ్ ఇచ్చాడు. ఆరోజు జోగ్ ఆరతి ఇవ్వటం ప్రారంభించి బాబా దేహనంతరం వరకు ఇతనే ఆరతులు ఇస్తూ ఉండేవాడు.
- బాబా 15.10.1918 మంగళవారం దేహత్యాగం చేసిరి. బుధవారం ఉదయం షిర్డీ నివాసి శ్యామా మేనమామయగు లక్ష్మణమామాజోషి కి బాబా స్వప్న దర్శనమిచ్చి చేయిపట్టుకొని లాగి “త్వరగా లెమ్ము జోగ్ నేను మరణించానని అనుకుంటున్నాడు. అందుకే ఆరతి ఇవ్వడానికి రాదు. అందువలన నీవు వచ్చి పూజచేసి కాకడ అరతినిమ్ము” అని చెప్పిరి. వెంటనే లక్ష్మణమామాజోషి బాబా చెప్పినట్లు పూజ ద్రవ్యములతో మశీదుకు వచ్చి అక్కడ ఎవరు అడ్డుచెప్పిన లెక్కించక బాబా దేహానికి పూజ, ఆరతి చేసినాడు. ఆరోజు మధ్యాహ్న ఆరతి ఎప్పటి వలె జోగ్ పూజ ద్రవ్యములతో అందరితో కలిసి వచ్చి ఆరతి ఇచ్చినాడు.
ఇచ్చట గుర్తించవలసినది ఏమిటంటే, ఆయన తన దేహం త్యజించుట వలన తమ అవతారసమాప్తి కాదని అది ఇంకా కొనసాగించబడుచునే ఉన్నాదని, అరతులను ఆపవలసిన పని లేదని గుర్తింపు చేసి ఆచటివారి అనుమానములను తొలగించిరి.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- షిర్డీ సాయి హారతులు – రెండవ భాగం
- షిర్డీ సాయి హారతులు – మూడవ భాగం
- ఎన్నటికీ వీడని బంధం …..సాయి@366 డిసెంబర్ 19….Audio
- షిరిడీలో ప్రథమ గురుపూర్ణిమ…..సాయి@366 జూలై 3…..Audio
- ఎన్నో సాయి లీలలతో మరచిపోలేని మా షిరిడీ యాత్ర మొదటి భాగం…
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “షిర్డీ సాయి హారతులు – మొదటి భాగం”
Maruthi
July 12, 2017 at 12:57 pmsaibaba…saibaba