రామబాయి కనిత్కర్



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

రామబాయి కనిత్కర్ 1905లో యెవాలాలో నివసించేవారు. ఆమె స్నేహితులు చాలామంది బాబా యొక్క భక్తులు. బాబా యొక్క దర్శనం కోసం షిర్డీకి వారితో పాటు ఆమెను కూడా రమ్మని అడిగారు. ఆమె కూడా బాబా దర్శనం కోసం వెళ్ళాలని అనుకున్నప్పటికీ ప్రతిసారి వాయిదా పడేది. ఒకరోజు ఆశ్చర్యంగా బాబా యొక్క చిన్న ఛాయాచిత్రం ఆమె టేబుల్ పై ఉంది. ఎవరూ తనకు ఫోటో యివ్వనప్పటికి ఆసక్తికరంగా దానికదే ఆ ఫోటో ఎలా వచ్చిందో అర్ధంకాక ఆమె చాలా ఆశ్చర్యానికి లోనైంది. ఆమె ఫోటోను సురక్షితంగా భద్రపరిచింది.

ఒకసారి ఉప న్యాయమూర్తి అయిన ఆమె భర్త కోపరగావ్ కు బదిలీ చేయబడ్డాడు. ఆమె కూడా అతనితో కలిసి పోయింది. తరువాత రహతకు వారు వెళ్లారు. ఈసారి ఆమె షిరిడీకి వచ్చి బాబా యొక్క చావడిలోనే దిగారు. ఆమె బాబాలో విశ్వాసాన్ని పెంచుకుంది, కానీ బాబా తనకు అక్కల్కోట లోని స్వామి సమర్థ్ గా  దర్శనం కావాలని కోరుకుంది. అయితే, బాబా ఆమె కుమారుడు మరియు కుమార్తెకు స్వామి సమర్థగా సాక్షాత్కారం ఇచ్చారు. వారు ఈ విషయం ఆమెకు చెప్పారు. అప్పుడు బాబా మరియు స్వామి సమర్థ ఒకటేనని ఆమెకు పూర్తిగా నమ్మకంగా కుదిరింది.

source: Ambrosia in Shirdi – Part-I (Baba’s Leelas before 1918)

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles