Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio has been Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-30-Chithambar-by-Lakshmi-Prasanna 2:42
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
“నా భక్తుల అధీనంలో నేను పూర్తిగా ఉన్నాను, వారి పక్కపక్కనే నిలబడి ఉంటాను. నాకు ప్రేమ అనే ఆకలి ఉంటుంది. నాకు భక్తుల ప్రేమ కావాలి. బాధలో వారి పిలుపుకు తక్షణమే జవాబిస్తాను” అని బాబా,
దాదా భట్ (సాయి సచ్చరిత్ర)తో చెప్పారు.
అవకాశం వచ్చిన ప్రతిసారి చిదంబర్ ఆర్.కె. గాడ్గిల్ బాబా దర్శనం కోసం షిరిడీని వెళ్ళేవాడు.
అహ్మద్ నగర్ జిల్లా కలెక్టర్ కి వ్యక్తిగత సహాయకుడుగా ఉన్నందున మొదట్లో అతనికి షిర్డీ వెళ్ళడానికి అనుకూలంగా ఉండేది. తర్వాత అతను సిన్నర్ కి మామలతదారుగా పనిచేశాడు.
అక్కడి నుండి కూడా సమయం దొరికితే అతను షిరిడీకి వచ్చి బాబా యొక్క దర్శనం చేసుకొనేవాడు.
తరువాత అతనికి సుదూర ప్రాంతానికి బదిలీ అయ్యింది. వెంటనే అక్కడ ఉద్యోగ విధులలో హాజరు కావాలని ఉత్తర్వులు వచ్చాయి. బాబాను దర్శనం చేసుకొనే అవకాశం లేదని బారమైన హృదయంతో అతను ఆదేశాలను అనుసరించి బయలుదేరాడు.
అతను కోపర్ గావ్ మీదగా వెళ్తున్నప్పటికి, షిర్డీ వెళ్లి బాబా దర్శనం చేసుకొని అవకాశం లేదు.
కోపర్ గావ్ వద్దకి వచ్చినప్పుడు, నేను ఎంతటి దురదృష్టవంతుడిని షిర్డీ కి ఇంత దగ్గరగా వచ్చి కూడా బాబా దర్శనం చేసుకోలేకపోతున్నాను అని ఆలోచిస్తు భాదపడ్డాడు.
అతను ఇలా అనుకొంటూ ఉండగా, ఊధితో నింపబడి ఉన్న ఒక ప్యాకెట్ తన ఒడిలోకి విసిరివేయబడింది. అతను ఎవరు అలా విసిరారని కిటికీ నుండి బయటకు చూసాడు, కానీ ఎవరు కనిపించలేదు.
అతను గౌరవంగా ప్యాకెట్ ను తీసి సురక్షితంగా ఉంచుకున్నాడు.
కొంతకాలం తర్వాత అతనికి షిర్డీ సందర్శించడానికి అవకాశం వచ్చింది.
అప్పుడు బాబా “నువ్వు షిర్డీని సందర్శించలేకపోయినప్పటికీ కొపర్ గాన్ వద్ద నేను నీకు ఊధి ఇవ్వలేదా?” అని అన్నారు. బాబా యొక్క ప్రేమ మరియు తన పట్ల ఆయన కున్న చింతకు గాడ్గిల్ మనస్సు సంతోషంతో నిండిపోయింది.
అందువలన అతను ఆ ఊధిని ఒక తాయెత్తులో పెట్టి నిరంతరం ధరించాడు.
source: Ambrosia in Shirdi – Part-I (Baba’s Leelas before 1918)
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s : శ్రీనివాస మూర్తి 9704379333,
Latest Miracles:
- శంకర్ లాల్ కె. భట్
- శ్రీ దాజీ వామనరావు చిదంబర్
- గోవిందా రావు గార్డె
- పల్లకీ సేవ
- సమాధానమిచ్చే సమాధి, కె. రాజేంద్ర రెడ్డి , ఉమాదేవి. హైదరబాద్
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments