గోవిందా రావు గార్డె



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

నాగపూర్ కు చెందిన గోవిందా రావు గార్డె “బాబాకు తాను చేసిన ప్రతిజ్ఞను మరచిపోయారు”.  ఆ వివరం ఇలా ఉంది. అతను తన మేనల్లుడుని సందర్శించినప్పుడు అతడు ఆ సమయంలో రోగంతో బాధపడుతున్నాడు.

ఆ సమయంలో, గోవింద రావు తన మేనల్లుడు కోలుకుంటే, అతనిని బాబా యొక్క దర్శనం కోసం షిరిడీకి పంపుతాను అని సంకల్పించుకున్నరు. మేనల్లుడు రెండు రోజుల్లో తిరిగి కోలుకున్నాడు. కానీ అతడు తన మ్రొక్కుబడిని మరచిపోయాడు. అతడి మేనల్లుడు తనని చేస్తే అతడికి గుర్తు వస్తుందేమో అని అతడిని మూడు సార్లు సందర్శించినప్పటికీ అతనికి గుర్తు రాలేదు.

కొంతకాలం తరువాత, మేనల్లుడు అతని మామయ్యను అదే వ్యాధితో బాధపడుతుండటం చూసారు. అట్టి స్తితిలో ఒక గురువారం కుటుంబ సభ్యులు అందరు కలిసి సమావేశమై భజనలు పాడారు. అతను కోలుకోవడం కోసం వారు బాబాని ప్రార్థించారు.

ఆ రోజు పూజ సమయానికి మాత్రం అతను కోలుకొని పూజలో హాజరు అయ్యారు. అప్పుడు అతనికి తాను పూర్వం చేసిన మ్రొక్కుబడి గుర్తుకు వచ్చింది. వెంటనే “బాబా నీవు నన్ను నయం చేస్తే, నేను మరియు నా మేనల్లుడు మీ దర్శనం కోసం వస్తాము” అని మళ్ళీ అతను ప్రార్ధించారు..

అలా అతను మ్రొక్కుకున్న తర్వాత అతను చాలా త్వరగా కోలుకున్నారు. వెంటనే అతను మరియు అతని మేనల్లుడు షిర్డీకి వెళ్లి బాబా దర్శనం చేసుకొని బాబాకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నారు.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles