Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
గోవిందా రావు ఓక్ అనే వ్యక్తీ బొంబాయి లోని అంధేరీ లో నివసించేవారు. ఒకసారి అతను మరియు అతని స్నేహితుడు, క్రిష్ణజీ అగస్తే షిర్డీకి వెళ్ళారు. వారు బాబా యొక్క దర్శనం చేసుకొని రెండు మూడు రోజులు షిర్డీలో బస చేశారు.
వాళ్ళు ఇద్దరూ తిరుగు ప్రయాణం రోజున బాబా యొక్క రెండు ఛాయాచిత్రలను కొనుగోలు చేసి, చక్కగా ఆ ఛాయాచిత్రాలను ప్యాక్ చేసుకున్నారు. ఇంటికి వెళ్తూ దారిలో గోవిందా రావు తన సోదరుడి కోసం ఒక బాబా ఫోటోను కొనుగోలు చేయనందుకు చింతించారు.
ఇంటికి చేరి వారు ఛాయాచిత్రాలను కలిగి ఉన్న ప్యాకెట్ ను తెరిచి చూసి వారు విపరీతమైన ఆశ్చర్యనికి లోనయ్యారు. ఎందుకంటే అందులో మూడు ఛాయాచిత్రాలు ఉన్నాయి.
నిజానికి వారు రెండు ఫోటోల కోసమే డబ్బులు ఇచ్చి రెండు పొటోలు మాత్రమే ప్యాక్ చేయించారు. కానీ ఇక్కడ మూడు ఫోటోలు ఉన్నాయి. మార్గ మద్యలో తాను తన సోదరునికి ఫోటో తిసుకులేదని చింతించినందు వలన తన మనస్సు నెరిగి బాబా ఈ లీల చేసారని, మానసికంగా అతను బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. బాబా యొక్క ప్రసాదంగా ఆ ఫోటోను అతని సోదరునికి ఇచ్చారు..
భక్తులు ఎక్కడ ఉన్న వారి మనసులోని ప్రతి చిన్న ఆలోచనను బాబా గమనిస్తూ ఉంటారు అన్న దానికి నిదర్శనమే ఈ లీల
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- గోవిందా రావు గార్డె
- సాయి భక్తురాలు ఇందిరా బాలాజీ రావు గారు–Audio
- సమస్యలలో ఉన్న తన తోటి సాయి భక్తులకు సచ్చరిత్ర, సహస్రనామ పారాయణ ద్వారా పరిష్కారం చూపించిన రాజేశ్వర రావు గారు
- సాయి భక్తులు – శ్రీ భారం ఉమా మహేశ్వర రావు & శ్రీమతి భారం మణి – 8. వ.భాగమ్
- సాయి భక్తులు – శ్రీ భారం ఉమా మహేశ్వర రావు & శ్రీమతి భారం మణి – 6. వ.భాగమ్
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “గోవిందా రావు ఓక్”
Maruthi
May 24, 2017 at 6:58 amsai Baba…Sai Baba. E leela chadavagane baba gariki thanks Cheppali anipisthondi.idi adbhuthamina leela.Happy ga,Prasanthamga vundi e leela lu chaduvuthunte. Sai Baba…Sai Baba