Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice By: Mrs. Jeevani
నారాయణ స్వామి గారి (ఈయన మా బాబా గుడి కి వస్తూంటారు) తో నేను మొదటిసారి శిరిడి వెళ్ళాను.
బాబాను దర్శనం చేసుకున్నాను. నా భార్య గొడవ పడి సంపాదన లేదు, ఇల్లు పట్టించుకోవడం లేదు నన్నుముట్టుకోవడం లేదు, అని వాళ్ళింట్లో పెద్ద మనుషులతోటి పంచాయితీ పెట్టించింది.
నేను ఏమి మాట్లాడలేదు, అన్నిటికి మౌనమే నా సమాధానం. ఇంట్లోంచి బయటకు వచ్చేసాను.
ఒక భక్తురాలి పరిస్థితి చూసి జాలి పడి బాబాని వాళ్ళ మీద తన దృష్టి ప్రసరింపచేయమని ప్రార్థిస్తూ రోజూ వారింట మూడు హారతులు పాడుతూ ఉండేవాడిని.
వారికి బాబా అడుగుల శబ్దం వినబడుతుండేది, నేను వాళ్లకి బాబా ని పరిచయం చేసాక వారికి మంచి జరిగిందని నన్ను తలుచుకునేవారట.
వెంటనే నేను వారింట వుండేవాడినంట, బాబా అంటే ఆ ఇంటి యజమానికి నచ్చేది కాదు.
అత్తా కోడళ్ళు బాబా పూజలు హారతులు చేసేవారు. ఆమెకి తరచూ నేను కలలో కనబడే వాడి నని చెప్పేది.
అప్పటి నుండి ఆ సాయి అనుగ్రహం నా పైన ఉందని గ్రహించి, తెల్ల బట్టలు వేసుకునేవాడిని. ఇదంతా చూసి ఆమె భర్త ఆమెకి దత్త దీక్ష ఇప్పించాడు.
ఆమెకి చదువు కూడా రాదు. అయిన బాబా దయతో శ్రీ సాయి సచ్చరిత్ర బాబా పుస్తకాలు చదివేది.
దత్త దీక్ష తీసుకుంటే వాళ్ళ తీరు తెన్నులు వేరుగా వుంటాయి. వాళ్ళు బాబాను అంతగా పట్టించుకోరు. అందుకే నేను వాళ్ళింటికి వెళ్ళడం మానుకున్నాను.
ఇంటికి వెడితే మా ఆవిడ సంపాదన లేదంటూ పోరు పెట్టింది. బాధ తట్టుకోలేక బయటికి వచ్చాను.
ఒక ముసలామే నాకు ఎదురు వచ్చి మా ఇంటికి రా బిడ్డ! అని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళింది.
వాళ్ళ కోడలికి పరిచయం చేసి నన్ను ఒక బాబా ఫోటో అడిగింది, ఇచ్చాను,
బాబాని పూజా మందిరంలో పెట్టి, “మాకు చాల కష్టాలు వున్నాయి, ఆ కష్టాలు నీ ద్వారానే తీరాలి అంటూ ఆ కోడలు బాబా కి దండం పెట్టింది.
ఆ ముసలమే కొడుకు సిగరెట్స్, పాన్ సామాను ఒక బల్లపై పెట్టుకొని, ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం వరకు అమ్మేవాడు.
వాళ్ళింట్లో శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ చేయించి కొడుకును కూడా చేయమన్నాను.
అతను“నేను పొద్దున్న వెళితే సాయంత్రం దాక రాను నాకు కుదరదు. అందుకని ఒక్క రోజులో పారాయణ చేసేది ఉంటే ఇవ్వ”మన్నాడు, నేను ఇచ్చాను.
ఆతను పారాయణ చేసాక అప్పటిదాకా బల్ల మీద పెట్టి అమ్ముకునే అతనికి, ఒక షాప్ లాగా తయారయింది, బాబాకి నాల్గు హారతులు చేసేవారు. కోడలు బాబాని పూర్తిగా పట్టుకుంది.
ఆమెకి ఏ ఇబ్బంది వచ్చిన బాబాకి చెప్పుకునేది. దానికి సమాధానంగా బాబా ఆమె భర్తకి ఎదో విధంగా ఇచ్చేవాడు.
వాళ్ళింట్లో బాబాకి నేను సహస్రనామం కూడా చేసాను, నేనలా సహస్ర నామం చేయడం చూసి కొంతమంది వాళ్ళ ఇంట్లో కూడా చేయమన్నారు.
నేను ఎవరు అడిగితే వారింట్లో బాబాకి అభిషేకం సహస్రనామం చేసేవాడిని,
పూజ జరిగిన రోజు ఆఇంటి వారికి బాబా కలలో కనిపించేవాడు. ప్రసాదం లాగా వాళ్ళు భోజనం పెట్టేవారు. నేను తినేవాడిని. వాళ్ళకి మంచి జరిగేది. బాబా పారాయణ సప్తాహం కూడా చేసేవాడిని.
వేరే ఇంట్లో ఒకామె రోజు బాబాకి నాల్గు హారతులు చేసి, అభిషేకం కూడా చేసేది. అలా ఒకటి రెండు రోజులు హారతి మాత్రమే చేసి అభిషేకం చేయకుండా పడుకుండి పోయిందట.
ఆమెని బాబా లేపి ఏం అభిషేకం చేయకుండానే పడుకుండిపోయావే! లేచి నాకు అభిషేకం చేయి”అని అన్నాడుట కలలో ఆమె ఉలిక్కి పడి లేచి వెళ్లి వెంటనే అభిషేకం చేసిందట.
Latest Miracles:
- పిలిచి అవకాశం ఇవ్వటం బాబా కృప కాకా మరేమిటి–Audio
- శివ స్వరూపంలో నా సాయీశ్వరుడు
- భక్తురాలి కోరిక – బాబా లీల
- సచ్చరిత్ర ద్వారా ఉపవాస దీక్ష గురించి తెలిపి తన భక్తురాలి దీక్ష విరమించుకునే లాగా చేసిన బాబా గారు.
- చిన్న వయసు నుండే సాయి మార్గములో ఉన్న ప్రసాదు—Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments