Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
భక్తురాలు: మాధవి గౌతమ్
నివాసం: భువనేశ్వర్.
షిర్డీ వాసాయ పద్మహే సర్వ సిద్దిష్టధీమహి తన్నో సాయి ప్రచోదయాత్
సాయి బంధువులందరికి సాయిరాం. నా పేరు మాధవి గౌతమ్. మాది భువనేశ్వర్. బాబా గారికి సంబంధించిన ఒక లీలను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
నేను నవ గురువార వ్రతం చేద్దాం అని నిర్ణయించుకొని రెండవ గురువారం రోజున అనగా 26.1.2017 రోజున సెలవుదినం కావడంతో బాబాకు,
బాబా నేను ఈ రోజు మీకు మంచిగా పూజ చేస్తాను, నాకు ఏదో ఒక లీల చూపిస్తే సంతోషిస్తాను అని చెప్పాను.
బాబాకి పంచామృతంతో అభిషేకం చేద్దాం అని పాలు, పెరుగు, తేనే, చెక్కర, నెయ్యి లతో బాబాకి పంచామృతాభిషేకం చేశాను. తరువాత శుద్దోదక స్నానం చేయించాను.
ఇది అంతా బాబా విగ్రహంను ఒక వెండి ప్లేట్ లో పెట్టి చేశాను. వస్త్రం సమర్పయామి అన్నప్పుడు బాబా గారిని ఆ ప్లేట్ లో నుండి తీసి, బాబా కు వస్త్రం కడతాం కదా! బాబాను తుడుద్దాం అంటే ఒక్క చుక్క కూడా బాబా మీద నీరు లేదు.
పంచామృతాభిషేకం చేసిన తరువాత ఏ ఒక్క పదార్థము కూడా బాబాని అంటుకోలేదు.
శుద్దోదక స్నానం చేయించా కదా! కొంచం నీరైనా బాబా విగ్రహానికి అంటుకొని ఉండాలిగా అది కూడా లేదు. పోనీ నేనేమైన భ్రమలో ఉన్నానేమో అనుకుని ఒక వస్త్రంతో బాబాని తుడిచాను.
వస్త్రం కూడా తడవలేదండి. బాబా అంతా పొడిగా ఉన్నారు. బాగా ఆశ్చర్యం వేసింది. ఏమి జరుగుతుందో అర్ధం కాలేదు. తరువాత అర్ధం అయింది, బాబాని ఒక లీల చూపించమంటే ఇలా చూపించారా అని!
అలనాడు “మేఘశ్యాముడు బాబాకి అభిషేకం చేస్తానంటే బాబా సరే అంటారు. తీరా అతడు అభిషేకం చేస్తే కేవలం తల మాత్రమే తడిసి, మిగతా దేహమంతా పొడిగా ఉంటుంది కదా”! అటువంటి లీల నాకు బాబా చూపించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను .
~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~
*** సాయిసూక్తి:
“ఎల్లప్పుడూ గురువుని అంటి పెట్టుకో”.
Latest Miracles:
- బాబా గారితో నా పరిచయం, నా జీవితం లో బాబా గారు చూపిన మొదటి అద్భుత లీల.
- వినాయక చవితి నాడు బాబా ఫోటో రూపంలో భక్తురాలి ఇంటికి వచ్చుట…Audio
- బాబా తన భక్తురాలికి తానే ప్రసాదం పంపిన అద్భుత లీల(ఇందిరా గారి అనుభవాలు)–Audio
- మందిర నిర్మాణ ప్రదేశం పట్ల భక్తురాలి కలలో ఇష్టత చూపిన బాబా వారు
- బాబా గారు నా అనారోగ్య సమస్యని స్వయంగా బాగుచేసిన లీల
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments