బాబా తన భక్తురాలికి తానే ప్రసాదం పంపిన అద్భుత లీల(ఇందిరా గారి అనుభవాలు)–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



This Audio Prepared by Mrs Archana


సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

విజయవాడ వాస్తవ్యులు శ్రీ  ఇందిరా గారు తమ కుటుంబంలో జరిగిన మూడు బాబా లీలలను saileelas.com ద్వారా సాయి బంధువాలతో పంచుకోవడానికి నాకు వాట్సప్ లో పంపించారు.

వారికీ బాబా వారి ఆశీస్సులు సదా ఉండాలని బాబా వారిని కోరుకుంటున్నాను. ఇక చదవి ఆనందించండి.

మా  పెద్దమ్మాయి పేరు రేవతి  డిగ్రీ  ఫస్ట్  ఇయర్ లో   ఉండగా   తన ఫ్రెండ్  ఫ్యామిలి తో పాటు   షిరిడి  వెళ్లరు.

బాబా  దర్శనం  చేసుకుని బయటకు వస్తుంటే  ఒక  పూజారి గారు    ఆ  అమ్మాయిని  పిలిచి  ఒక  ఆరంజ్  తాడు,  ప్రసాదం  ఇచ్చి  మీ  ఫ్రెండ్  రేవతి   కి  ఇవ్వమని  ఇచ్చారట. 

ఆ  అమ్మాయి షిర్డీ నుండి వచ్చాక  మా అమ్మాయి కి  ప్రసాదం,  తాడు  ఇచ్చి  మీకు  షిరిడి  లో  చుట్టాలు  ఉన్నారా  అని  అడిగింది.  మా అమ్మాయి మాకు షిర్డీ లో తెలిసిన వారు ఎవరు  లేరు  అని  చెపితే, ఆ అమ్మాయి  ఏమో  నాకు తెలియదు  పూజారి   గారు ఈ తాడు, ప్రసాదం మీకు   ఇచ్చి  అడిగానని చెప్పమన్నారు  అని  చెప్పింది.  మా  అమ్మాయి  ప్రసాదం  తెచ్చి నాకు  ఇచ్చి, ఆ విషయం అంత చెప్పింది.

నేను  మా  అమ్మాయి  తో  ఆ రూపంలో బాబా గారు ఆరంజ్  తాడు,  ప్రసాదం నీకు  పంపించారు  అని,  ఆ  తాడు  మా  అమ్మాయి  చేతికి   కట్టి  ప్రసాదం  అందరమూ తీసుకున్నాము. ఈ సంఘటన 2003 జరిగింది అనుకుంటా. ఈ అమ్మాయికి బాబా కనబడుతుంటారు. ఏదైనా ఆడిగితే సమాధానం చెపుతుంటారు.

2003వ సంవత్సరంలో  నెల గుర్తు లేదు ఒక రోజు చేపాతీలు చేసి బంగాళదుంప కూర చేసి స్టౌ ప్రక్కన పెట్టాను రాత్రి 8 కి మా రెండవ అమ్మాయి స్కూల్ నుండి రాలేదు వచ్చాక అందరమూ తినవచ్చు అని కూర్చున్నాము మా అమ్మాయి వచ్చాక తిందామని చుస్తే  పైన ఉన్న చపాతీ కొంచం తుంచి ఉంది ప్రక్కన  ఉన్న  కూర మధ్యలో కొంచం తీసినట్టుగా ఉంది.

నాకు అర్థంకాక పిల్లల్ని అడిగా మీరెవరన్నా తిన్నారా అని.  వాళ్ళు లేదు అని చెప్పారు.  తరువాత మా అమ్మాయికి  బాబా నేనే తిన్నానని చెప్పారు.

మా  ఫాదర్,   మదర్   కాశి   వెళ్లినప్పుడు  అక్కడ    పండుగాని,  కూరగాయగాని ఏదో ఒకటి  వదిలిపెట్టాలని   మా  నాన్న   గారు  జామకాయ  వదిలి  వచ్చేసారు.

తరువాత  వాళ్ళకి  షుగర్  వచ్చింది.  షుగర్  వాళ్ళు  తినే  ఫ్రూప్ట్స్  ఏముంటాయి.  జామకాయ  తప్ప  ఏమి  తినకూడదు.

మా  మదర్  మా  అమ్మాయిని  బాబాని  అడగమన్నారు  జామకాయ తినోచ్చేమో    అని.   కాశిలో వదిలారు  అది  ఎలా  కుదురుతుంది  అని బాబా  చెప్పారు .

తరువాత  రెండు  రోజుల  తరువాత  నాకు  ఎవరో  పెద్ద  జామకాయ   ఇచ్చారు.  నేను  దానిని  కడిగి  బాబాకి  నైవేద్యంగా పూజలో  పెట్టాను.

నేను  టీచర్ గా పని   చేసేదానిని.  నేను  స్కూల్  కి  వెళ్లి  సాయంత్రం  వచ్చే  చుస్తే   పూజలో  జామకాయ  లేదు.  నేను  పిల్లలు  తిన్నారేమో  అనుకుని ఊరుకున్నాను.

మేము  కాలనిలో  ఉంటాం. మా  వెనుక  లైన్లో  మా  మదర్  వాళ్ళు  ఉంటారు . సాయంత్రం  6గంటలకి నన్ను మా  మదర్  పిలిచి  వాళ్ళ ఇంటిలో దేవుడి దగ్గర ఒక  కవర్  లో  జామకాయ  పెట్టి   ఉందని   చూపించారు.

అవి  నేను  బాబాకి  నైవేద్యం  పెట్టిన జామకాయ,   నేను   ప్పక్కన  పడేసిన  నల్లని  కవర్.  అప్పుడు అర్ధమైంది  మా  మదర్ జామకాయ తినవచ్చా, లేదా అని బాబాని  అడిగారు  కదా! దానికి

సమాధానంగా బాబా  ఆ జామకాయ ను మా  ఇంట్లో  మాయం  చేసి  మా  మదర్ వాళ్ళ  ఇంట్లో  పెట్టి  తినవచ్చని సూచించారు.

మా  పెద్దమ్మాయి  పెళ్లికి  మొదటి  శుభలేఖ  బాబాకి  ఇంట్లో   పూజలో   పెట్టి  పెళ్లికి  రమ్మని   పిలిచాను.

పెళ్లిలో మేము  బిజీగా  ఉన్న సమయంలో  ఒక  ఆవిడా  వచ్చి  మా  అమ్మగారితో  నాకు  భోజనం  పెడతారా   అని  అడిగారు.  మా  అమ్మగారు తీసుకువెళ్ళి భోజనం  పెట్టించారు.  

ఆవిడా  తింటూ  నావంక  చూస్తూనే  వున్నారట  నేను  గమనించలేదు.  తరువాత  మా  అమ్మగారు ఆ రూపంలో   బాబానే  వచ్చారని చెప్పారు.  ఆవిడా కళ్ళు  నీలంగా ఉన్నాయట.

ఆ విషయం తెలిసి చాలా  బాధపడ్డాను  బాబాని  పిలిచాను అయన వస్తే  గుర్తుపట్టలేదు  అని.

సర్వం సాయినాథర్పాణమస్తు 

మరిన్ని సాయి బాబా వారి లీలలు Audios కోసం saileelas.com ను సందర్శించగలరు.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “బాబా తన భక్తురాలికి తానే ప్రసాదం పంపిన అద్భుత లీల(ఇందిరా గారి అనుభవాలు)–Audio

Sunitha

బాబా లీలు అమోఘం తన బిడ్డలను కనిపెట్టుకుని ఉంటారు

Sreenivas Murthy

బాబా లీలలు అద్భుతంగా ఉన్నాయి సాయి.

kishore Babu

Sai Baba…Sai Baba…Sai Baba.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles