Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
బాబాతో మరికొన్ని అనుభవాలు
ప్రియమైన పాఠకులారా ! యింతకు ముందు చెప్పినట్లుగా మా నాన్నగారు సుమారుగా 17 సార్లు షిరిడీకి వెళ్ళారు. అలా వెళ్ళిన ప్రతిసారి 7 రోజుల నుంచి ఒక నెల దాకా వుంటూండేవారు.
అక్కడున్న కాలంలో వారు ఆసక్తికరమయిన లీలలను చూడటం జరుగుతూ ఉండేది. వారికి షిరిడీని వదలి వెళ్ళాలనిపించేది కాదు. కాని, బాబా యెప్పుడయితే వానిరి షిరిడీనించి వెళ్ళిపొమ్మనేవారో అప్పుడు వారు షిరిడీ నుంచి వెళ్ళిపోయేవారు.
మా నాన్నగారి వద్ద అటువంటి మంచి అనుభవాల సేకరణ ఉంది, నాకవన్నీ గుర్తుండకపోవచ్చు. ఈ అనుభవాలలో సాయి సచ్చరిత్రలో వివరింపబడని కొన్నిటిని యిప్పుడు వివరించటానికి ప్రయత్నిస్తాను.
ఆ రోజులలోనున్న సాయి భక్తులకు అటువంటి అనుభవాలు యెన్నో కలిగే ఉంటాయని నాకు బాగా తెలుసు, వారు వాటిని తమ దగ్గరవారికి కూడా చెప్పే ఉంటారు.
బాబా మీద నాకున్న స్సచ్చమైన ప్రేమ, భక్తి వల్ల నేను వాటిని మీకు వివరిస్తున్నాను.
నానావలీ
సాయిబాబాకి తలతిక్క స్వభావం గల నానావలీ అనే భక్తుడుండేవాడు. నేనతనిని చంచల స్వభావి అని స్వేచ్చగా అనడానికి కారణం అతను కోతిచేష్టలు చేస్తూ ఉండేవాడు.
అవి జనాలకి కోపం తెప్పిస్తూ ఉండేవి. వారు అతని దుష్ప్రవర్తన గురించి బాబాకి ఫిర్యాదు చేస్తూ ఉండేవారు. మానాన్నగారికి నానావలీ అంటే వేరొక విథమైన ఆదరణ ఉండేది.
అతను హెర్నియాతో బాథపడుతూ ఉండటం వల్ల, అలా పెరిగిన భాగం నేలను తాకుతూ ఉండేది.
అతను ఆ విథంగానే నడుస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు అతను గుడ్డ పీలికలని తన పైజామాకి వెనకాల కట్టుకుంటూ ఉండేవాడు. అది పొడుగ్గ తోకలాగా తయారయేది.
అప్పుడతను కోతిలాగా గెంతుతూ ఉండేవాడు.
గ్రామంలోని పిల్లలంతా అతని కోతి చేష్టలకి పరిహాసంచేస్తూ ఉండేవారు.
ఆ స్థితిలో అతను బాబా దగ్గిరకి పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లల తాకిడినించి రక్షించమనేవాడు.
ఈ మనిషి అంత హెర్నియాతో ఉండి కూడా అంత వేగంగా యెలా పరిగెత్తగలిగాడో అని మా నాన్నగారు విస్మయం చెందుతూ ఉండేవారు. అతను పిచ్చివాడని ఆయనెప్పుడూ అనుకోలేదు.
నానావలి మా నాన్నగారిని ‘గవాల్యా’ అని పిలుస్తూ ఉండేవాడు. ఆయనని భోజనం కోసం అర్థిస్తూ ఉండేవాడు. అప్పుడు మా నాన్నగారు సగుణ నడిపే హొటలుకు వెళ్ళి అతనికి కడుపునిండా భోజనం పెట్టమని చెప్పేవారు.
మా నాన్నగారి అభిప్రాయం ప్రకారం సాయిబాబా, నానావలీ, రాముడు, ఆయన గొప్పభక్తుడైన హనుమాన్ జంటలా ఉండేవారనుకునేవారు.
ఒకసారి నానావలీ బాబాతో తనని ఆయన ఆసనంలో కూర్చోనిమ్మని అథికారికంగా అడిగాడు.
బాబా అతనన్నదానికి అనుకూలంగా స్పందించి తన ఆసనం నుండి లేచి, నానావలిని అక్కడ కూర్చోనిచ్చారు. నానావలి అక్కడ కొంచెంసేపు కూర్చుని లేచి,
“దేవా, నువ్వు మాత్రమే ఈ ఆసనాన్ని అథిష్టించగలవు. కారణం అది నీకు తగినది. నా సరియైన స్థానం నీ పాదాల దగ్గిర మాత్రమే” అన్నాడు.
బాబాని అలా తన ఆసనంలో కూర్చొనిమ్మని అడగటానికి నానావలికెంత గొప్ప థైర్యం ఉందో , యింకా తనకిష్టుడైన నానావలి మీద బాబా యొక్క అమితమైన ప్రేమ ఆయనని తన ఆసనాన్ని యిచ్చేలా చేయడం మీరందరూ ఊహించుకోవచ్చు.
కాని మా నాన్నగారు వారిద్దరినీ రాముడు, హనుమాన్ జంట అనుకోవడానికి కారణం వేరే ఉంది. ఒకసారి నానావలి మానాన్నగారితో
” హే గవాల్యా నాతో కూడా రా, నీకొక తమాషా చూపిస్తాను” అన్నాడు.
అతను మా నాన్నగారిని ద్వారకామాయికి దగ్గరగా ఉన్న చావడి లోకి తీసుకుని వెళ్ళాడు.
బాబా అక్కడ చావడిలో కూర్చుని ఉన్నారు. యిక ఆలశ్యం చేయకుండా నానావలి తన ఆకారాన్ని తగ్గించుకుని ‘హండీ’ లో (హండీ – చావడిలో పై కప్పుకి చిన్న చిన్న తాళ్ళతో కట్టబడి ఉన్న గాజు గిన్నెలు) పట్టేటంత చిన్నగా తనకి తాను సులువుగా పైకి గెంతి పైన ఉన్న ఒక హండీలో కూర్చున్నాడు.
అతను హండీలో ఒక కోతిలా కూర్చుని మా నాన్నగారిని వేళాకోళం చేశాడు. అది చూసి మా నాన్నగారు ఆశ్చర్య పోయారు. అది నమ్మశక్యం కానిది. అది ఒక అద్భుతం తప్ప మరేమీ కాదు.
నానావలి తన పెద్ద శరీరంతో అంతపైకి యెలా గెంతగలిగాడు. తన శరీరాన్ని దానికి తగినట్లుగా చిన్నది చేసుకుని హండీలో యెలా కూర్చోగలిగాడు.
అది సామాన్యంగా ఆశ్చర్యకరమైనదీ, నమ్మశక్యం కానిదీ. అప్పుడాయన సాయిబాబా నానావలీ యిద్దరూ రాముడు, హనుమంతుడు అవతారాలని అర్థమయింది.
ఆయన వెంటనే బాబా ముందు సాష్టాంగపడి ఆయనని పూజించారు.
ప్రియమైన సాయి భక్త పాఠకులారా, బాబా సమాథి చెందిన తరువాత నానావలి చాలా విచారంలో మునిగిపోయి పదమూడవ రోజున అతను ఈ ప్రపంచాన్ని వదలి వెళ్ళిపోయాడు.
లెండీ బాగ్ ద్వారానికి తూర్పువైపున నానావలి సమాథి ఉంది. నేను షిరిడీ వెళ్ళినపుడు యెప్పుడూ దానిముందు నమస్కరిస్తాను. లార్డ్ సాయికి, ఆయన లీలలకు కోటి కోటి ప్రణామాలు.
రేపు తరువాయి భాగం…
ఈ సమాచారం http://telugublogofshirdisai.blogspot.in/ ద్వార సేకరించబడింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నానావలికి సంబందించిన ఒక సంఘటన–Audio
- నాకు ఒక బంగారు చైన్ దొరికింది,అది ఎవరిదో నా దగ్గరికి వచ్చి సరియైన ప్రమాణం చూపించి తీసుకెళ్లు వచ్చు
- నేను ద్వారకామాయిలో కూర్చుని నేనెన్నడూ అబథ్థం చెప్పను–Taarkad-31–Audio
- సమాధి చెందినా గాని , నా ఎముకలు మీ తో మాట్లాడును–Taarkad-34–Audio
- నన్ను శరణుజొచ్చు వారిని రక్షించుటయే నా కర్తవ్యం–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “నా సరియైన స్థానం నీ పాదాల దగ్గిర మాత్రమే–Taarkad-12–Audio”
kishore Babu
August 22, 2016 at 5:27 pmThank you… Sai Suresh..