Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
పేరు తెలియని ఒక సాయి భక్తుడు చెప్పిన లీల.
ఒకసారి ఒకానొక సందర్భంలో షిరిడీలో నివసిస్తున్న నానావలి అనే సన్యాసి, బాబాగారు ఉన్న కాలంలో రోడ్డుమీద నిలబడి బాబాని చాలా అగౌరవంగా నిందించసాగాడు.
బాబా అప్పుడు ఒక కార్యం మీద ద్వారకామాయినించి బయటకు వెళ్ళి అప్పుడే తిరిగి వస్తున్నారు. ఆయన భక్తులు బాబా గురించి చాలా చెడుగా, అవమానకరంగా నిందిస్తున్న నానావలిని దుడ్డుకఱ్ఱతో విచక్షణా రహితంగా బాదుతూ ఉండటం, అప్పుడే అక్కడకు చేరుకున్న బాబా చూడటం జరిగింది.
బాబా కొద్ది దూరంలో నిలబడి తనకు చాలా బాధగా ఉన్నదని చెప్పారు. కొంత మంది భక్తులు ఏమిటి మీబాధ అని అడిగారు.
బాబా నానావలి వైపు చూపిస్తూ పాపం, ఆ అమాయక సాధువుని మీరెందుకని కొడుతున్నారని అడిగారు. మీరతనిని కొడుతూండటం వల్ల నావీపు మీద నొప్పి కలుగుతున్నది అన్నారు బాబా.
అప్పుడు వారు నానావలిపై తాము చేసిన పనికి సిగ్గుపడి అతనిని బాధించడం మానుకొన్నారు.
నానావలి తనను చెడుగా మాట్లాడినా బాధపడకుండా, నానావలి ఆ శిక్షకు అర్హుడయినప్పటికీ అతనిని తాను కాపాడవలసినదేనన్న బాబా నిర్ణయం, బాబాయొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే సంఘటనలలో ఇది ఒకటి.
నేను భగవంతుని ప్రార్ధించేదేమిటంటే మహదీ బువా , నరసిం హస్వామీజీ, కమరుద్దీన్ బాబా లేక అబ్దుల్ బాబా గాని, మరెవరయినా గాని, ఆయన భక్తుడు ఎవరయినా గాని, నాస్నేహితులకు, నాకు , సహాయం చేసినట్లుగానే వారికి కూడా ఇదే విధమయిన సహాయాన్నందించమన్నదే నా ఒకే ఒక ప్రార్ధన.
సాయిసుధ
ఏప్రిల్, 1950
ఈ సమాచారం ఈ లింక్http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నా సరియైన స్థానం నీ పాదాల దగ్గిర మాత్రమే–Taarkad-12–Audio
- డబ్బాకు అడుగున రంధ్రం ఉన్నా కూడా బాబా తన అభిషేక తీర్ధం కారిపోకుండా అలాగే ఉంచిన సంఘటన–Audio
- బాబాగారు జీవించి ఉన్న రోజులలో జరిగిన సంఘటన–Audio
- శాంత మరియు ఒక బాలుడిని బాబా కాపాడారు–Audio
- సాయి బాబా వారు ఒక భక్తుని కోరిక ఇంకొక భక్తుని ద్వారా తీర్చుట.–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments