బాబాగారు జీవించి ఉన్న రోజులలో జరిగిన సంఘటన–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-194-2412-బాబాగారు జీవించి 3:09

బాబాగారు జీవించి ఉన్న రోజులలో జరిగిన సంఘటనలలో ఒక సంఘటనను మహదీ బువా గారు ఈ క్రింది విధంగా వివరించారు.

ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన లో భక్తుని పేరు తెలియక పోవటం మన దురదృష్టకరం .

చైనా బజార్ లో గొప్ప సంపన్నుడు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు.

అతనికి వ్యసనాలు బాగా ఎక్కువ. ఆ యువకుడు బాగా అత్యాస గల వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేశాడు.

ఆ వడ్డీ వ్యాపారులు ఇతని వద్ద ఉన్నదంతా లాగేసుకొని, వారు తాము ఇచ్చిన అప్పుకంటే అత్యంత అధిక మొత్తాలకి బాగా ఎక్కువ వడ్డీకి ప్రామిసరీ నోట్లు వ్రాయించుకొన్నారు.

ఆ యువకుడు హీన స్థితికి దిగజారాడు. ఆ దౌర్భాగ్య స్థితి మరియు దివాల పరిస్థితి నుండి బయటపడటానికి షిరిడీ వెళ్ళి సాయిబాబా ఆశీర్వాదములు తీసుకొమ్మని తెలిసినవారు సలహా ఇచ్చారు.

అతను షిరిడీ మసీదుకు వెళ్ళినప్పుడు, బాబా ఆగ్రహంతో, డబ్బు ఇవ్వడానికి బదులు, కఱ్ఱ తీసుకొని అతని వెనకాల పరుగెత్తి అతనిని కొట్టి ఇలా అన్నారు ” సగ్లా పైసా పనిన్ తక్లా పూడె జా మీ ఎతో” (నీ డబ్బునంతా నీటిలోకి విసిరి వేశావు.

నువ్వు వెళ్ళు, నేను వస్తాను, నీకంటే ముందు నేనక్కడ ఉంటాను). ఆయువకుడు నిరుత్సాహంతో అణగారి పోయి బొంబాయికి తిరిగి వచ్చాడు. కాని అతను తన ఇంటిని సమీపించగానే తన ఇంటిలో జరుగుతున్నదానిని చూసి చాలా ఆశ్చర్యపోయాడు.

తనకు అప్పు ఇచ్చిన ఒక వడ్డీవ్యాపారి అక్కడ ఉన్నాడు.

బాబా ఆ వడ్డీవ్యాపారితో “నువ్వు మళ్ళి ఈ అప్పుతీసుకున్నవాడి దగ్గరకు వచ్చావంటే నీ మెడ విరిచేస్తాను” అంటూ ఆవడ్డీ వ్యాపారిని బెదిరిస్తూ కనిపించారు.

అతని వద్ద తాకట్టుపెట్టిన నగలు, పత్రాలన్నిటినీ వ్యసనపరుడైన ఋణగ్రస్తునికి తిరిగి ఇచ్చివేయమని ఆజ్ఞాపించారు. తీసుకున్న అప్పుమొత్తం ముట్టినట్లుగా కూడా పత్రం రాసి యిమ్మని వత్తిడి చేశారు. వ్యసనపరుడయిన యువకుడు బాబాని చూడగలిగాడు,

కాని ఆ వడ్డివ్యాపారి ఒక దెయ్యాన్ని చూశాడు. ఏమయినప్పటికీ ఆ వడ్డివ్యాపారి భయంకరమైన దెయ్యాన్ని చూసి, తనను బలవంత పెట్టడంతో భయంతో అతను చెప్పినట్లే చేశాడు.

అతను తన వద్ద తాకట్టు పెట్టిన నగలన్నిటినీ , పత్రాలనూ, తిరిగి ఇచ్చివేసి, అప్పుమొత్తం తీరిపోయినట్లుగా దస్తావేజు కూడా రాసి ఇచ్చాడు.

బాబా వ్స్యనపరుడయిన యువకుడి వైపు తిరిగి “నేను నిన్ను విడిచిపెట్టేశాననుకున్నావు. కాని ఎవరయితే నన్ను శరణు వేడుతారో వారిని నేనెప్పుడు విడిచిపెట్టను (మాలా కోనీ శరణ్ ఘెయున్ ఆలె, త్యానా మీ కెవ్హం సొడ్నర్ నహీ)

శ్రీ బీ.వీ.నరసిం హస్వామీజీ గారి వివరణ

బొంబాయిలో నివసిస్తున్న ఈ నిజమైన భక్తుని నేను చూశాను. అతను చెప్పినదంతా నిజమని నేను నమ్ముతున్నాను.

సౌజన్యం:

సాయిసుధ
ఏప్రిల్, 1950

ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “బాబాగారు జీవించి ఉన్న రోజులలో జరిగిన సంఘటన–Audio

Sai Suresh

బాబా ను నమ్ముకుంటే యెంత కష్టం అయిన తిరవలిసింది. అయన సాక్షాత్ కదిలివచ్చి మరి ఆదుకుంటారు కావలసింది శ్రద్ధ, సహనం మాత్రమే.
అందరు మేము శ్రద్ధ, సహనం లతో ఉన్నామని అయిన సాయి కరుణించత్లేదని అనుకుంటుంటారు. అందుకే సాయి బదేబాబా, శ్యామ, దీక్షిత్ లను పరిక్షించినది. దీక్షిత్ మాత్రమే మేకను నరకమన్న పరీక్షా లో నిలిచారు. అందుకే ఎవరి శ్రద్ద, సహనం లను ఎప్పటికి అప్పుడు పరిక్షిన్చుకుంటు సాయి పట్ల వారి శ్రద్ధ, సహనం లను దృడ పరుచుకోవాలి. అదే సాయి కోరే దక్షిణ.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles