22 సార్లు చెక్ బౌన్స్ కేసులైతే నన్ను ఒకసారి కూడా కోర్టు బోను ఎక్కకుండా, నాకు సమస్యలేమీ రాకుండా బాబాగారు నన్ను కాపాడారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నేను అప్పుల బాధ నుండి తట్టుకోలేక పోతున్నాను. ఆ అప్పు కూడా నేను నా సొంతానికి చేయలేదు.

బంధువులు, స్నేహితులు కోసం నేను హామీ ఉండటం మూలాన కొంతమంది కట్ట గలిగి ఉండి కూడా కట్టలేక నా మీదకి తోసారు. కొంతమంది కట్టలేక నా మీదకి పడిపోయాయి.

నేను తట్టుకోలేని పరిస్థితుల్లో ఉండగా బాబా గారు నన్ను అక్కడ నుండి కొంచెం రిలీఫ్ కోసం అయితేనేమి మరేదైనా అయితేనేమి నన్ను కొయ్యలగూడెం ట్రాన్సుఫర్ చేసారు.

రాజమండ్రి లో ఇల్లు అమ్మేసినా, కాస్తో కూస్తో ఉన్న పొలం అమ్మేసినా కూడా నా అప్పులు తీరలేదు.

రాజమండ్రిలోనే చదువుకొని అక్కడే ఉద్యోగం చేసిన నాకు ఇదంతా అనుకోని పెనుమార్పులు.

నాకొక అబ్బాయి. అది కూడా నాకు పెళ్లి అయిన పన్నెండు సంవత్సరాలకి లేక లేక కలిగిన సంతానం.

వాడి ముద్దు ముచ్చట చూసుకోవడానికి కూడా అన్ని అవరోధాలయ్యాయి. అన్ని దారులు మూసుకు పోయాయి. అంధకారం అయిపొయింది.

రాజమండ్రి లో పదిహేను సంవత్సరాల నుండి వున్నందుకు నన్ను ఈ సమయంలో ట్రాన్సుఫర్ చేసారు.

22 సార్లు చెక్ బౌన్స్ కేసులైతే నన్ను ఒకసారి కూడా కోర్టు బోను ఎక్కకుండా, నాకు సమస్యలేమీ రాకుండా బాబాగారు నన్ను కాపాడారు.

ఎలాగంటే వాళ్లంతా నన్ను వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఏదైనా హామీ ఉన్నవాళ్లకే కదా  ఇబ్బంది అంతా.

అందుకని నేను ఎక్కవగా గౌరీ శంకర్ గారి దగ్గరే గడుపుతూ ఉండటం వలన వీళ్లంతా నన్ను వెతుక్కుంటూ అక్కడికే వచ్చేవారు ఆయన ఎదురుగ్గానే నన్ను డబ్బులు కట్టమంటూ అడిగేవారు.

అలా చూసి చూసి ఒకసారి గౌరీ శంకర్ గారు నా గురించి వాళ్ళకి వివరించారు.

అతని పరిస్థితి ఏమీ బాగాలేదు. అతను అప్పులు ఎగగొట్టే వాడు కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కడతాడు. అతను తన ఉద్యోగం కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు.

అంతా ఒకసారి కట్టమంటే కట్టలేడు. అతను తరఫున నేను చెబుతున్నాను. అతను కొద్ది కొద్దిగా వాయిదా పద్దతిలో కడతాడు.

దయచేసి దానికి ఒప్పుకోండి అని ఆయన చెప్పారు. వాళ్ళు దానికి ఒప్పుకున్నారు.

కొయ్యల గూడెం లో బాబా గారి గుడి లేదు. నేను ఇంట్లోనే బాబా హారతులు చేసుకునే వాడిని.

నేను తరచూ రాజమండ్రి లో ఉన్న భార్యని అబ్బాయిని చూసుకొని, గురువుగారిని దర్శించుకొని, ఒక రోజు ఉండి వస్తుండేవాడిని.

ఆ సమయం లో కొయ్యల గూడెం కి దగ్గరలోనే అంకాల గూడెం అనే ఊర్లో  దత్త భగవానుడి చిన్న విగ్రహం గణపతి సచిదానందా స్వామి వారు ప్రతిష్టించినది అక్కడ ఉంది.

అక్కడ ఔదుంబర వృక్షం కూడా ఉందని అక్కడే నాలుగు కుటుంబాల వాళ్ళు దత్త భగవానుడి భక్తులు ఉన్నారని తెలుసుకొని, నేను అక్కడకి వెళ్లి వాళ్ళని పరిచయం చేసుకొని, నేను అక్కడకి క్రమంగా వెడుతూ అక్కడే పారాయణాలు చేసుకొని రోజూ బ్యాంకు కి వెడుతుండేవాడిని.

నేను కొయ్యల గూడెంలో ఒక రూంలో ఉండేవాడిని. ఆ రూంలో నేను బాబాకి ఉదయం, సాయంత్రం, రాత్రి హారతులివ్వడం మూలాన జనం కూడా వస్తుండేవారు.

అప్పుడప్పుడు సాయంత్రం సత్సంగాలు కూడా క్రమంగా జరుగుతుండేవి.

The above miracle has been typed by: Mrs. Rajarajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles