ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్న నాకు పక్కింటి వాళ్ళ రూపం లో వచ్చి సహాయం చేసిన బాబా వారు ………!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మా ఆయన అసలు మనిషికాదు, క్రూరమైన మృగం. అవును, మృగం అంటే దానికి కూడాఅవమానమేమో, ఎందుకంటే దానికి ఉన్నది క్రూరత్వమే కానీ వీడికి క్రూరత్వంతో పాటు శాడిజం కూడా వుంది.

ఒకరోజు నేను పారాయణ చేసుకొని పడుకున్నాను, మా  ఆయన అర్దరాత్రి వచ్చాడు. వచ్చినవాడు వచ్చినట్లే నన్ను కొట్టడం మొదలు పెట్టాడు.

రాత్రి 2 గంటల సమయంలో నన్ను గొడ్డుని బాదినట్లు బాదుతున్నాడు. మాపాపకి మెలకువ వచ్చి అది కొట్టద్దు, కొట్టొద్దు అంటూ అడ్డంపడింది.

దాన్ని రెండు బాది, ఇద్దరినీ కలిపి వీధి తలుపులు తీసి ఆ అర్ధరాత్రి పూట అమానుషంగా వీధిలోకి తోసి తలుపు వెయ్యబోయాడు.

నేను ఇంత అర్ధరాత్రి వద్దు తెల్లవారగానే ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోతాను, నీకు ఇక కనపడమన్నా కనపడను అంటూ ఇంట్లోకి రావటానికి తలుపునెట్టబోయాను.

తలుపు వేయబోతూ అతను నన్ను గట్టిగా తోసాడు. ఆ తలుపు సందుల్లో పడి వేలు ముక్క ఊడి పోయింది.

రక్తం కారుతోంది. ఇంత ముక్క తలుపు సందులో ఉండి పోయింది. నేను గట్టిగా అరుస్తున్నా కాని తలుపు ఇంక తీయలేదు.

రోజూ నేను నైటీలో వుంటాను. ఆరోజెందుకో చీర కట్టుకున్నాను. అర్దరాత్రి నేనేం చేయాలి, ఎటుపోవాలి? నాచేతిలో నయా పైసా కూడా లేదు.

ఇంతలో ఒక అబ్బాయి, అతను మాపక్కింట్లోనే ఉంటాడట. నాకు తెలియదు. నాదగ్గరికి వచ్చి ఏంటి మేడం ఈ సమయంలో ఇలా బయటకి వచ్చారు అన్నాడు.

నేను అతన్ని చూసి ఏడ్చుకుంటూ జరిగినదంతా  అతనితో చెప్పాను. మాతమ్ముడికి తన ఫోన్‌ నుంచి ఫోన్చేసాడు. మా తమ్ముడికి విషయం చెప్పి రమ్మనమని  చెప్పాడు.

ఇద్దరమూ వీధి.అరుగు మీద కూర్చున్నాము. మా తమ్ముడి కోసం ఎదురు చూస్తూ. కాసేపయ్యాక  మేడం మీతమ్ముడు రావడానికి ఆలస్యం అవుతోంది,

మీరు ఒక్కరే ఇంతసేపు ఇలా బయట ఉండటం మంచిది  కాదు. నేను మీతమ్ముడు ఇంటి దగ్గర దింపేస్తాను అంటూ పోయే ఆటోని పిలిచి ఎక్కించాడు.

మా శృతి కూడా  బాగా ఏడుస్తోంది. తాను ఆటో ఎక్కాడు. మా తమ్ముడింటి దగ్గర ఆటో ఆగింది. తానే డబ్బులు ఇచ్చాడు, నన్ను  అక్కడ దింపేసి వెళ్ళిపోయాడు.

మాతమ్ముడు అప్పుడే బయలు దేరడానికి సిద్ధంగా వున్నాడు. ఆతర్వాత అతను  ఒకరోజు మాఇంటి దగ్గర కనపడితే

బాబూ! ఆరోజు చాల శ్రమ తీసుకొని నన్ను మాతమ్ముడు ఇంటి దగ్గర  దింపారు, మీకు ఆరోజు కనీసం థాంక్స్‌ కూడా చెప్పలేకపోయాను, పాపం ఆటోకి కూడా మీరే డబ్బులు  ఇచ్చారు, అన్నాను.

అతను నన్ను చూసితెల్లబోయి, “ఎవరుమీరు? మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదే! మిమ్మల్ని నేను ఆటో ఎక్కించుకొని తీసుకెళ్ళానా? నాకేం తెలియదు” అన్నాడు అతను.

మా ఆయన నన్ను బయటికి నెట్టేస్తే  సాక్షాత్తు ఆ సాయినాధుడే వచ్చి నన్ను ఆటో ఎక్కించి సురక్షితంగా మాతమ్ముడింటి దగ్గర దింపి ఆటోకి డబ్బులు   కూడా తానే ఇచ్చాడన్న మాట.

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles