భవిష్యత్తు ని చూపించి నన్ను చావు నుండి తప్పించిన బాబా వారు ……..!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అర్గరాత్రి నన్ను బయటకి పంపించేసిన మాఆయన తెల్లారాక పనులు చేయటానికి పెళ్ళాం కావాలి కదా  మరి, అంటూ బయలుదేరాడు.

ఎందులోనైనా దూకి చచ్చిపోయిందేమోనన్న అనుమానం కూడా వచ్చింది.  కాలువలు, చెరువులు అన్నీ వెతుక్కుంటూ మాతమ్ముడింటికి వచ్చాడు.

మా ఆయన మమ్మల్ని వెతుకుంటూ వచ్చేలోపే మాశృతినేమో మా అక్కఇంట్లో పెట్టి, నన్ను మాతమ్ముడికి తెలిసిన ఉమెన్స్‌ హస్టల్లో పెట్టాడు,  మాతమ్ముడు.

మా ఆయన వచ్చి అడిగితే ఇక్కడికి రాలేదు, మా అక్కని నువ్వే ఎదో చేసావు, అంటూ మాతమ్ముడే  ఎదురు అడిగి పోలీస్‌ రిపోర్ట్‌ ఇచ్చాడు. పోలీసులు మాఆయన్ని అరెస్టుచేసారు.

నన్ను స్టేషన్‌ కి పిలిపించారు.  పోలీసులు  విషయమంతా తెలుసుకున్నారు. మాఆయన్ని మెత్తగా కొట్టారు. వాడి బాధ చూడలేక నాకే బాధేసి  వద్దు కొట్టద్దు అని పోలీసులకి చెప్పాను.

చూసావా నువ్వు ఎంతహింస పెట్టిన ఆవిడ నిన్ను కొట్ట నివ్వడం లేదు. మరొకరు ఐతే నిన్ను చంపేయమని మాకు చెబుతారు అన్నారు C.I.

“ఈమనిషి నీకు ఎక్కడ దొరికాడమ్మా?  వీడికంటే కనీసం రిక్షాతొక్కేవాడిని కట్టుకున్నా నిన్ను బాగా చూసుకునేవాడు, ఎందుకీయన్ని పెళ్లిచేసుకున్నావ్‌?  ప్రేమించి పెళ్లిచూసుకున్నావా”? అని అడిగింది.

ఇందులో రాసినవి మాత్రమే వాడి అరాచకాలు చెప్పాను.  ఇంకా ఇంకా వున్నాయి, అవన్నీ చెపితే మాఆయన్ని ఎన్కౌంటర్‌ చేసి పారేస్తారు పోలీసులు.

నన్ను ఇలా హింసల  పాలు చేస్తే నేనుగా ఇంట్లోంచి వెళ్ళిపోతే, నేను ఉంటున్న ఇల్లుదానికి (మా వారి మరో భార్య) కట్టబెడదాం అని  ఆయన పన్నాగం.

మాఆయన నన్ను చావగొట్టటం రాను రాను నాభారమంతా బాబాకి అవ్పగించి నేనేమైపోయినా పర్వాలేదు బాబా,  ఈఇల్లు మాపాపకే చెందాలి అని నిర్ణయంతో బాబా దయవల్ల భరిస్తూ వస్తున్నాను.

ఆయన కొడుతుంటే నాకు ఏడుపు రావడం మానేసింది, నెప్పి వేయటం లేదు, కన్నీళ్లు రావటం లేదు.

మాఆయన  దగ్గరికి వచ్చి కొడుతుంటే నాకు బాబాయే నాదగ్గరికి వస్తున్నట్లుగా ఉందేది. నెప్పి, బాధ ఏమి ఉండేవి కాదు.

పోలీసులు మాఆయన్ని స్టేషన్లో పెట్టి కొట్టాక అప్పట్నించి నాదేవత, నారాణి అంటూ నన్ను పొగడటం  చేయసాగాడు.

ఏమైనా  కంప్లైంట్  ఇస్తే మళ్ళి పోలీసులు పట్టుకెళ్లి దేహశుద్ధి చేస్తారనే భయంతో వేస్తున్న వేషాలు.

ఒకరోజు మాఆయన కొట్టిన దెబ్బలకి తట్టుకోలేక బాబా పాదాలపై తల పెట్టి ఏడుస్తుండగా అసలు ఈలోకంలో  ఇతను చేత తన్నులు తినటానికి తప్ప నేను బ్రతుకుతోంది ఇందుకేనా?

ఏమైనా సరే ఈబాధల నుండి విముక్తి  పొందాలి అని అనుకొని ఎలుకల మందు తెచ్చుకున్నాను,మింగేద్దామనుకొని సమయం కోసం ఎదురు చూస్తున్నాను.

ఆరోజు నాకొకల వచ్చింది, నేను తెచ్చుకున్న ఎలుకల మందు తాగేసాను కలలొ, నేను చనిపోయాను, నన్ను బయట పడుకో పెట్టారు,

మాతమ్ముడు, మాఅమ్మ, మాఅక్క అందరూ వచ్చి మా ఆయన్ని తిడుతూ, శాపనార్థాలు  పెడుతూ ఏడుస్తున్నారు.

నా కూతురు మాత్రం నామీద పడి ఏడుస్తోంది. దాన్ని ఎవరూ పట్టించుకోవటం లేదు.

నేను దాన్ని నా దగ్గరికి తీసుకోబోయాను, ఉహు నేను దాన్ని ఎత్తుకోలేక పోతున్నాను. కళ్ల  నీళ్లు తుడవాలి అనుకుంటున్నాను కానీ తుడవలేకపోతున్నాను.

ఏడవద్దు అంటున్నాను, నామాటలు గాలిలో  కలిసిపోతున్నాయి. నాచేతులు కూడా గాలిలో ఊగుతున్నాయి.

నేను శృతి శృతి అంటూ ఏడుస్తున్నాను, మెలకువ వచ్చింది. అప్పుడు నాకు అర్ధం అయింది నేను చనిపోతే నా కూతురు అనాధ అయిపోతుందని బాబా నాకు  చూపించాడు అనిపించింది.

నేను లేకపోతే దీని పరిస్థితి మరీ అన్యాయం అయిపోతుంది అని నాకు అర్ధం  అయిపోయి ఇంక నేను చనిపోయే ప్రయత్నం మానుకున్నాను.

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles