Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సూరజ్ గారి అనుభవములు రెండవ మరియు చివరి భాగం
నేను ఉదయాన్నే కాకడ హారతికి గుడికి వెళ్లి “బాబా నీ గుడికి రాక పోవడం వల్లనే నా పరిస్థితి ఇలా అయిపోయింది.
నా తప్పు ఏమి లేకపోయినా అందరి ముందు దోషినయ్యాను. పోలీసు స్టేషన్ కి కూడా వెళ్ళవలసి వచ్చింది.
నన్నొక శత్రువుని విలన్ ని చేసారు. ఇంక వాళ్ళ నుండి నాన్నకి బెదిరింపు ఫోన్స్ రాకూడదు. వాళ్ళు మళ్ళీ ఎక్కడా కనపడకూడదు” అని నేను బాబాకు మొక్కుకున్నాను.
నేను గుడికి వెళ్ళటం మొదలు పెట్టిన రెండవ రోజు నుండి ఇంటికి నా గురించి ఫోన్స్ రాలేదు.
మళ్ళీ ఇంకోసారి వాళ్ళు నా కళ్ళ పడింది లేదు. నేను ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఇంట్లోనే చదువుకున్నాను.
ఆ తర్వాత నాన్న వెళ్లి కాలేజీ లో మాట్లాడితే వాళ్ళు అర్ధం చేసుకుని నా పరీక్షా ఫీజ్ కట్టించుకుని, తర్వాత హాల్ టికెట్ ఇచ్చారు.
సెంటర్ ఎట్టి పరిస్థితుల్లోనూ Dilsukhnagar లో పడకూడదని బాబా కి దండం పెట్టుకున్నాను.
ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఎవరైనా కనపడతారేమో, మళ్ళీ లేనిపోని రభస అవుతుంది అని అనుకున్నాను.
నేను కోరుకున్నట్లుగానే అక్కడ కాకుండా చైతన్యపురిలో పడింది. పరీక్షలు రాసాను. మళ్ళీ సెకండ్ ఇయర్ కాలేజీ లో అడుగు పెట్టాను.
పై సంఘటన నేను మొదటి సంవత్సరం లో జేరిన 4 నెలలలోపు జరిగింది.
ఆ తరువాత నెమ్మదిగా పాత విషయాన్ని ఇంట్లోనూ, కాలేజీ లోనూ దాదాపుగా మర్చిపోయారు.
ఒక రోజు మా ఇంటి దగ్గర 10th క్లాస్ చదువుకునే ముస్లిం పిల్లలు ఉన్నారు.
వాళ్ళ క్లాసుమేట్ ఒక అతను పుట్టిన రోజు అయింది. వాడిల్లు వనస్థలిపురం వేంకటేశ్వరస్వామి గుడి దగ్గర.
వాడిని ఆ ముస్లిం పిల్లలు ‘ఒరేయ్ నీ పుట్టిన రోజుకి మా ఇంటి దగ్గర కేక్ కట్ చేద్దాం రమ్మన్నారు. వాడు సరే అన్నాడు.
ఉన్నవాళ్లు ఊరుకోకుండా ఇంటి దగ్గరే కాబట్టి నేను ఆ వీధిలో మగ పిల్లలతో ఆడుకుంటాను కాబట్టి ఆ ముస్లిం పిల్లలు చోటూ అన్నా నువ్వు పార్టీ కి రా అన్నా అని పిలిచాడు.
నేను మొహమాటానికి సరేలే అన్నాను. ఆ పుట్టినరోజు పిల్లవాడు సాయంత్రం బాగా తయారై అక్కణ్నుంచి మా ఇంటివైపు వస్తున్నాడు.
దారిలో ఒక వ్యాన్ వాళ్ళు వాడ్ని అడ్డగించి ఆపారుట. ఎక్కడికి వెళ్ళుతున్నావు? అన్నారుట. వాడు చెప్పాడు. మేము అటే వెడుతున్నాము. నిన్ను అక్కడ దింపి మేము వెళ్లి పోతాము ఎక్కు అన్నారుట.
వాడు వ్యాన్ ఎక్కాడు, ఆ వ్యాన్ లో ఇద్దరు వ్యక్తులున్నారుట. వాడ్ని ఎక్కించుకుని ఎక్కడికో తీసుకుపోయారుట.
ఆ పిల్లవాడి తల్లి రాత్రి అవుతున్నా పిల్లవాడు ఇంటికి రాకపోయేసరికి వెతుక్కుంటూ ఆ ముస్లింల ఇంటికి వచ్చిందట. వాళ్ళేమో మీ వాడు అసలు ఇక్కడికి రాలేదని చెప్పారుట.
మీ ఇంటికే అని చెప్పాడు. మీరే మా పిల్లాడిని ఏదో చేశారంటూ పోలీస్ కంప్లెయింట్ ఇచ్చిందట.
పోలీసులు వచ్చి ఆ పిల్లల్ని పట్టుకుని తీసుకుపోతుంటే మా ఇల్లు చూపించి చోటూ అన్న కూడా వస్తానన్నాడు పార్టీ కి అని చెప్పారుట.
మేము ఆ సమయంలో గుళ్ళో హారతి లో వున్నాం. పోలీసులు మా ఇంటికి వచ్చి చోటూ ఎవరూ అన్నారుట.
మా అమ్మ మా అబ్బాయే ఎం జరిగింది అందిట. పోలీసులు విషయం చెప్పారుట.
మీ వాడు, ఈ పిల్లలు కలిసి ఆ పిల్లవాడ్ని ఏదో చేశారంటూ ఆ తల్లి కంప్లెయింట్ ఇచ్చింది. అతనేడీ అని అడిగారు. మా అమ్మగారు వాడు గుడికి పోయాడు అని చెప్పారుట.
వాళ్ళు అక్కడ నుంచి తిన్నగా గుడికి వచ్చేసారు. హారతి అయి ప్రసాదం తీసుకుని బయటకి వచ్చేటప్పటికి చోటూ ఎవరు అంటూ పోలీసులు కనపడ్డారు. ఎక్కూ అంటూ జీపు ఎక్కించుకొని స్టేషన్ కి తీసుకుని పోయారు.
మా నాన్న గుడి బయటకు వచ్చేటప్పటికి నేను జీపు లో ఉన్నాను. నన్ను పోలీసులు తీసుకుపోతున్నారు. వెంటనే స్టేషన్ కి వచ్చారు.
మా అమ్మ ఏడ్చుకుంటూ గుడికి వచ్చింది. అక్కడ విషయం తెలుసుకొన్నారు నాన్న. నాకేమి తెలియదనీ నేను చెబుతున్నాను.
వాడ్ని ఏమిచేసారు అంటూ నన్నూఆ ముస్లిం పిల్లలని అడుగుతున్నారు. ఈ లోపు సాయిబాబా గుడిలో కమిటి మెంబెర్ ‘వెంకటరెడ్డి గారు’ పోలీస్ స్టేషన్ కి వచ్చారు.
ఆ అబ్బాయి అలాంటివాడు కాదు, మాకు చాలా రోజులనుండి తెలుసు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అంటూ చెప్పారు. నన్ను ఇంటికి పంపించేశారు. ఆ ముస్లిం పిల్లల్ని అక్కడే ఉంచారు.
మర్నాడు వాళ్ళ ఫోటోలు పేపర్లో కూడా పడ్డాయి. అసలు ఆ అబ్బాయి ని కిడ్నాప్ చేసినవాళ్ళు డబ్బులకోసం డిమాండ్ చేశారట.
ఆ తరువాత సికింద్రాబాద్ దగ్గర కిడ్నాప్ చేసినవాళ్లు ఆచూకీ దొరకడం, వాళ్ళమీద ఫైరింగ్ చేయడం మొత్తానికి వాళ్ళని పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఆ పిల్లవాడు సురక్షితంగా ఇంటికి చేరాడు.
మా నాన్నగారు బాబా ముందు నిలబడి “బాబా మా వాడిని ఇలా అస్తమానం పోలీసులు పట్టుకుపోతున్నారు. వీడి భవిష్యత్తు ఏమిటి? వీడికే ఎందుకు ఇలా అవుతుంది.
ఎందుకు వీడికే ఇలా ఆపదలు వస్తున్నాయి” అంటూ ‘బాబా’ ముందు అనుకున్నారట. ఆ తరువాత పోలీసులు అసలు కిడ్నాపర్స్ ని పట్టుకున్నారుట.
మా ఇంట్లో అందరూ డోలక్ వాయిస్తారు. వాళ్ళు కొద్దో గొప్పో నేర్చుకున్నారు. నేను నేర్చుకోలేదు.
కాని హారతి సమయం లో డోలక్ తో నేను కూర్చుంటే నా చేతులు ఆ పాటకి అనుగుణం గా మోగిస్తాయి. చక్కగా వస్తుంది.
బాగానే వస్తుంది కదా అని మరో పాట కి కానీ మరిఎక్కడైనా కానీ వాయిస్తే రాదు. ఒక్క బాబా హారతికి మాత్రమే వాయించడం కుదురుతుంది.
నన్ను పెద్ద పెద్ద గండాల నుండి బాబా ఎలా తప్పించాడో, ఏదో అయిపోయి ఏటో అయిపోవలసిన నన్ను తన దారికి, మంచి మార్గానికి లాగ బడ్డాను. అంతా బాబా అనుగ్రహ మహిమ.
The above miracle has been typed by: Shiva Kumar Bandaru
Latest Miracles:
- భవిష్యత్తు ని చూపించి నన్ను చావు నుండి తప్పించిన బాబా వారు ……..!
- గ్యాస్ పేలుడు నుండి కాపాడిన బాబా వారు
- ఆకారణముగా వచ్చిన V.R.S ను తప్పించి పూర్తీ కాలం ఉద్యోగంలో ఉంచిన బాబా వారు
- దిల్ సుఖ్ నగర్ కోణార్క్ థియేటర్ దగ్గర జరిగిన బాంబ్ పేలుడు నుండి కాపాడిన బాబా వారు–Audio
- బాబా వారు చేసిన సహాయంతో పెద్ద ఆక్సిడెంట్ నుండి ప్రాణాలతో బయట పడిన భక్తురాలి కుటుంబం.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments