Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఒకసారి మా వంటింట్లో రాత్రి పని అయిపోయిన తరువాత గ్యాస్ సిలండర్ ఆపటం మర్చిపోయింది మా ఆవిడ.
ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి మందు పెట్టాలని రోజూ అంటూనే ఉంది. కానీ ఈ మందు తేవటానికి అశ్రద్ద చేస్తున్నాను.
ఆ రోజు ఏమి జరిగిందంటే, నేను నిద్రపోయనంటే సహజంగా రాత్రి నిద్ర లేవను అలాంటిది ఆ రోజు నాకు హఠాతుగా నన్ను ఎవరో కొట్టి తట్టి లేపినట్లు గా లేచాను.
నా ముక్కు పుటాలు అదిరిపోయేటంతటి వాసన వస్తోంది. నేను మా ఆవిడను నిద్ర లేపి, ఎదో వాసన వస్తోంది బహుశా గ్యాస్ వాసన అయి ఉంటుంది, ఒకసారి చూడు అన్నాను.
గ్యాసా అదేం కాదు అంది, లేదు గ్యాస్ వాసన వస్తుంది అన్నాను అయితే మన పక్కన బాచిలర్స్ ఉన్నారు గా వాళ్ళు ఏమైనా గ్యాస్ వదిలి వేశారు ఏమో అదే వాసన వస్తుంది అనుకుంటా అంది నిద్ర మత్తులో.
చూడు చూడు ఒకసారి మన ఇంట్లోనేమో అనిపిస్తుంది అని అన్నాను, లేచి వెళ్ళి చూసింది, లోపల బాబా దగ్గర పెద్దలైటు వేసి ఉంచటం నాకలవాటు.
ఆ లైటు వేలుతురు వంటింట్లో కూడా పడుతుంది. అందుకని వంటింట్లో ప్రత్యేకించి లైట్ వే యనవసరం లేకుండా పోయింది.
వెళ్లి చూస్తే గ్యాస్ స్టవ్ కి సిలిండర్ కి మధ్య ఉన్న గొట్టం తెగిపోయిందిట ఎలుకలు కొరికేసాయి. భయంకరంగా గ్యాస్ లీక్ అయి వాసన వస్తోంది.
వెంటనే సిలండర్ ను తీసుకువెళ్ళి దూరంగా బయట పెట్టేసాము. అలా బాబా గ్యాస్ పేలుడు నుండి కాపాడాడు.
బాబా దగ్గర లైట్ ఉంది కాబట్టి వేరే లైట్ వేయకుండా సరిపోయింది. వంట గదిలో లైట్ వేసి ఉంటే, ఆ స్పార్క్ కి సిలండర్ పేలిపోయి ఉండేది. బాబా ఆ భయంకర ప్రమాదం నుండి కాపాడారు.
తర్వాతి భాగము (బాబా వారు వారికీ తర్వాత చేసిన లీల)
Latest Miracles:
- గ్యాస్ పేలుడు నుండి కాపాడిన బాబా వారు
- ఆటోవాని రూపంలో వచ్చి భక్తున్ని భోపాల్ గ్యాస్ దుర్ఘటన నుండి కాపాడిన బాబా వారు
- దిల్ సుఖ్ నగర్ కోణార్క్ థియేటర్ దగ్గర జరిగిన బాంబ్ పేలుడు నుండి కాపాడిన బాబా వారు–Audio
- గ్యాస్ సమస్యకు అరటిపండు మందా????…Audio
- భక్తునిపై ఆకారణముగా వచ్చిన ఆపదల నుండి కాపాడిన బాబా వారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments