ఆకారణముగా వచ్చిన V.R.S ను తప్పించి పూర్తీ కాలం ఉద్యోగంలో ఉంచిన బాబా వారు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ముందు భాగము

నేను మదర్ డయిరీ లో పని చెసే వాడిని కదా! ఒక సమయములో కార్పొరేట్ డయిరీలన్ని మూసేయమన్నారు.

మాలో కొంత మందికి మూడు నెలలు జీతాలు ఇచ్చేసి, ఉద్యోగాలు మానేయమన్నారు. మరి కొంత మందికి మూడు నెలల తర్వాత ఉద్యోగాలు వదిలి వెళ్లి పోవాలి అని చెప్పారు.

V.R.S తీసుకోమని చెప్పేశారు. ఈ V.R.S లిస్టు లో నేను ఉన్నాను. నాకు order ఇచ్చేసారు. మూడు నెలలానంతరం ఉద్యోగ విరమణ చెయ్యాలి.

నాకు ఉన్నట్లుండి వచ్చిన ఈ మార్పును నేను జీర్ణించుకోలేక పోయాను. మా పిల్లల చదువులూ కాలేదు, పెళ్లిళ్లు కాలేదు. ఇప్పుడే నా సంపాదన ఆగిపోతే ఇంకనా పరిస్థితి ఏంటి? అన్నదే నా ఆలోచన! నాకేమి అర్ధం కావటం లేదు.

నేనేం చెయ్యాలి? నాకేంటి దారి? ఈ పరిస్థితుల్లో బాబా తప్ప నాకు దారి చూపించేవాళ్ళు ఎవరూ లేరు అనిపించింది.

అంతే ఆఫీస్ నుండి తిన్నగా Dilsukhnagar బాబా గుడికి వెళ్ళిపోయి ఆ ఆర్డర్ ను బాబా పాదాల ముందు పెట్టించి, నేను కళ్ళ నీళ్ళ పర్యంతంతో ‘బాబా నన్ను ఏమి చేయాలని అనుకున్నావు.

ఇప్పుడు నాగతి ఏమిటి? ఇలా అర్దాంతరంగా నీవు నన్ను ఉద్యోగంలొంచి విరమణ ఇప్పిస్తే నాగతి, నా పిల్లలగతి ఏమిటి? నేను నా భార్య సంపాదిస్తేనే సంసారం గడవటం కష్టతరమైన రోజులే! మరి ఇలాంటి సమయంలో నాకున్న ఈ ఉద్యోగం కాస్త ఊడిపోతే ఇంక నాకేంటి దారి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నన్ను ఏదోకటి నువ్వే చేయాలి.

ఏం చేస్తావో మరి అని చెప్పుకొని ఆ ఆర్డర్ ను ఇంటికి తీసుకువచ్చి బాబా ఫోటో ఉంటె ఆ ఫోటో దగ్గర పెట్టి, ఇంట్లో మా ఆవిడ ఆఫీసుకు వెళ్ళిపోతుంది కాబట్టి ఎవరూ లేకపోవటాన నేనే అన్నం వడ్డించుకొని తింటుండగానే నాకు మా ఆఫీసర్ నుండి ఫోన్ వచ్చింది.

మా ఆఫీసర్ ఫోన్ చేసి ఏమి చేస్తున్నావు? అన్నాడాయన. ఏమి చేస్తాను సార్! ఇంటికి ఇప్పుడే వచ్చాను. భోజనం చేస్తున్నాను అన్నాను.

అలాగా! నువ్వు భోజనం చేస్తావో మానతావో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం ఉన్న ఫలంగా ఆఫీసుకురా! అన్నాడు.

నేను ఆశ్చర్య పోయి, గబ గబా భోజనం కుక్కుకుని తినేసి చెయ్యి కడుక్కొని వెంటనే ఆఫీసుకు వెళ్ళిపోయాను.

నన్ను ఆఫీసర్ చూస్తూనే కోపంగా “use less fellow. ఎక్కడికి వెళ్ళిపోయావు? నిన్ను ఎవరు V.R.S. order తీసుకోమన్నారు?” అన్నాడు.

ఎవరేంటి సార్! అందర్నీ V.R.S. order తీసుకోమన్నారు. అందరూ అలాగే చేసారు. నేను అలాగే చేసాను అన్నాను.

దానికి మా ఆఫీసర్ నేను ఇంకా రెండు సంవత్సరాల దాకా రిటైర్ అవ్వను. నేను సర్వీసులో ఉన్న సమయం అంతా నువ్వు నాతోనే ఉండాలి అంటూ నా కాగితాలు మేనేజర్ దగ్గరికి తీసుకు వెళ్ళారు.

ఆ మేనేజర్ VRO మాటను తీసేయలేక నన్ను ఉద్యోగ విరమణ నుండి విరమించాలని ఆ order కాగితం చింపేశాడు.

అంతే నేను మరునాటి తిరిగి మామూలుగానే ఉద్యోగానికి వెళ్ళాను. రెండు ఏళ్ళ తరువాత మా ఆఫీసర్ రిటైర్ అయ్యారు.

తరువాత గవర్నమెంట్ మారిపోయింది. అందువలన పాత రూల్స్ ఏవీ ఏవిధంగాను పనిచేయలేదు.

తిరిగి నేను నా రిటైర్ అయ్యేంతవరకూ బాబా దయవలన, నేను నిర్విఘ్నంగా ఉద్యోగంలో కొనసాగాను.

తర్వాతి భాగము (బాబా వారు వారికీ తర్వాత చేసిన లీల)

సంపాదకీయం : లక్ష్మి నరసింహారావు గారు రచించిన నేటి సాయి భక్తుల గాధలు.

వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles