గ్యాస్ సమస్యకు అరటిపండు మందా????…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


This Audio has been prepared by Lakshmi Prasanna

  1. Mir-13-Gas-by-Lakshmi-Prasanna 4:27

సాయినాథ్ మహారాజ్ కి జై.

నా పేరు లక్ష్మి ప్రసన్న.

సాయి బందువులకు నమస్కారం. అలనాడు సాయి మహా రాజు షిర్డి లో మొదట వైద్యుడుగా షిర్డీ ప్రజలకు పరిచయం అయ్యారు .

ఆయన చేసె వైద్యం నిజంగా చమత్కారం. బాబా వాడే ఔషధము నిజానికి మనం వాడితే జబ్బు ఎక్కువ తప్ప తగ్గే సమస్యే లేదు.

నిజానికి అక్కడ మందు బాబా గారి వాక్కు. బాబా మాటకు అంత శక్తి.

భక్తుల కోసం ఎదో ఒకటి తినిపించేవారు, నిజానికి ఆయన చూపు  మన మీద పడగానే మనలోని జీవశక్తులు అన్నీ కూడా చురుకుగా వాటంతట అవే తయారవుతాయి.

ఒకసారి నేను కడుపులో గ్యాస్ తో బాధపడ్డాను. అదీ నేను షిర్డీలో ఉన్న సమయం.

ఒకరోజు మధ్యాహ్న సమయంలో నేను, బాబా సమాధి మందిర గోపురం కనపడేలాగా గుడిలో పక్కన మెట్ల మీద పడుకున్నా.

అలా బాబాని చూస్తూ నిద్రలోకి ఉపక్రమించాను. కొద్దిసేపటికి ఒక పెద్ద కోతి, అది చాలా ముసలిగా ఉంది. నా పక్కన కూర్చొని  నాకు ఒక అరటి పండు ఇచ్చింది, నేను తిన్నాను, మరల ఇంకోటి ఇచ్చింది, మళ్ళీ తిన్నాను.

అదే పనిగా ఒకటి తరువాత ఒకటి నాతో ఒక గెల అరటిపండ్లు తినిపించింది, తరువాత ఒక పెద్ద వాటర్ బాటిల్ తెచ్చి నాకు ఇచ్చింది, అవి అన్నీ తాగాను. ఇక నాకు మెళకువ వచ్చింది. ఇది అంతా కలలో జరిగింది.

లేచిన తరువాత బాబా ఆంజనేయస్వామి రూపంలో నాకు వైద్యం చేసారని, చాల సంతోషంగా అనిపించింది.

చావడి దగ్గరకు వెళ్లి బయట కూర్చున్న, అక్కడ ఒకతను అరటి పండ్లు పంచుతున్నారు.

అదీ ఒక అరటి పండుని కట్ చేసి ముక్కలుగా పంచుతున్నారు. ఒక్కరికి ఒకటి పంచుతున్నారు.

నా దగ్గరకు  అతను వచ్చి ఒకటి ఇవ్వబోతే ఆయన చేతిలో ఉన్న అరటి ముక్కలు అన్నీ నా దోసిలిలో పడ్డాయి.

ఇక్కడ చిత్రం ఏమిటి అంటే !! అతను వెనక్కు తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు, కాని అవి అన్నీ నా చేతులలో ఉండిపోయాయి.

అప్పుడు అతను అన్నారు, ఎందుకో బాబా ఇవి అన్నీ నీకు ఇస్తున్నారు, నువ్వే తిను తల్లి అని చెప్పారు.

నాకు కల అంతా గుర్తు వచ్చింది,  వెనక్కు తిరిగి చూస్తే ఎదురుగా  ఆంజనేయస్వామి వారు కనిపిస్తున్నారు.

నా కోసం ఆయన తరలి వచ్చారా! అని ఏడ్చేసాను. నేను వీళ్ళ పట్ల ఎంత కృతజ్ఞ గా ఉన్నా తక్కువే.

ఇక ఆలస్యం చేయకుండా అన్నీ తినెసాను, మళ్ళీ ఎవరో వచ్చి కీరా దోస ముక్కలు ఇచ్చారు, ఇక్కడే కోర్చోని తినమన్నారు.

అవితినేసరికి ఎవరో ఉప్మా తెచ్చి ఇచ్చారు, ఇక తినలేను కాని ఆవిడ నన్ను వదలలేదు. మళ్ళీ ఒకతను కిచిడి కప్పునిండా  తెచ్చారు, అదీ తిన్నాను.

బాబోయ్ నా కడుపు పగిలేలా ఉంది అంత  తినిపించారు బాబా. ఇక అంతే నా కడుపులో గ్యాస్ కి చోటు లేకుండా ప్రసాదాలు నింపారు బాబా.

అంతే నా గ్యాస్ లేదు ఏమిలేదు. కలలో జరిగింది ఇలలో ప్రవేశపెట్టారు బాబా.

గురుచరిత్రలో కూడా ఇలాంటి సన్నివేశమే జరిగింది. అన్నమే పడని జబ్బుతో బాద పడుతున్న ఒక వక్తికి అన్నీరకాల బోజనం పెట్టి అతనికి జబ్బు నయం చేసారు గురువు గారు.

ఇలాంటి లీలలు వారు తప్ప ఇంక ఎవరు చేయగలరు.

బాబాని శరణాగతి చేస్తే అన్నీ ఆయనే చూసుకుంటారు.

దీనికి మనం చేయవలసింది అంతటి అర్హత మనం సంపాదించడమే.

సాయి సాయి సాయి అనే నామమే ఊపిరిగా జీవిద్దాం.

ఓం సాయి రామ్.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “గ్యాస్ సమస్యకు అరటిపండు మందా????…Audio

Maruthi Sainathuni

Sai Baba…Sai Baba…Sai Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles