Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
శ్రీమతి.అహల్యా కృష్ణాజీ ఉపార్కర్, ముంబాయి, గారి కాలు బాబా నయం చేయుట.
1969 ఆగస్టు నెలలో శ్రీమతి అహల్యాబాయి గారి కాలులో మేకు గుచ్చుకొని రక్తం కారింది.
నొప్పి లేకపోవడంతో ఆవిడ దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. 24వ.తారీకున ఆమె కాలుకు సెప్టిక్ అయి జ్వరం వచ్చింది. తరువాత బాబా ఒక అపరిచితుడుగా వచ్చి ఆమె కాలుకు మందిస్తానని మాట ఇచ్చారు.
ఆవిడ ఇంటికెదురుగా మిలిటరీ వారి డిపో ఒకటి ఉంది. అతను ఆ డిపోలోకి వెళ్ళి వారి అనుమతితో మందును తీసుకొచ్చారు.
మందును ఆమెకిచ్చి బాధ పెడుతున్న ఆమె కాలుకు రాసుకోమని చెప్పారు. ఆమె అతను చెప్పినట్లే చెసింది. మందు రాసిన వెంటనే వాపు తగ్గి నొప్పి కూడా తగ్గిపోయింది.
ఒకరోజు రాత్రి అమె కలలో ఒక నర్సు వచ్చి ఇంజెక్షన్ ఇచ్చింది.
మరొక రోజు రాత్రి బాబా ఆమె కలలో కనిపించి సెప్టిక్ అయిన కాలికి రంధ్రం చేసి పుండును మాన్పుతాననీ, దాని వల్ల ఆమెకాలు మామూలు స్థితికి వచ్చి నొప్పి తగ్గిపోతుందని చెప్పారు.
ఒకరోజు రాత్రి ఆమె పడుకుని ఉండగా ఎలుక ఒకటి వచ్చి పుండుపడిన కాలికి పెద్ద రంధ్రం చేసి పుండుని యింకా పెద్దది చేసింది.
దాంతో పుండులో ఉన్న క్రిములు, చీము అన్నీ బయటకి వచ్చేశాయి. ఆమె తన కొడుకుని లేపి బాబా తన కాలుని ఎలా నయం చేశారో చూపించింది. కాలుకి బాబా ఊదీ రాసిన కొద్ది రోజులలోనే ఆమె కాలు పూర్తిగా నయమయింది.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
Latest Miracles:
- తనను దర్శిస్తానన్న వెంకటేశ్వర్లు గారి భార్యకు ప్రాణదానమును బాబా చేయుట…Audio
- మందులతో నయం కాని భక్తురాలి బాధను, షిరిడీకి రప్పించుకుని నయం చేసినా బాబా వారు….Audio
- కండ్లకలకను నయం చేసిన బాబా
- సాయి బాబా దర్శనంతో తో భక్తునికి దీర్ఘకాలంగా వున్నా కడుపునొప్పి మాయమగుట–Audio
- పోలియోని నయం చేసిన బాబా–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments