Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి రాం, సాయి బంధువులందరికి…
శంబల్పూర్ అనే ఊరిలో ప్రసిద్ధిచెందిన గ్రామదేవత “మా శంబలేశ్వరి.”ఇక్కడ ప్రజానికానికి ఆమె దైవం.
దేవినవరాత్రుల మొదటి రోజు ఆమెను “ధవలాముఖి” అంటారు.
అమ్మవారు మొత్తం తెల్లని వర్ణం తో అలంకరించి ఉంటుంది.ఆరోజు దర్శనం అత్యంత శ్రేష్టం..అని ఇక్కడి వాళ్ళ విశ్వాసం.
ఆరోజు అందరూ ఆమె దర్శనం చేసుకునేదానికి శంబలేశ్వరి మందిరానికి వెళ్తారు. 500 రూపాయల టికెట్ కూడా ఉంటుంది.
ఈ సారి కూడా మా ఆఫీస్ వాళ్ళు అందరూ వెళ్లి, ఆమె మహత్యాన్ని వర్ణించి, వర్ణించి చెప్పారు.
ఎందుకో నాకు వెళ్లి దర్శనం చేసుకోవాలని పించింది.
నా duty అయిపోయినాక మధ్యాహ్నం 12.30. గంటలకు వెళ్ళాను.
చాలా పెద్ద క్యూ వుండినది. నాలుగు కిలోమీటర్ల దూరం వరకు భక్తులు ఆమె దర్శనానికి నిలబడుకొని వున్నారు.
నేను తెల్లవారి నాలుగు గంటలకు డ్యూటీ కి వెళ్లినందువలన ఇంకా ఎదురు చూడటం నా వల్ల కాదు, అనుకోని తిరుగుముఖం పట్టాను.
అప్పుడే ఎవరో వెనకల నుంచి ” సాయి రాం” మేడం.. అని పలకరించాడు.
నేను ఇక్కడ సాయి రాం..అని ఎవరు అంటున్నారు? అని వెనక్కు తిరిగి చూసాను.(ఆయన ఎవరో నాకు తెలీదు. అప్పుడే ఎందుకు పలకరించాడో తెలీదు).
ఎవరో బాబా భక్తుడు అయివుంటాడాని నేను సాయి రాం అన్నాను.
“ఏంటి మేడం దర్శనానికి వచ్చారా? ” అని అడిగాడు.
నేను అవును, కానీ పెద్ద క్యూ ఉంది, వెనక్కు వెళ్లిపోతున్నాను, అని చెప్పాను.
దానికి ఆయన అన్నాడు” అరె, మీరు వెనక్కు వెళ్ళిపోతే ఎలా మేడం? రండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని, నన్ను మందిరం లోపల అమ్మవారి ముందు నిలబెట్టారు.
అయిదు నిముషాలలో దర్శనం చేయించారు. నిజంగానే, అద్భుతమైన దర్శనం అయింది.
నేను ఎంతో ఆనందంతో బయటికి వచ్చి ఆయన కోసం వెతికాను. నాకు ఎక్కడ ఆయన జాడ కనపడలేదు.
ఆయన ఎవరు? ఎందుకు నాకు అంత కష్ట సమయం లో వచ్చి, అమ్మవారి దర్శనం చేయించారు,
నాకు దర్శనం అవ్వదు అని నిరాశగా ఉండడం ఆయనకు ఎలా తెలుసు? ఇవన్నీ అంతు చిక్కని ప్రశ్నలు.
తరువాత నేను ఇంటికి వచ్చి ఆలోచించాను.
మేము విశ్వాసాయి ద్వారాకమాయి సభ్యులము, సాయి గాయత్రీ మహా మంత్రాన్ని ప్రచారం చేస్తున్నాము.
అక్టోబర్ 18th.. నుంచి..డిసెంబర్ 8th.. వరకు..ఒక్క కోటి. చేయించాలని ,ప్రపంచవ్యాప్తంగా అందరం సాయి గాయత్రీ మహా మంత్రం జపం చెయ్యడానికి తయారు అవుతున్నాము.
అందుకని బాబావారు.. నాకు తెలియచేశారు,
“ఈ శంబలేశ్వరి అమ్మవారు శక్తిపీఠం, అని. అందుకే బాబా నే నాకు ఆమె దర్శనభాగ్యం కలిగించారు.
నిజానికి ఆరోజు ఆమె గంగాస్వరూపం అంట. మన దేవినవరాత్రులలో దుర్గాదేవి ని గాయత్రీ దేవి గా అలంకరిస్తారు.
సాయి గాయత్రీ కి. గాయత్రీ అమ్మకు తేడా లేదని, సాయి బాబా కూడా దేవి స్వరూపమే, అని నాకు అర్థం అయింది.
అది నాకు తెలియచేయడానికి బాబా చేసిన ప్రయత్నం.మనకు అర్థం కానివి, అంతుచిక్కని దైవలీలలు బాబా భక్తులకు ప్రతిక్షణం జరుగుతూనే ఉంటాయి.
సర్వదేవత స్వరూపం,సాయి నాథుడు. ఇలా మేము సాయి గాయత్రీ చేసుకుంటున్నాము.
డిసెంబర్ 8th కు అనుకున్న ప్రకారం కోటి గాయత్రి అవ్వలేదు. అందరూ నిరాశతో వున్నారు.
కానీ నేను ఇది బాబా మనకు పెట్టె పరీక్ష అనుకున్నాను.
ఎలాగైనా కోటి చెయ్యాలని నిర్ణయించు కున్నాను.
అందుకే డిసెంబర్ 8th తరువాత కూడా నేను ఆగకుండా సాయి గాయత్రీ చేస్తూ వచ్చాను.
నాతోపాటు నా గ్రూప్ వాళ్ళకి చెప్పాను, ఆపకుండా చేయండి అని. ఇలా నా కోటి సాయి గాయత్రీ మహా మంత్రం జపం ఎడతెరపి లేకుండా గంగా నది లాగా నడుస్తూనే ఉంది.
ఇంతలో నా ట్రాన్స్ఫర్ పని మీద ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది.
అక్కడ నుంచి హరిద్వార్,ఋషికేశ్,వెళ్ళాను.
నేను హరిద్వార్ లో గంగా నది ఒడ్డున ఉన్న గంగాదేవి మందిరానికి వెళ్ళాను.
అక్కడ నా కళ్ళను నేనె నమ్మలేక పోయినాను. గంగాదేవి విగ్రహం పక్కనే రాజాదిరాజ్ యోగిరాజ్ సాయి నాథ్ విరాజమానుడై వున్నాడు.
మొత్తం సాయి గాయత్రీ మంత్ర ప్రయాణం లో బాబా అడుగడుగునా నాకు తోడు నీడగా నడిచారు.(ఇంకా ఎంతో చెప్పాలని ఉంది.కానీ భాష అందటం లేదు.నిజానికి).
అయిదో తేదీ నేను ఆ హరిద్వార్ గంగా నది ఒడ్డున వున్నాను,
అప్పుడు సాయి గాయత్రి మహా మంత్రం కోటి పూర్తి అయింది.
సాయి గాయత్రీ కోటి చేస్తామని ఆ దసరా మొదటి రోజు ధవలముఖి అమ్మవారి దగ్గర బాబా నాతో మొదటి అడుగు వేయించారు.
షిర్డీ సమాధి మందిరం లో అక్టోబర్ 18th తేదీ బాబానే నాతో మొదలు పెట్టించారు.
జనవరి 5th హరిద్వార్ గంగా నది ఒడ్డున నాతోనే అయిపోచేయించారు. గంగా నది గంగోత్రి లో పుట్టి, హరిద్వార్ లో హరి పాదాల మీదుగా వారణాసి లో శివుని జటాజూటం లో చేరి గంగా సాగర్(కలకత్తా) లో సముద్రం లో కలుస్తుంది.
నా సాయి గాయత్రి కూడా గంగా ప్రవాహం లా ధవలముఖి లో మొదలు అయి సాయి నాధుని సమాధి మందిరం ద్వారా హరిద్వార్ కు చేరి అక్కడ గంగా నది ఒడ్డున పరిసమాప్తి అయింది.
ఇది మొత్తం ఆ సాయి నాధుని సంకల్పం మాత్రమే..
సర్వం సాయి నాతర్పణ మస్తు..
మాధవి, భువనేశ్వర్.
Latest Miracles:
- నా మీద బాబా కు చాలా కృప ఉంది, నా పిల్లలు కూడా నాకు ఇంత సంతోషం ఎప్పుడూ ఇవ్వలేదు.
- స్వయంగా బాబా వారి పేరు మీద ఉన్న కాకడ ఆరతి టికెట్స్ మాకు ఇచ్చారు.
- “బాబా మీరు చెప్పక ముందే, మాకు కలలో వచ్చి చెప్పారు.”
- శ్రీ శాంతావన్ జీ మహారాజ్
- త్రివిధ పద్ధతులు …. మహనీయులు – 2020… జూన్ 2
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments