Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
“నేను చమత్కారములు చూపించే యోగినవ్వాలనే బాల్య చాపల్యమును వదిలేశాను” అని వ్రాసారు శ్రీ రాం శర్మ.
“నిజమైన సిద్ధపురుషుడు ప్రాచీన రుషి సాంప్రదాయం ప్రకారము లోక కల్యాణార్థము తమ జీవితాలను ధారపోస్తారు” అంటారు ఆయన.
సాయిబాబా కూడా సాయి శరణానందతో “మన కోసం మనం ఏమీ చేయనవసరం లేదు” అన్నారు.
శ్రీరాం శర్మ గారు ఉపాసన, సాధన, ఆరాధన అనే త్రివిధ పద్దతులను పాటించేవారు. ఆయన పదవ ఏట కాశీలో బెనారస్ హిందూ యూనివర్సిటి సంస్థాపకులు పండిత మదన మోహన మాలవ్యగారు ఉపనయనంచేసి, గాయత్రీ మంత్రదీక్ష నిచ్చారు.
15వ ఏట సద్గురు సాక్షాత్కారం పొందారు. అఖండ దీప సముఖంలో 24 సంవత్సరములు, సంవత్సరమునకు 24 లక్షల గాయత్రి చొప్పున 24 మహాపురశ్చదనలు చేశారు.
ఆ సాధనా కాలంలో 24 సంవత్సరములు ఆవుకు జొన్నలు తినిపించి, ఆ ఆవు మల విసర్జన కాలంలో లభించే జొన్నలతో రొట్టె చేసుకుని తినేవారు. మజ్జిగ తీసుకునేవారు.
ఇంతటి కఠోరమైన దీక్షను గురువు ఆదేశించగా పాటించారు.
“ఇక్కడి మార్గంలో దేహాన్ని అరగదీయకుండా మరో మార్గం లేదంటారు” సాయిబాబా.
సద్గురువు సర్వేశ్వరానందుల నిర్దేశాల ననుసరించి నాలుగు సార్లు, ఆరు నెలల నుండి సంవత్సర కాలంపాటు (ప్రతిసారి) అజ్ఞాతవాసంలో కఠోర తపోసాధనలు చేశారు శ్రీరాం శర్మగారు.
ఇతరుల సాంగత్యం లేకుండా, ఆత్మ సాన్నిధ్యంలో, ఎముకలు కొరికే చలిలో, క్రూర జంతువులతో ఆత్మీయంగా ఉండగలగటం ఆయనకు అలవడ్డది.
కొన్ని రకాల పొదలు పచ్చగా ఉన్నా వెచ్చదనానిస్తాయి. భోజ పత్ర చెట్టుమీద ఉండే ములకుల కషాయం చలిని నివారిస్తుంది.
కాళ్ళు ముడుచుకుని, మోకాళ్ళకు శిరస్సు ఆనించి కూర్చుంటే చలి తగ్గుతుంది. చలిని గుర్తిస్తే అది ఇంకా ఎక్కువవుతుంది. జంతువులను చూసి భయపడకుండా అనవసరంగా కదిలించకపోతే అవి కూడా మిత్రులలాగా మెలగుతాయి.
సాధనాపరంగా ఆయన పఠనాన్ని చేసేవారు. ప్రతి రోజు రెండు గంటల్లో 80 పేజీలు, నెలకు 2,400 పేజీలు, సంవత్సరానికి 29,000 పేజీల చొప్పున 60 ఏండ్లలో 17,28,000 పేజీలు చదివారు.
ఆయన చదివింది ఆయన తృప్తి కొరకా? నాలుగు వేదాలు, 108 ఉపనిషత్తులు, 20 స్మృతులు, 18 పురాణాలు, షడ్ దర్శనాల భాష్యం సరళ హిందీలో రచించారు అందరికోసం.
“గురుదేవుల (శ్రీరాం శర్మగారు) సాహిత్యం నాకు కొద్ది రోజుల ముందు లభించి ఉంటే, నేను బహుశ రాజకీయాలలోకి వెళ్ళకుండా ఉండేవాడిని” అన్నారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు.
1990 జూన్ 2వ తేదీన గాయత్రీ జయంతి శుభదినాన, గాయత్రీ మాత నామోచ్చారణలతో గాయత్రి పరదేవతలో తన మహా ప్రాణాన్ని కలిపివేశారు శ్రీరాం శర్మగారు,
నేడైనా శ్రీరాం శర్మ గారిని స్మరించెదము గాక! శర్మ గారి “ఇతరులను నిందించటానికి బదులు ఆ సమయాన్ని నీ ఉద్ధరణకు వినియోగించుకో” అన్న వాక్కును ఆచరింతుము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- గీతాభ్యాసం …. మహనీయులు – 2020… సెప్టెంబరు 24
- శ్రీ పేరూరి శర్మగారు–Audio
- మృత్యుశయ్యపై యున్న శర్మగారి బిడ్డను బ్రతికించిన బాబా–Audio
- ఆరతుల భావము…..సాయి@366 ఏప్రిల్ 9….Audio
- అశృ జలాలతో అభిషేకం! …..సాయి@366 ఆగస్టు 12…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments