టికెట్స్ లేని ట్రైన్ లో కూడా బెర్త్ లు ఇప్పించిన బాబా …..!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఒకసారి అయోధ్య నుండి ఉజ్జయిని వెళ్ళాము. అక్కడ 10వ తారీఖు నుండి 20 వరకు ఉండి, అక్కడ అన్నీ చుట్టూ చూసుకుని, అక్కడ నుండి ఉజ్జయిని వెళ్ళాలి.

మేము పొరపాటున 21 వరకు అక్కడే ఉండి పోయాము. అంటే నిన్ననే మేము అక్కడ నుండి రైలుకి బయలుదేరి వెళ్ళిపోవాలి. రైల్లో రిజర్వేషన్ నిన్నటి దాంట్లో ఉన్నాయి.

తెల్లగా తెల్లారాక ఈ విషయం తెలుసుకున్నాము. అయ్యో! అనుకుని స్టేషన్ కి వెళ్లి స్టేషన్ మాస్టర్ తోటి మేము నిన్నటి రైల్లో వెళ్ళాల్సిన వాళ్ళము,

నాకు బాగా మోషన్స్ అయ్యాయి, అందుచేత హాస్పిటల్లో ఉండిపోవాల్సి వచ్చింది. అందుకని రాలేకపోయాం, ఎలాగైనా ఈ రోజు రైలుకి మాకు టికెట్స్ ఇప్పించమన్నాను.

ఆయన నేను చెప్పినదంతా విన్నాడు. ఒక కాగితం రాసి ఇవ్వండి అంటూ ఒక తెల్ల కాగితం నా ముందు పెట్టాడు.

నేను ఆ చెప్పిన కథనంతా అందులో రాసాను. ఆయన సంతకం చేసి ఇచ్చాడు. ఈ రోజు రైలు లేదు అన్నాడు.

మాకు మళ్ళీ మూడు రోజులలో ఉజ్జయిని నుండి టికెట్స్ ఉన్నాయి. రైలు రేపు ఉంది అంటాడు.

ఆయన్ని బతిమలాడితే ఉండండి అంటూ లోపలికి వెళ్లి వచ్చి ఈ రోజు ఒక స్పెషల్ ట్రైన్ ఉంది, అందులో మీకేమైనా టికెట్స్ దొరుకుతాయేమో చూస్తాను అన్నాడు.

రెండు టికెట్స్ వెయిటింగ్ లిస్ట్ లో వచ్చాయి. అదీ సాయంత్రం 6 గంటలకి ఉంది. సాయంత్రం దాకా అక్కడే ఉండి ఆ స్టేషన్లో అమ్మేవే కొనుక్కుని తింటూ కాలక్షేపం చేస్తున్నాము.

సాయంత్రం అయ్యింది, మేము అక్కడ బెంచ్ పైన కూర్చుని, కొనుక్కొచ్చుకున్నవేవో తింటూ మేము ఇలా మాట్లాడుకుంటున్నాము.

”అనవసరంగా నిన్నటి రైలు వెళ్ళిపోయింది, మనకి ఈ రైల్లో బెర్తులు దొరుకుతాయో లేదో, లేకపోతే ప్రయాణం కష్టంగా ఉంటుంది. ఎలాగో ఏమో చూడు బాబా” అని అనుకుంటున్నాము.

మా పక్కనే ఇద్దరు అన్నదమ్ములు కూర్చుని ఉన్నారు. వారు ఏమిటని అడిగారు, మేము జరిగింది చెప్పాము.

బెర్త్ లేకపోతే రాత్రంతా ఇబ్బంది పడాలని కూడా చెప్పాము. వాళ్ళు మేము బట్టల వ్యాపారం చేస్తాము, మేమిక్కడికి తరచూ వస్తూంటాము. మేము మీకు ఒక బెర్త్ ఇవ్వగలం అన్నారు, సరే అన్నాము.

ఈ లోపల రైలు వచ్చింది, ఎక్కాం. ఈ లోపల టి. సి వచ్చి ”మీ టికెట్స్ కన్ఫర్మ్ కాలేదు, ఈ రైలు ఎలా ఎక్కారు” అంటాడు మేము జరిగింది చెప్పి, ఇక్కడ స్టేషన్ మాస్టర్ ఇందులో ఎక్కమన్నాడు అన్నాను.

అప్పటిదాకా బెర్త్ లేవు అన్నవాడు ఉండండి, స్టేషన్ మాస్టర్ గారు రాసిచ్చారా అంటూ లెటర్ చూసాడు. సరే వెళ్లి ఆ నాల్గవ నెంబర్ బెర్త్ తీసుకోండి అన్నాడు.

అలా ఇద్దరికీ చెరో బెర్త్ బాబా దయ వలన దొరికింది. అలా బాబా అడుగడుగునా మమ్మల్ని కాపాడుతూ, మాకు అన్నీ చూపించుకుంటూ ఎక్కడా ఇబ్బంది పడకుండా, కష్టపడకుండా చూస్తూనే ఉన్నాడు. ఆయన లేకపోతే మనం ఎక్కడా ఎలాగూ ఉండలేము.

సర్వం శ్రీ సాయినాధ చరణవిందార్పణ మస్తు
శుభం భవతు

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles