Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నా పేరు సాయి ఆదర్శ్. మేము బాగ్ లింగంపల్లి లో వుంటాము. నేను ఒక software కంపెనీ లో పని చేస్తున్నాను.
మా చిన్నప్పటి నుండి మేము గుడి లోనే ఎక్కువ సమయం గడిపేవాళ్ళం. మా నాన్న గారు దత్తాత్రేయ భక్తులు.
దత్తాత్రేయుడి తో పాటు మా ఇంట్లో బాబా ఫోటో కూడా ఉండేది. నేను 5 th క్లాస్ చదువుతున్నప్పటి నుండి రోజూ ”బాబా” గుడి కి వెళ్ళేవాడిని.
10th క్లాస్ కి వచ్చేదాకా రోజూ క్రమం తప్పకుండా బాబా గుడిలో కార్యక్రమాలు అన్నింట్లో పాల్గునేవాడిని.
10th క్లాస్ కి వచ్చాక సడెన్ గా ఏమైందో ఏమో నాకు గుర్తు లేదు, కానీ బాబా గుడికి వెళ్ళటం మానుకున్నాను.
10th క్లాస్ లో ఒక ఫ్రెండ్ తాను ఎక్కడినుండో వచ్చి స్కూల్ లో క్లాస్ లు అయిపోయిన తర్వాత రోజూ బాబా గుడికి వెళ్తుండేవాడు, ఒక రోజు వాడు నన్ను అడిగాడు,
”నేను ఎక్కడినుండో వచ్చి రోజూ బాబా దర్శనం చేసుకుంటున్నాను, మీ ఇల్లు ఈ పక్కనే కదా నువ్వు ఎందుకు బాబాను రోజూ దర్శనం చేసుకోవు” అని అడిగాడు.
అప్పుడు అనిపించింది నాకు, నేను ”ఇంతకు ముందు రోజూ ”బాబా” గుడికి వెళ్ళేవాడిని, ఇప్పుడు మానేసాను, ”బాబాయే” వీడి చేత నన్ను గుడికి రమ్మని పిలిపించుకుంటున్నాడు” అని అనిపించింది.
అప్పటి నుండి నేను కూడా రోజూ గుడికి వెళ్ళటం మొదలు పెట్టాను. ఇదీ బాబా తో నా పరిచయం.
నేను డిగ్రీ చదువుతున్నప్పుడే ఒక క్యాంపస్ సెలక్షన్ లో సెలెక్ట్ అయ్యాను.
అందులో నాకు జాబు కోసం ఆర్డర్స్ కూడా ఇచ్చేసారు. నేను ఆ విషయం మా ఇంట్లో ఎవరికీ చెప్పలేదు.
ఎందుకంటే నేను చదువుతున్న చదువుకి సంభందించిన ఉద్యోగం కాదది. ఇంట్లో నాన్నకి ఈ విషయం తెలిస్తే అస్సలు ఒప్పుకోరు.
ఆ విషయం నాకు ముందే తెలుసు. మా నాన్నకి తర్వాత మెల్లగా చెప్పాను. ఆయనకి నాకు మధ్యలో చిన్న సంభాషణ జరిగింది.
ఇలా మాట్లాడుతుండగానే నాన్న ఫోన్ మ్రోగింది. ఆయన ఫోన్ లో రింగ్ టోన్ బాబాది. చూసావా! ఫోన్ కూడా మ్రోగింది.
చూడు బాబా కి కూడా నువ్వు ఈ జాబులో చేరటం ఇష్టం లేదు. అందుకే చేరవద్దు అన్నారు. మొత్తానికి నా MBA అయ్యేదాకా నన్ను ఉద్యోగానికి వెళ్లనివ్వలేదు.
మా ఇంటి దగ్గర బాబా గుడిలో బాబాది ఒక పెయింటింగ్ వుంది, అది నేను ఎప్పుడు చూసినా కూడా నాకు అందులో బాబా నవ్వుతున్నట్లు, కోపంగా ఉన్నట్లుగా, చిరాగ్గా వున్నట్లుగా అలా రకరకాలుగా నాకు కనిపించేది.
నవ్వుతూ బాబా మొహం కనపడితే ఆ రోజంతా చాలా ఉల్లాసంగా, హాయిగా, సంతోషంగా గడిచిపోతుండేది.
ఒకవేళ నాకు ఆయన మొహం చిరాకుగా, కోపంగా ఉంటే, ఏదో ఒక చికాకు నాకు ఎదురయ్యేది.
మరి అందరికి అలా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఖచ్చితంగా అలాగే జరిగేది.
ఒక సారి నేను నా ఫ్రెండ్ కలిసి ఇద్దరమూ ”షిరిడి” కి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళిపోయాము. మా దగ్గర అంత ఎక్కువ డబ్బులు లేవు, ఏదో కొంత తీసుకువెళ్ళాము.
మేము షిరిడి లో దిగగానే ఒకతను మా దగ్గరికి వచ్చి మీకు రూమ్ ఇప్పిస్తామంటూ మమ్మల్ని తీసుకువెళ్ళాడు.
షిరిడి లో రూమ్ అంటే మాములుగా ఫ్యామిలీస్ కే ఇస్తారు. మాలాంటి స్టూడెంట్స్ కి, బ్యాచిలర్స్ కి తొందరగా ఇవ్వరు.
ఆ సంగతి మాకప్పుడు తెలియదు. రూమ్ కి తీసుకెళ్ళాడు, అప్పుడు అతను డబ్బులేవి తీసుకోలేదు.
ఫ్రెష్ అయ్యి రండి అంటూ మమ్మల్ని హడావిడి పెట్టి, మేము తయారయ్యి వచ్చాక ఒక బుట్ట చేతిలో పెట్టి రెండు వేల రూపాయలు ఇమ్మన్నాడు.
మాకు మతిపోయింది. మా దగ్గర ఉన్న డబ్బులు 5000 రూపాయలు. పైగా మేము నాసిక్ త్రయంబకం కూడా వెళ్ళాలనుకున్నాము,
2000 రూపాయలు ఇక్కడ అతనికి ఇచ్చేస్తే ఇంక మా దగ్గర ఎక్కువ డబ్బులు ఉండవు. పైగా మేము రిటర్న్ టికెట్స్ కూడా చేయించుకోలేదు.
మా ఫ్రెండ్ సెంటిమెంట్ లాగా ఫీల్ అయ్యి అతనికి 2000 రూపాయలు ఇచ్చాడు. ఆ బుట్టలో ఒక కొబ్బరికాయ, ఒక దండ, ఏవో ప్రసాదాల పొట్లాలు, చిన్న షాల్ ఉన్నాయి. మా మనసంతా ఒక్కసారిగా నీరసం ఆవహించింది.
ఏమనుకొని వచ్చాము? ఏమి జరిగింది? డబ్బులు పోయాయి, ఇదే బాధ మనసులో మెదులుతూనే వుంది.
బాబాని దర్శించుకోవాడినికి లైనులో వెళ్ళాము, అయినా కూడా మా దృష్టి అంత బాబా మీద లేదు. అతనికి ఇచ్చిన (పోయిన) 2000 రూపాయలు మీదే ఉంది.
చుట్టూ పక్కలంతా చూడాలనుకున్నాము, ఇంకా మాకు కుదురు లేకుండా పోయింది.
తిరుగు ప్రయాణ టికెట్స్ కి డబ్బులు లేక మా ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండ్ చెన్నై లో ఉంటే అతనికి ఫోన్ చేసి టికెట్స్ బుక్ చేయించాము, దాని తాలూకు మెసేజ్ మాకు ఫోన్లోకి వచ్చింది, స్టేషన్ కి వెళ్ళాము.
మాకు వచ్చిన మెసేజ్ ప్రకారం మా టికెట్స్ ఉన్న భోగిలో బయట చార్ట్ లో మా పేర్లు చూసుకొని మరీ లోపల కూర్చున్నాము. T . C ఒక నాలుగైదు స్టేషన్ల తర్వాత వచ్చారు.
మా టికెట్స్ మెసేజ్ చూపించాము. ఆ T . C మీ టికెట్స్ ఇవి కావు అంటాడు. లేదు, ఇవి మా టిక్కెట్లు అంటాము. ”లేదు బాబు మీవికావు” ఇవి వేరే వాళ్ళవి అంటాడు.
”మేము బయట చార్టు కూడా చూసుకొని మరీ వచ్చి కూర్చున్నాము” అంటే కూడా కాదంటాడు. చివరికి అంతా వెతికి” బాబు ! నాయనా ! మీ పేర్ల తోటి A . C ఫస్ట్ క్లాస్ లో ఉన్నాయి. తర్వాత స్టేషన్ లో దిగి ఆ కోచ్ లో ఎక్కండి” అన్నారు.
మేము ఫ్రెండ్స్ అందరమూ సంతోషం, ఆశ్చర్యంతో ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నాము. నాలుగైదు స్టేషన్లు దాటితే స్టేషన్ లో దిగి పరిగెత్తుకు వెళ్లి ఆ భోగి ఎక్కాము, మా కోసమే ఎదురు చూస్తున్నట్లుగా ఆ టి . సి అక్కడే ఉన్నాడు.
మమ్మల్ని చూస్తూనే ఆయన ”ఏమయ్యా ఇంత లేట్ గా వచ్చారు” అన్నారు. మేము జరిగింది చెప్పాము .
ఆయన “ఎందుకో ఈ రోజు ఈ టికెట్స్ అమ్మ బుద్ది కాలేదు. అందుకే మీ బెర్తులు మీకున్నాయి” అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.
మేము రిజర్వ్ చేయమని చెప్పింది స్లీపర్లో, చేసింది స్లీపర్లో నే, మా పేర్లు మేము చూసుకున్నది స్లీపర్ క్లాస్ లోనే, కానీ బాబా మాకు ఎక్కడికి తీసుకెళ్లి ఇప్పించాడో చుడండి.
మేము పోగొట్టుకున్నాము అనుకున్న డబ్బులు ఇక్కడ ఇలా పొందాము. ఏ . సి లో ప్రయాణం చేసి హైదరాబాద్ హాయిగా చేరుకున్నాము.
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- టికెట్స్ లేని ట్రైన్ లో కూడా బెర్త్ లు ఇప్పించిన బాబా …..!
- స్వయంగా బాబా వారి పేరు మీద ఉన్న కాకడ ఆరతి టికెట్స్ మాకు ఇచ్చారు.
- నాతో కుంటాట ఆడి నా నడుము నొప్పి ని బాగు చేసిన బాబా వారు …..!
- ఆకలితో వున్నా భక్తురాలు వేదనగా సాయిని ప్రార్ధించగా ఆహారంతో పాటు జీవనోపాధిని చూపించిన బాబా వారు–Audio
- నేను బాబాకి హారతినిచ్చి చేసిన విన్నపాలు మాత్రమే మమ్మల్ని ఆపద(యాక్సిడెంట్)నుండి కాపాడాయి.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments