Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిరాం
సాయి గాయత్రి మహా మంత్రం సమాధి మందిరం లో బాబా నాతో ఎలా చేయించారో, అద్భుత మైన లీల మన సాయి బంధువులతో పంచుకోవాలనుకుంటున్నాను.
ఈ లీల చదివితే పాఠకులకు అర్థం అవుతుంది, ఏ మంచిపనికైనా సంకల్పం బలంగా ఉంటే, బాబా స్వయం గా కదలివస్తాడని. అది ఎలాగో ఈ బాబా లీల చదవండి.
నేను, మా వారు ముందు అనుకున్న ప్రకారం అక్టోబర్ 16th న షిర్డీ చేరుకున్నాము .
ఆరోజు రాత్రి దర్శనం చేసుకున్నాము. 17th కూడా ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నాము, కావున ఆ రోజు దర్శనం చేసుకున్నాము.
ఇంక, 18th విజయదశమి రోజు,అసలైన రోజు,వంద సంవత్సరాలు పూర్తి అయినరోజు బాబా సమాధి చెందిన రోజు.
కోటి సాయి గాయత్రీ మహామంత్ర జపం మొదలు పెట్టేరోజు, నేను అసలు షిర్డీ కి అందుకే వెళ్ళాను.
నాకు చాలా రోజులుగా మనసులో కోరిక ఉండేది, సాయి గాయత్రి మహామంత్ర జపం సమాధి మందిరం లో మొదలు పెట్టాలి అని.
కానీ ఆ రోజుకు నా దగ్గర ఏ విధమైన టిక్కెట్ లేదు. అంటే, బాబా దర్శనానికి లేదు, అరతి టికెట్ లేదు.
చాలా రద్దీ గా ఉంది, షిర్డీ ఆ రోజు. “ఎలా చేస్తాను బాబా, ఇంత దూరం వచ్చాను, అనుకున్న పని అవ్వదేమో, అని చాలా దుఃఖం లో వుంటిని.
ఇంతలో సాయిబాబా గారు(ఒరిస్సా) వచ్చారు షిర్డీ కి.
నేను ఆయనకు ఎందుకు షిర్డీ వచ్చానో, అన్ని విషయాలు చెప్పాను.
ఆయన అన్నారు, నేను ప్రయత్నం చేస్తాను, అని ఎవరికో తెలిసిన వాళ్లకు ఫోన్ చేశారు.
వాళ్ళు చెప్పారు,50..నెంబర్ tokan.. గౌతమ్ అధికారి(మా వారు) పేరు మీద ఇస్తాం, మీరు 17th సాయంత్రం క్యూ లో నిలబడుకొని కాకడ అరతి టికెట్ తీసుకోండి అన్నారు..
సరే, ఏదో దొరుకుతుంది లే అనుకోని రూమ్ కు వెళ్ళాను. మా వారికి చెప్పాను,” మీ పేరు మీద నేను టిక్కెట్ తీసుకుంటున్నాను.
నాకు నీ ఆధార్ కార్డ్ ఇవ్వు అన్నాను. ఆయన నేను ఆధారకార్డు తేలేదు అన్నారు.
నేను ఆశ్చర్యంగా అలా నిలపడి పోయినాను. నాకు చాలా దుఃఖ మనిపించింది
నిజానికి. నా మానసిక పరిస్థితి వర్ణించలేను. అయినకాని, బాబా మీద నమ్మకం తో, నా ఆధారకార్డు తీసుకొని, అక్కడకు వెళ్లి క్యూ లో నిలబడ్డాను.
ఎందుకంటే, నా ఆధార్ కార్డ్ లో వైఫ్ ఆఫ్ గౌతమ్ అధికారి అని ఉంటుంది కదా..
అలా ప్రూఫ్ చూపిస్తామని, వెళ్లి క్యూ లో నిలబడ్డాను.
మనసులో, టెన్షన్, దుఃఖం, ఇస్తారో, ఇవ్వరో.. అనే బాధ..చెప్పలేను.
ఇంతలో నా నెంబర్ వచ్చింది. నేను నా ఆధారకార్డు చూపించి” నేను మాధవి అధికారి, గౌతమ్ అధికారి వైఫ్ ను.అని చెప్పాను,50..నెంబర్ tokan, నాది. అన్నాను.”
ఆ టికెట్ ఇచ్చే వాడు అన్నాడు, గౌతమ్ అధికారి ఎవరు? నువ్వు ఎవరు? 50 నెంబర్ token సాయిబాబా పేరు మీద ఉంది.అన్నాడు.
ముందు నాకు అర్థం కాలేదు, ఈ సాయి బాబా ఎవరు? అని అడిగాను.వాడు అన్నాడు” షిర్డీ కి వచ్చినావు, సాయి బాబా, తెలీదా? భగవాన్ సాయి బాబా.
తొందరగా టికెట్ తీసుకో,ఇక్కడ నుంచి వేళ్ళు, నీ వెనకాల ఇంకా చాలా మంది ఉన్నారు” అన్నాడు.విసుగ్గా.
వెంటనే, 3000 రూపాయలు ఇచ్చి, 5 టికెట్స్ కాకడ అరతి, 18th కోసం తీసుకున్నాను.
బయటికి వచ్చాను. అప్పుడు ఆలోచించాను, స్వయంగా బాబా పేరు మీదనే టికెట్స్ ఉన్నాయా? ఎందుకంటే, వాడు identy proof.. కూడా చూడకుండా టికెట్స్ ఇచ్చాడు.
నా సంకల్పాని కి బాబా స్వయం గా సహాయం చేసారు. చూసారా! ఎంత కృప బాబా కు నా పైన, అనిపించింది.
వెంటనే రూమ్ కు వచ్చి మా వారికీ చెప్పాను. టికెట్స్ బాబా పెరు మీద నే దొరికాయి అని, ఆయన ఆశ్చర్యంగా చూసారు నా వైపు.
ఇంకా 18th తెల్లవారి కాకడ అరతికి వెళ్లి సమాధి మందిరం లో సాయి గాయత్రీ మహా మంత్రం జపం మొదలు పెట్టాను.
విశ్వాసాయి ద్వారక మాయి శక్తిపీఠం తరపున. ఇది బాబా ఇచ్చిన ఆశీర్వాదం.
నేను మధ్యవర్తిగా వున్నాను. అంతే.ఆరోజు నుంచి సాయి గాయత్రీ మహామంత్ర జప యజ్ఞం ఎక్కడ చేసిన బాబా తోడుగా వున్నారు.
అది ఎలాగానో ఇంకో లీలలో చెప్తాను.
సర్వం సాయి నాతర్పణమస్థు.
మాధవి..భువనేశ్వర్.
Latest Miracles:
- మాకు షిర్డీ వెళ్లి బాబా ని దర్శించుకోవటమే పెద్ద పండుగ.
- నా మీద బాబా కు చాలా కృప ఉంది, నా పిల్లలు కూడా నాకు ఇంత సంతోషం ఎప్పుడూ ఇవ్వలేదు.
- బాబా నాకు అలా తినిపించటం నేను మర్చిపోలేని అనుభూతి.-9
- బాబా గురువుగారి అనుగ్రహం వల్ల మగ బిడ్డ ప్రసవం.
- బాబా నా భర్తకి పునర్జన్మ ఇచ్చారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments