Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధి రాజ యోగి రాజ
పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువు TNB రాజు గారు తెలిపిన మరొక అనుభవం ఆయన మాటల్లో ….
2017 మే లో బాబా మాకు ఇచ్చిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను.
మేము 9 – 6 – 2017 న షిర్డీ బాబా దర్శనానికి బయలుదేరాము.షిర్డీలో బాబా సమక్షంలో ధరించాలని కుటుంబంలో అందరం కొత్త బట్టలు కొనుకున్నాము.
ఎందుకంటే మాకు షిర్డీ వెళ్లి బాబా ని దర్శించుకోవటమే పెద్ద పండుగ.
అది తప్ప వేరే పండుగ సెలెబ్రేషన్స్ మాకు లేనట్లే.
మా బాబుకి మాత్రం షిర్డీ వెళ్లే ముందు షర్ట్స్ తీసుకోవటం కుదర్లేదు.(ఎందుకంటే బాబా ఆజ్ఞ లేదు కనుక).
షిర్డీ చేరి 11 -6 -2017 న బాబా శాలువాలు విక్రయించే చోట చూసేసరికి షర్ట్స్ అమ్మకానికి ఉన్నాయి.
బాబా లీలకి మేము చాల సంతోషించాము.ముందుగా ఎందుకు కొనలేకపోయామో అప్పుడు అర్థమైంది.
అందులో రెండు షర్ట్స్ మా బాబుకి సరిగ్గా సరిపోయాయి.
మహదానందంగా బాబా ప్రసాదం గా తీసుకున్నాము.
గతంలో రెండు దశాబ్దాల కాలం లో నాకు తెల్సి షిర్డీ లో సంస్థాన్ వారి శేష వస్త్ర అమ్మక దుకాణం లో షర్ట్స్ విక్రయించటం (దానిని మేము చూడటం) ఇదే తొలిసారి.
ఈ మహిమ మాకు సచ్చరిత్ర లోని,41 వ అధ్యాయం లో ,బి.వి.దేవ్ విషయం లో బాబా అన్న మాటలని(“నేను నీకు జల్తారు శాలువ ఇచ్చుటకు ఇచట కూర్చుని ఉన్నాను,ఇతరుల వద్దకు పోయి …”) జ్ఞప్తికి తెచ్చాయి.
బాబా ప్రేమకు సదా కృతజ్ఞులం.
నా ఉద్యోగ విరమణ తర్వాత బాబా సేవలోనే సదా ఉండాలని నా ఆకాంక్ష.
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- మాకు షిర్డీ వెళ్లి బాబా ని దర్శించుకోవటమే పెద్ద పండుగ–Audio
- “బాబా మీరు చెప్పక ముందే, మాకు కలలో వచ్చి చెప్పారు.”
- స్వయంగా బాబా వారి పేరు మీద ఉన్న కాకడ ఆరతి టికెట్స్ మాకు ఇచ్చారు.
- కృష్ణప్రియ మొదటిసారి షిర్డీ, పూరి జగన్నాథ్ యాత్ర.బాబా ఇచ్చిన అనుభవాలు.
- బాబా మాట వినక జ్వరము పాలగుట (తుకారాం బర్కు)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “మాకు షిర్డీ వెళ్లి బాబా ని దర్శించుకోవటమే పెద్ద పండుగ.”
Sreenivas
November 15, 2017 at 5:45 amLeela chala Bagundi Sai……Sai Baba…Sai Baba….Sai Baba