Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఓం సాయిరాం….
ఇది నాకు చాలా ఇష్టమైన బాబా లీల.
సాయి గాయత్రీ మహా మంత్రం మొదలు పెట్టినాక , మేము అక్టోబర్ 18th న సమాధి మందిరం లో దర్శనం చేసుకొని బయటికి వచ్చాము.
అప్పటికే టైం 6.30 AM.. అయింది. ద్వారాకమాయి, చావడి దర్శనం చేసుకున్నాము.
నా Phone షాప్ లో పెట్టివుంటే తీసుకున్నాము. తిరిగి రూమ్ కు వస్తున్నాము..
ద్వారకామాయి దగ్గరికి వచ్చాము.
ఎందుకో నాకు మనసులో సుబ్రమణ్యం గారికి Phone చేద్దాము అనిపించింది. సుబ్రహ్మణ్యం గారు Sandigo లో వుంటారు.
ఆయన వయసు 70.సంవత్సరాలు ఉండవచ్చు. తమిళం వాళ్ళు. చాలా మంచి బాబా భక్తులు.
నాతో ఒక పారాయణ గ్రూప్ లో వున్నారు. నేను మా సాయి గాయత్రీ Fliers అందరికి షేర్ చేసాను. అలా నాతో Connect అయ్యారు.
ఎప్పుడు అనేవారు, “నేను కూడా సాయి గాయత్రీ జపం చేస్తాను, కౌంట్ నీకు ఇస్తాను” అంటువుంటారు.
ఆయనకు శతాబ్ది ఉత్సవాలకు షిర్డీ లో ఉండాలని ఇష్టం ఉండేది. కానీ, పాపం, అంత దూరం నుంచి రాలేక పోయినారు.
అందుకు నాకు కనీసం Video call చేసి, ద్వారకామాయి, చావడి చూపిద్దాము అనిపించింది.
అందుకే Video call చేసాను. ఆయన అన్ని చూసి చాలా ఆనంద పడ్డారు. కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి ఆయనకు.
నేను అడిగాను “ఎందుకు సర్, ఏడుస్తున్నారు’ అని ? దానికి ఆయన చెప్పిన జవాబు విని నేను ఏడ్చాను.
ఆయన ఇంతకు ఏమి చెప్పారంటే, ఆయన అప్పుడే సాయి చరిత్ర పారాయణం ముగించి , బాబా ముందు తన కోరికను ఇలా చెప్పారట
“బాబా, నీకు నా మీద ఏ కొంచమైన ప్రేమ ఉంటే, నేను ఇప్పుడు నిద్ర పోయినాక, నాకు కలలో కొంచమైన, అంటే, ఏదన్నా ఫోటో కానీ, షో పీస్ లో కానీ, కార్ లో చిన్న విగ్రహ రూపం లో కానీ, ఎలాగోలా నాకు దర్శనం ఇవ్వు”,
వయసు మళ్ళిపోయింది, ఇంక షిర్డీ రాలేను. అని బాబా దగ్గర మనసు దుఃఖ పెట్టుకున్నారు.
కానీ, అంత వయసు మళ్లినాక నిద్ర పట్టాలిగా, అది ఒక బాధ.
ఇన్ని ఆలోచనల మధ్య ఆయన వున్నారు. అప్పుడే నేను Video call చేసి అన్ని చూపించాను.
ఆయన అన్నారు, “ఇంకా నేను నిద్ర కూడా పోలేదు,అప్పుడే నువ్వు నాకు షిర్డీ మొత్తం చూపించావు.
బాబా ఎంత లీల చేశారు, నా మీద ఆయనకు చాలా కృప ఉంది, నా పిల్లలు కూడా నాకు ఇంత సంతోషం ఎప్పుడూ ఇవ్వలేదు, నా కోసమే బాబా నిన్ను షిర్డీ కి పంపినారు” అన్నారు.
ఇంకా పడుకో లేదు, నిద్ర పోలేదు. షిర్డీ ని దర్శించుకోవలన్న కోరిక మనసులో వుండగానే, బాబా నా ద్వారా ఆయనకు దర్శనం చేయించారు.
ఆయన చాలా సంతోషపడ్డారు. 70 సంవత్సరాల ఆయన అంత సంతోషపడ్డారు అంటే నాకు కూడా చాలా happy అనిపించింది.
సాయి బంధువులకు అందరికి కూడా ఈ లీల బాగా నచ్చుతుందనుకుంటున్నాను.
సర్వం సాయి నాతర్పణమస్థు.
Latest Miracles:
- ఆ సాయిబాబాకు నా మీద ఇంత కృప ఉంటుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు
- బాబా గారితో నా పరిచయం, నా జీవితం లో బాబా గారు చూపిన మొదటి అద్భుత లీల.
- నా నమ్మకమే బాబా. నాకు ఉన్న దిక్కు కూడా తనే.
- బాబా ఆశీర్వాదంతో నా వివాహం జరిగింది.-3
- ” బాబా ఈ పిల్ల చాలా బలహీనంగా ఉంది కానుపు ఎలా చేస్తావో నీ ఇష్టం, ఇంక దీని భాద్యత నీదే”–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments