ముసలమ్మ రూపం – దక్షిణ–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


భక్తురాలు: సుభాషిణి

నివాసం: నెల్లూరు


This Audio Prepared by Mrs Lakshmi


నా పేరు సుభాషిణి. బాబాతో నా అనుభవాలు మీ అందరితో పంచుకుంటున్నందుకు హ్యాపీగా ఉంది.

మనం ఒక అడుగు వేస్తే చాలు, అయన మనల్ని వంద అడుగులు ముందు ఉండి నడిపిస్తారు.

ఒకరోజు నేను నెల్లూరులోని సాయిపథంలో ప్రదక్షణలు చేస్తూ ఉన్నప్పుడు ఒక అమ్మ కనిపించి నన్ను రెండు రూపాయలు ఇవ్వమని చేయిచాచింది. నేను ఇద్దాము అనుకుని బ్యాగ్ లో నుండి  తీసి చూసే సరికి అక్కడ ఎవ్వరు లేరు.

చుట్టూ చూసాను ఎవరు కనిపించలేదు. బాబానే అలా వచ్చారేమో! అనుకుని ఆనందంగా అనిపించింది.

సాయిపథంలో హుండీ ఉండదు కాబట్టి, ముసలి అమ్మ రూపంలో ఉన్న బాబాకు ఇవ్వాలి అనుకున్న రెండు రూపాయలు అక్కడ భిక్షువులకు ఇచ్చి  ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చాను.

మరొక అనుభవము:

మా ఇల్లు వెంగలరావునగర్ లోని సాయిబాబా గుడికి దగ్గరలోనే ఉంటుంది. మేము ఇద్దరం బాబా భక్తులం.

ప్రతి రోజు ఉదయం కాకడ హారతికి, రాత్రి శేజ్ హారతికి ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళము.

ఒక రోజు ఎందుకనో ఉదయం 4.30 అయినా మా ఇద్దరికీ మెలుకువ రాలేదు.

అప్పుడు ఎవరో మా ఇంటి తలుపులను గట్టిగా కొట్టినట్టు శబ్దం వినిపించింది.

మేము ఉండేది  పై ఫ్లోర్ లో, ఈ టైంలో ఎవరు వచ్చి తలుపులు కొడుతున్నారబ్బా! అనుకుని వెళ్లి తలుపులు తీసి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు.

ఆ సమయంలో అక్కడికి వచ్చే వాళ్లు కూడా ఎవరు లేరు. ఇంటి ఓనర్స్ ని అడిగితే మేము పైకి రాలేదు అన్నారు.

కింద గేట్ కి వేసిన తాళం అలాగే ఉంది. అప్పుడు అనిపించింది బాబానే అలా తలుపులు కొట్టి మమ్మల్ని నిద్ర లేపారని.

ప్రతిరోజూ క్రమం తప్పకుండా కాకడ హారతికి వెళ్లే మేము, ఆరోజు మెలుకువ రాకుండా పడుకునే సరికి, తన భక్తులను తానే అలా లేపి హారతికి రప్పించుకున్నారు అనిపించింది. చాలా అదృష్టంగా అనిపించింది.

మరొక అనుభవము:

ఒక నాగుల చవితి రోజు ఉపవాసం ఉన్నాను. కలలో బాబా కనిపించి “ఉపవాసం ఎందుకు ఉన్నావు.

నిన్నెవరు ఉపవాసం ఉండమన్నారు” అని కోపంగా వేలుపెట్టి చూపిస్తూ బెదిరించినట్టుగా, “ఉపవాసం ఉండకు” అని చెప్పారు.

ఇక అప్పటి నుండి నేను ఉపవాసాలు లాంటివి ఏవీ చెయ్యట్లేదు. ఆయన బిడ్డలమైన మనకు అవసరమైనవి అన్నిఇచ్చేందుకు అయన ఉండగా ఇక ఉపవాసాలతో పనేముంది.

తన బిడ్డలు ఆకలితో అలా ఉంటే ఏ తండ్రి కైనా బాధగానే ఉంటుంది కదా! అనిపించింది.

సుభాషిణి గారు తన మరొక అనుభవాన్ని ఇలా వివరిస్తున్నారు.

మేము నెల్లూరులో ఉండే రోజులలో మాకు STD బూత్ ఉండేది. ఒకరోజు మా ఆయన ఊరిలో లేనప్పుడు అర్జెంట్గా STD  కి డబ్బులు కట్టవలసి వచ్చింది.

నా దగ్గర అంత మొత్తం లేదు. ఎలా కట్టాలా అని టెన్షన్ పడి బాబాని నువ్వే ఎలాగైనా దారి చూపించు అనుకున్నాను.

ఒక తెలిసినామె వచ్చి డబ్బులు ఇచ్చి ఇవి నీ  దగ్గర దాచి పెట్టు అని చెప్పింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది.

హమ్మయ్య బతికించావు బాబా, అనుకుని ఆ డబ్బులు అప్పుడు STD వాళ్ళకి కట్టి, మా ఆయన వచ్చాక ఆమె డబ్బులు ఆమెకి అడిగినప్పుడు ఇద్దామని దాచి పెట్టాను.

బాబా తలుచుకుంటే ఏదైనా చేయగలరు అనిపించింది.

 ~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~

  ** సాయిసూక్తి:

 “మీ ముందు కనిపిస్తున్న ఈ మూడు మూరల దేహమే నేను అనుకుంటే మీరు పొరపడినట్టే”.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles