ఆ సాయి నాధుడే కదిలి వచ్చాడు ఒక కొత్త డాక్టర్ రూపం లో



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నా పేరు sadhasiva. నేను AIR..Sambalpur..Orissa..లో ఒక చిన్న ఉద్యోగిని.

నాకు సాయి బాబా అంటే చాలా భక్తి, విశ్వాసం ఉన్నాయి.

నాకు జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలని రాస్తున్నాను. మాధవి మా మేడం. ఆమె ద్వారానే నాకు జరిగిన బాబా లీలను మీకు తెలియచేస్తున్నాను.

ముందుగా బాబా చరణ కమలాలకు నా వందనాలు .

సాయి బాబా గారికి ఏదన్నా తప్పులు ఉంటే క్షమించమని వేడుకుంటున్నాను.

“కోటానుకోట్ల భక్తులలో నేను ఒకడిని బాబా, నీ కృపకటాక్షాలు సదా సర్వదా మాపై ఉండాలని వేడుకుంటున్నాను”.

నా జీవిత కాలం లో ఎన్నో బాబా లీలలను చవిచూచాను, దానిలో ఇది ఒకటి.

నేను చిన్నవయసులోనే నాన్నను పోగొట్టుకున్నాను. నాన్న ఉద్యోగం అమ్మకు (చిన్నది) ఇచ్చారు.

నాకు ఒక తమ్ముడు,చెల్లి వున్నారు.ఎంతో కష్టపడి చెల్లి పెళ్లి చేసాను.

మా బావగారి చెల్లి ని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు పెద్దలు, నేను సరే అన్నాను.

ఏదో ఒక చిన్న తప్పువలన ఆ అమ్మాయి భయంకరమైన విషం తాగేసింది (ఆత్మహత్య చేసుకోవాలని), అమ్మాయిని ఆస్పత్రి లో చేర్పించారు.

డాక్టర్స్ చేతులు దాటిపోయింది పరిస్థితి అన్నారు, నాకు ఫోన్ లో అన్ని తెలియచేసారు.

నేను వెంటనే మా ఊరికి వెళ్ళాను.ఆ అమ్మాయిని పెద్ద ఆసుపత్రి కి తీసుకెళ్లను. వాళ్ళు మేము ఏమి చేయలేము అన్నారు.

ఇంక నాకు ఆ సాయి బాబా నే సర్వస్వం అనిపించింది.

అమ్మాయి ఇంకా బతకదు. అనేసారు. నేను మిట్ట మద్యాహ్నం బాబా గుడికి వెళ్ళాను.

ఎంత ఏడ్చేశానో నాకే తెలీదు, బాబాకు సర్వస్య శరణాగతి చేసాను. “బాబా ఆ అమ్మాయిని రక్షించు” అని చాలా వేడుకున్నా.

” నా సమాధి నుంచి సమాధానం ఇస్తాను” అన్న బాబా వచనం ఎప్పుడూ ఊరికే పోదు. ఇది అక్షర సత్యం.ఆ సాయి నాధుడే కదిలి వచ్చాడు ఒక కొత్త డాక్టర్ రూపం లో.

ఆ అమ్మాయికి ఒక్క ఇంజక్షన్ ఇచ్చాడు, అంతే..నిదానంగా ఆమె శరీరం లో ఉన్న విషము మొత్తం నీరులా బయటికి వచ్చేసింది.

ఇక్కడ బుర్లా అనే ఆస్పత్రి చాలా ఫేమస్.అమ్మాయిని అక్కడికి మార్చాము.

ఇంతలో ఆ డాక్టర్ కు ధన్యవాదాలు చెప్తామని ఎంత వెతికిన కనపడలేదు.

నేను వెంటనే నర్స్ దగ్గరికి వెళ్లి అడిగాను.”ఆ డాక్టర్ ఎక్కడ? అని” ఆవిడ చెప్పింది” ఏ డాక్టర్, ఎవరు రాలేదే,  నేను చూడలేదు” అనింది.

అప్పుడు నా బుద్ధి పని చేసింది, ఆ వచ్చినది బాబా నే అని, చూసారా!!! నన్ను ఎంత పెద్ద కష్టం నుంచి బాబా బయటపడేసారో.

ఇంతకు ఆ అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అని వుండినది. అందుకు పెదవాళ్లకు చెప్పలేక అలా చేసింది.ఆ అమ్మాయికి అతని తోనే పెళ్లి చేసాము.

చూడండి,బాబా నాకు సహాయకుడిగా రాకపోతే,ఎంత అపవాదు వచ్చేదో!!!

నాకు ఇలా ఎన్నో రాకాలుగా బాబా నన్ను రక్షిస్తున్నారు. అందుకే నేను సదా ఆయననే నమ్మి జీవిస్తున్నాను.

ఇలా చాలా వున్నాయి నాకు చెప్పేదానికి.సర్వం సాయి నాతర్పణమస్థు.

మళ్ళీ ఇంకో లీలతో కలుస్తాను.నమస్కారం.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles