సర్వం సాయినాధుని సంకల్పమే



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నా పేరు ప్రతిభ. ఒకరోజు మా తమ్ముడు గోపి వాళ్ళ నాన్నకి ఆరోగ్యం బాగా లేక E S I  హాస్పిటల్ లో జాయిన్ చేసారు.

అందుకోసం తనని చూడడానికి తరచూ వెళ్లేదానిని. అలా వెళ్ళినప్పుడు గోపి వాళ్ళ నాన్న పక్కన బెడ్ లో ఒక ఆంటీని చూసాను.

ఎందుకో తెలియకుండానే తనపై ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. కానీ,నేను తనతో ఎప్పుడు మాట్లాడేదాన్ని కాదు.

అంకుల్ ని డిశ్చార్జ్ చేసే రోజు వెళ్లి, అన్ని దగ్గరుండి చూసుకుంటున్న సమయంలో తను నాతో మాట్లాడితే డాక్టర్స్ వచ్చేసరికి టైం పట్టేలా ఉంది కదా ఆంటీతో కొంచెంసేపు మాట్లాడదం అని ఆ బెడ్ దగ్గర కూర్చొని మాట్లాడుతూ మీ ప్రాబ్లమ్ ఏమిటి ఆంటీ అని అడిగా.

హార్ట్ ప్రాబ్లెమ్ సర్జరీ చేయాలంటున్నారు అని చెప్పింది. నేను ఏమి భయపడకండి అంతా బాబా చూసుకుంటారులే అని చెప్పాను.

దానికి ఆమె అవును ఇప్పటివరకు అంతా బాబానే చూసుకున్నారు. నా జీవితములో అన్ని ఆయనే చూస్తారు నేను నా పదహారు సంవత్సరాల నుండి బాబాని నమ్ముతున్నాను అని చెప్పింది.

నేను ఈ ఆంటీ  పెద్ద భక్తురాలిలా ఉంది అనుకుని, బాబా గురించి ఏమైనా చెప్పండి ఆంటీ అని అడిగాను.

నాకు బాబా చాలా చేసాడమ్మా అని స్టార్ట్ చేసి మా అబ్బాయి చిన్నతనంలో తనకి ఏదో వ్యాధి వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్ లో జాయిన్ చేసాము.

డాక్టర్స్ ఏవో మందులు ఇచ్చేవారు. అలా ఒక రెండు నెలలు హాస్పిటల్ లోనే ఉన్నాము.

డాక్టర్స్ నయం కావడం చాలా కష్టం అని చెప్పారు. నేను బాబాని నమ్ముకున్నాను తనే నా బిడ్డను కాపాడుతాడని ధైర్యంగా ఉన్నాను.

అలా ఉండగా, మేము బాబు దగ్గర లేని టైంలో ఇద్దరు ఆడవాళ్ళు వైట్ చీర కట్టుకుని హ్యాండ్ బాగ్ వేసుకుని మా బాబు దగ్గరికి వచ్చి, రోజు చాలా చిన్న పేపర్ లో చిటికెడంత మాత్రమే ఊదీ, రెండు బిస్కెట్స్ (ఓల్డ్ కంపెనీ బిస్కెట్స్, ఇప్పుడు ఆ కంపెనీ  లేదట. పేరు మరచిపోయాను) ఇచ్చేవారు.

ఆ ఊదీ కూడా యెంత ఉండేదంటే ఈ రోజు పెడితే రేపటికి పెట్టుకోవడానికి ఉండదు అంత కొంచెం ఊదీ ఉండేది ఆ పాకెట్ ల.

మా అబ్బాయి దగ్గరకి వచ్చి రోజు అలా రోజు ఇచ్చేవారు. మేము మొదట అక్కడ పనిచేసే సిస్టర్స్ ఎవరో ఇస్తున్నారేమో అనుకుని అంతగా పట్టించుకోలేదు.

కానీ రోజు ఇలాగే జరగడం మేము వచ్చేసరికి వాళ్ళు లేకపోవడంతో, అక్కడ పనిచేసే స్టాఫ్ ని అడిగాము.

ఇలా రోజు ఎవరు ఇస్తున్నారు అని. కానీ వాళ్లెవరు మేము కాదు, ఇక్కడ ఉన్న వాళ్లెవరు ఇవ్వట్లేదు. మీ వాళ్లే ఎవరో ఇస్తున్నారు అనుకుంటున్నాము అని చెప్పారు.

మాకు అనుమానం వచ్చి సరే ఈ రోజు నుండి బెడ్ దగ్గర నుండి పక్కకి వెళ్లొద్దు వచ్చేవాళ్ళు ఎవరా అని చూడాలి అని అక్కడే ఉండేదానిని.

నేను ఉన్నప్పుడు రాకపోయేవాళ్లు. నేను కొంచెం బాత్ రూమ్ కి అనో, ఛాయ్ కి అనో అలా వెళ్ళగానే ఇలా వచ్చి ఇచ్చి వెళ్ళేవాళ్ళు.

నేను ఒక రోజు రాత్రి వరకు అలాగే వచ్చేవాళ్ళకోసం చూస్తూ, అప్పుడే అలా పక్కన ఎవరో మాట్లాడితే అలా వెళ్ళాను అంటే ఆ రెండు మూడు నిమిషాల గ్యాప్ లోనే ఇలా వచ్చి ఇచ్చేసి వెళ్లారు.

మా బాబుని అడిగితే, రోజు వచ్చే ఆంటీ వాళ్ళు ఇచ్చి వెళ్లారు అని చెప్పాడు. అలా ఎంతకీ నయమవదని డాక్టర్స్ చెప్పినా మా అబ్బాయి వ్యాధి నయమైంది.

డాక్టర్స్ కి అలా ఎలా నయమైంది అని అర్ధం కాలేదు.

కానీ నాకు అర్థమైంది.

ఆ వచ్చిన వాళ్ళుబాబా అని. లేదా బాబా పంపితే వచ్చిన వాళ్ళు అని.బాబాకి రెండు అంటే ఇష్టం అందుకే రోజు ఇద్దరు వచ్చారు.

రెండు బిస్కెట్స్ ఇచ్చారు. అలా పెట్టిన  ఆ ఊదీతోనే మా అబ్బాయి వ్యాధి నయం అయింది.

వాళ్ళు బాబా కాకపోయి ఉంటే నేను పక్కకు వెళ్లిన ఆ నిమిషం లోనే వాళ్ళకి తెల్సి ఆ రెండు నిమిషాల వ్యవధిలోనే అలా ఇచ్చి వెళ్ళరు కదా!

ఇంకెవరైనా ఐతే అలా వాళ్లెవరో తెలియకుండా సాయం చేయరు.

చిన్న సాయం చేస్తేనే మేము చేసాము అని చెప్పుకునే వాళ్లే ఎక్కువ.

అలా మాకు కనిపించకుండా మాకు సాయం చేసే వాళ్ళు ఇంకెవరై  ఉంటారు.

అది కూడారోజు  రెండే బిస్కెట్స్, ఊదీ ఎవరు ఇస్తారు.  అది బాబానే అనుకుని ఆనందించాము. అప్పటి నుండి ఇప్పటి వరకు మా అబ్బాయికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు.

పెళ్ళై పిల్లలతో హ్యాపీగా ఉంటున్నాడు. నేను రోజు సాయి సచ్చరిత్ర చిన్న బుక్ ఎప్పుడు చదువుతాను.

అది ఎప్పుడు నా హ్యాండ్ బాగ్ లోనే ఉంటుంది అని బుక్ తీసి చూపించారు.

ఇది వినగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్ని రోజులు ఆ ఆంటీ ఎవరో తెలియకుండానే తన మీద నాకు అభిమానం ఎందుకు ఏర్పడిందో అప్పుడు నాకు అర్థమైంది.

తాను బాబాకి మంచి భక్తురాలు కాబట్టి నాకు తెలియకుండానే ఆ వైబ్రేషన్స్ అలా ఆంటీపై మంచి అభిప్రాయం ఏర్పడేలా చేసాయి అని.

     ~~~~సర్వం సాయినాధార్పణమస్తు~~~~

                                                    

*** సాయిసూక్తి:

 “నేను నీకు జ్ఞానాన్ని ఇవ్వను నీలోని అజ్ఞానాన్ని తీసివేస్తాను”.

 

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

2 comments on “సర్వం సాయినాధుని సంకల్పమే

Muralikrishna

Chala wonderful experience Prathibha as aunty vallu ekkada vuntaro valla phone number teesuko valasindi

Srinivasa Murthy

Sai Baba…Sai Baba…Sai Baba….Miracle chala bagundi madam

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles