మా ఆవిడా రెండు రూపాయలు దక్షిణ ఇవ్వగానే ”నువ్వు నన్ను షిరిడిలో కలుస్తావు మనం కలుద్దాము” అని మరాఠీ వాని రూపములో వచ్చిన ఆయన అన్నారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మేము పండరీపురం లో పారాయణ చెయ్యాలని అనుకున్నది మొదలు ఒకామె నాకు తరచు ఫోన్ చేసి అంత దూరం నువ్వు వెళ్ళలేవు.

వెళ్లిన ఇంత మందిని తీసుకెళ్లడం మరీ కష్టం. అక్కడ మీకు సౌకర్యాలు సరిగ్గా ఉండవు అంటూ నన్ను వెనక్కు లాగాలని బాగా ప్రయత్నం చేసింది.

నేను మాత్రం ”ఇది మా గురువుగారి ఆఖరి కోరిక నేను ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరతాను” అన్నాను.

”ఆయన నీకు ఎంత గురువైతే మాత్రం ఆయన ఉండగా ఆయనకీ వెనకాల నువ్వుండి అన్ని చేసావు. ఇప్పుడు నీ వెనకాల నీకు చెయ్యడానికి ఎవరు వస్తారు? నీకు ఎవరూ సాయం చేయరు ” అని నాకు హిత బోధ చేసింది.

ఆమె ఎంత వెనక్కి లాగాలని ప్రయత్నించి ఫోన్ చేస్తుందో, నాకు అంత పట్టుదల అక్కడ ఎలాగైనా పారాయణ చేయాలన్న తపన పెరిగిపోతోంది.

నా ప్రయత్నాలు నేను చేసుకుంటున్నాను. ప్రయాణం రోజు రానే వచ్చింది. అందరం ప్రయాణం అయ్యాం.

హైదరాబాద్ వచ్చేసరికి అక్కడ సాయి శ్రీనివాస్ గారన్న ఆయన స్టేషన్లో మా కోసం ఎదురు చూస్తున్నారు,

ట్రైన్ ఆగగానే ఆయన మా భోగిలోకి వచ్చి ”నరసింహారావు గారూ! మంచి కార్యక్రమం పండరీపురంలో పెడుతున్నారు, మీ వెనుక పని చేసే వారందరికీ మీరు ఇవి ఇవ్వండి” అంటూ షాల్స్ స్వీట్స్ ఇచ్చి వెళ్లారు.

ఆ తర్వాత అవి లెక్కపెడితే ఆరు షాల్స్ ఉన్నాయి స్వీట్స్ పాకెట్స్ కూడా ఆరు ఉన్నాయి.

నాకు నా వెనకాల చేసిన వాళ్ళు కూడా ఆరుగురు ఉన్నారు. వాళ్ళకి నేను జరిగినదంతా చెప్పాను ”ఈ పారాయణ నుండి నన్ను వెనక్కి లాగాలని ఒకామె ప్రయత్నం చేసింది.

మీరు నాకు సహకారం అందించారు. అందుకే బాబా మీ కోసం శ్రీనివాసరావు గారి రూపంలో ఇవి ఇచ్చి పంపించారు ” అని చెప్పాను.

1994 సంవత్సరంలో ఒక రోజు ఉదయం 10 గంటలకి, నేను ఆ రోజు ఎందుకో ఇంట్లోనే ఉన్నాను. మా ఇంటికి ఒక మరాఠీ వ్యక్తి వచ్చాడు.

ఆయన గుమ్మం బయట చెప్పులు విప్పి లోపలి వచ్చాడు. ఆ చెప్పులు బాగా అరిగి పోయి కన్నాలు పడివున్నాయి. నేను అతన్ని చూసి ” ఏంటని ” అడిగాను.

”నాకు డబ్బులు ఇమ్మన్నాడు” నేను ”డబ్బులు లేవన్నాను” ”మీరు నా కోసం డబ్బులు దాస్తున్నారు” అన్నాడు.

మా ఆవిడ చిల్లర డబ్బులు దాస్తుంటుంది. అవన్నీ షిరిడి ప్రయాణానికి ఖర్చు పెడుతుంటాము.

నేను మా ఆవిడతో ” ఒక రెండు రూపాయలు అతనికిచ్చి పంపించు” అన్నాను. మా ఆవిడ అతనికి రెండు రూపాయలు ఇచ్చింది.

అతను ”నువ్వు నన్ను షిరిడిలో కలుస్తావు మనం కలుద్దాము” అంటూ వెళ్ళిపోయాడు.

The above miracle has been typed by: Mrs. Rajarajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

2 comments on “మా ఆవిడా రెండు రూపాయలు దక్షిణ ఇవ్వగానే ”నువ్వు నన్ను షిరిడిలో కలుస్తావు మనం కలుద్దాము” అని మరాఠీ వాని రూపములో వచ్చిన ఆయన అన్నారు.

Sai Baba

బాబా వారి లీల అద్భుతము…మనము చాల లీలలో చదివాము.. బాబా వారే స్వయముగా భక్తుల ఏళ్ళకి వెళ్లి దక్షిణ స్వీకరించడము. ఈ లీలలో కూడా అలానే జరిగింది.

Sai Baba

This is really amazing. Many times Baba himself visited the devotee’s houses for collecting Dakshina as it happens in the above miracle.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles