మండుతున్న చితి మంటల్లోనుంచి మా గురువు గారు (తిరుమల శెట్టి సుబ్బారావు) లేచి కూర్చొని – ”నువ్వు పారాయణ చేయించు, ఆపొద్దు” అని చెప్పినట్లు అనిపించింది. 



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నా పేరు నరసింహారావు.  మేము కొవ్వాడ లో ఉంటాము.  నేను LIC ఏజెంట్ ని.  మా చిన్నప్పుడు ఖర్గపూర్లో ఉండేవాళ్ళము.

మా నాన్న గారు సత్య సాయి భక్తులు. మా ఇంటి నిండా సత్యసాయి బాబా ఫోటోలు ఉండేవి. అన్నిటి మధ్యన ఒకటి షిరిడి సాయి బాబా ఫోటో ఉండేది.

అదెందుకో నన్ను చాలా ఆకర్షిస్తుండేది. ఆ ఫోటోను నేను ఎక్కువగా చూస్తుండే వాడిని.

నేను ఖర్గపూర్లో ఉంటే నాకు తెలుగు సరిగ్గా రాదని,  నన్ను తీసుకెళ్లి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచారు. నేను అక్కడ స్కూల్ లో చేరాను.

నా వయస్సప్పుడు ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది. చదువుకునేటప్పుడే నేను ఒక చిన్న సాయిబాబా ఫోటో ఒక రూపాయి పెట్టి కొనుక్కున్నాను.

నా పుస్తకాల అలమరాలో పెట్టుకొని అప్పుడప్పుడు ఆ ఫోటో కేసి చూస్తుండేవాడిని.

నేను ఇంటర్లో ఉన్నప్పుడు అనుకోకుండా హైదరాబాద్ వెళ్లి సికింద్రాబాద్ స్టేషన్లో ద్వారకామాయి బాబా ఫోటో కనపడితే, నా దగ్గర ఉన్న ఫోటో కి భిన్నంగా ఉందని అది కొనుక్కొని తెచ్చుకున్నాను.

1992 లో మా చెల్లెలికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాము. ఏవీ కుదరటంలేదు.  ” శ్రీ సాయి సచ్చరిత్ర ” పుస్తకం పారాయణ చేస్తే తొందరగా పెళ్లి కుదిరిపోతుంది అని ఎవరో చెబితే,

నేను భరద్వాజ మాస్టారు గారి పుస్తకం కొని, అన్ని పనులు అయ్యాక రాత్రులప్పుడు చదువుతూ, కేవలం మా చెల్లెలి పెళ్లి అవుతుంది అన్నారని బలవంతంగా కూర్చొని మూడు పారాయణలు పూర్తి చేశాను.

ఆ తరువాత మా చెల్లెలి పెళ్లి, వెంటనే  నా పెళ్లి, జరిగిపోయాయి. ఆ తర్వాత మా నాన్న గారు పోవడంతో, క్రమంగా మాకు బాధలు మొదలయ్యాయి.

ఆ పరంపరలో ఇంట్లో పూజలు చేయడం,  మొదలైంది. నేను బాబాకి అష్టోత్తరం, హారతులు చేస్తుండే వాడిని.

ఏ పేపర్లో అయినా ఎక్కడైనా బాబా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిస్తే అక్కడికి వెళ్ళటం చేస్తుండేవాడిని.

ఆ క్రమంలో అమ్ముల సాంబశివరావు గారు పారాయణలు చేస్తుండేవారు. కాకినాడ దగ్గరలో పారాయణ చేస్తున్నప్పుడు తిరుమల శెట్టి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో పారాయణాలు జరుగుతూ ఉండేవి. అందులో పాల్గొంటూ ఉండేవాడిని.

అప్పుడప్పుడు కాకుండా ఈయన నెల నెల పారాయణలు చేస్తుండేవారు. పారాయణ జరుగుతుంది అని తెలిసి నేను వెళ్లి ఒక పక్కన కూర్చునే వాడిని.

రాబోయే నెలలో పారాయణ ఎక్కడో తెలుసుకొని మళ్ళీ వెళ్ళాను, ఎక్కడో ఒక మూల కూర్చుని అయిపోయాక వెళ్ళిపోయాను.

మూడవ పారాయణంకి వెళ్లి అక్కడి వారితో ”నేను కూడా చదవచ్చా”  అని అడిగాను, సరేనన్నారు, అలా మొదటిసారి వారి పారాయణం లో నేను చదివాను.

5వ పారాయణం జరిగేటప్పుడు సుబ్బారావు గారు నన్ను పిలిచి, చూడు బాబు, నేను లేకపోయినా నువ్వు చూసుకోవాలి అని నాకు అప్పజెప్పారు.

నేను చెయ్యటం మొదలుపెట్టాను.  ఆయన పారాయణం చేసే ప్రతిసారి నన్ను పిలిపించడం చేయసాగారు.  అలాగ 386 పారాయణ వరకు అయ్యాయి.

387 వ పారాయణ ఒక చోట గుడిలో జరుగుతోంది ,  ఈ లోపుల ఒక విషాద వార్త వచ్చింది,  గురువుగారు సుబ్బారావు గారు చనిపోయారు. 

అవతల పారాయణం జరుగుతోంది.  ఇవతల ఈయన ఇలా అవ్వడంతో ఆయన కి జరగాల్సిన కార్యక్రమాలు చూడాలి కదా! ఇక్కడ పారాయణం మరి ఆపెయ్యలా ? ఆమ్మో బాబా పారాయణం జరుగుతుంటే మధ్యలో ఎలా ఆపటం?  పోయింది గురువుగారు, మరి ఆపక పోతే ఎలా? ఇలాగ తల బద్దలుకొట్టుకున్నాను.

ఏం  చెయ్యాలి మిగతావాళ్ళని చదువుతూ ఉండమని నేను ఆయన ఇంటికి, ఆ తరువాత స్మశానానికి వెళ్ళాను.

అప్పటికి నా మనస్సులో అనుమానాలు సుడులు తిరుగుతూనే ఉన్నాయి ఏం చెయ్యాలి? అని. ఆయనకి అంతిమ సంస్కారం అయ్యింది.  చితి మండుతుంది. అందులోంచి ఆయన లేచి కూర్చొని – ”నువ్వు పారాయణ చేయించు, ఆపొద్దు” అని చెప్పినట్లు అనిపించింది. 

అంతే నేను పారాయణం చేసే దగ్గర కి ఫోన్ చేసి పారాయణం ఆపొద్దు అని చెప్పాను.  మైకులు తీసేసి సైలెంట్ గా  పారాయణం పూర్తి చేసాము.

అప్పటి నుండి నెలకి ఒక పారాయణ చేస్తూ వస్తున్నాము. సుబ్బారావు గారు బ్రతికుండగా ఒక్కసారైనా పండరీపూర్లో పారాయణ చెయ్యాలని అనుకున్నారు.

గురువుగారి ఆఖరి కోరిక తీర్చాలని నేను డిసెంబర్లో షిరిడి వెళ్లి బాబా పాదాల మీద తలపెట్టి షిరిడి లో బాబాను అనుమతి అడిగాను.

”బాబా మా గురువుగారి ఆఖరి కోరిక పండరీపూర్లో పారాయణ చెయ్యాలని, మరి మువ్వేమంటావు? ” నువ్వు కనుక నా ప్రయత్నానికి ఒప్పుకుంటే నాకు నువ్వు మూడు సార్లు పాండురంగ విఠలుడిగా దర్శనం ఇవ్వాలి అని అనుకున్నాను.

నేను గ్రూపుతో ఎప్పుడు వచ్చినా, నేను ఒక్కడినే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాను. ఎందుకంటే నాకు సమయం ఉండదు.

కూడా వచ్చేవారందరికీ వసతి సదుపాయాలు అన్నీ నేనే చూసుకోవాలి కాబట్టి నాకంత సమయం ఉండదు. కానీ ఈ సారి అనుకోకుండా కొంత మంది నాసిక్ వెడుతున్నామంటే వాళ్ళతో పాటు నేనూ వెళ్ళాను.

ముక్తి ధాము అనే గుడిలో బాబా ఒక పక్క, మరో పక్క పాండు రంగ విఠలుడు కనపడ్డారు.

అక్కడి నుండి వచ్చాక భోజనం కోసం పున్నమి రెస్టారెంట్లో పాండురంగడు బాబాతో కలిసి ఉన్న ఫోటో మరొకటి కనపడింది.

మరొకటి షిరిడి నాల్గవ నెంబర్ గేటు నుండి తిన్నగా వెడుతుంటే ఒక చోట బాబా గుడిలాగా కనిపించింది,  అదేంటని? అడిగాను.  ఇది పండరి విఠలుడి గుడి అని ఎవరో చెప్పారు.

నేనూ లోపలికి వెళ్లి దర్శనం చేసుకున్నాను. అలా మూడు సార్లు బాబా పాండురంగడితో కలిసి దర్శనం ఇచ్చేటప్పటికి మేము పండరీపురంలో పారాయణం కి బాబా అనుమతి ఇస్తున్నట్లుగా మేము భావించి. మేము పండరీపురంలో చెయ్యాలని తీర్మానం చేసుకున్నాము.

అది మాకు కొత్త స్థలం కనుక అక్కడ మనకి ఎలా ఉంటుందో? ఏం దొరుకుతాయో?  ఎక్కడ పారాయణ చెయ్యాలో?  అక్కడికి మాతో పాటు వచ్చే వారికి వసతి సౌకర్యాలు ఎలా ఉంటాయో? అని ముందుగా ఇంటర్నెట్ లో చూసాము.

పారాయణానికి వీలుగా చంద్రబాగా నదికి పక్కనే శారదా భవనం అని వుంది. అది బావుంటుందని అనిపించింది.  కొంతమందిమి కలిసి వెళ్ళాము.

అక్కడ మన భోజనం ఉండదు. దానికోసం వంటవాళ్ళని తీసుకువెళ్లాలి. అంతా చూసాము వసతి కోసం.

4, 5 చోట్ల చూసాము మాకు అనుకూలంగా లేదనిపించింది. ఏం చెయ్యాలా అనుకుంటూ ఉంటే ఒక ముస్లిం ఆటో వాడు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళాలి?  ఏం కావాలి?  అని అన్నీ అడిగి, మమ్మల్ని ముందు నెట్లో చుసిన శారదా భవన్ కి తీసుకువెళ్లాడు.

అది మాకు అనుకూలంగా ఉంటుందని అనిపించింది. ఆ తరువాత 2016 సం||ము లో 200 మందిమి వినాయక చవితి వెళ్ళగానే పండరీపురం వెళ్ళాము. 

ఆ ముస్లిం ఆటో డ్రైవర్ అక్కడ మాకు కూరలు, కావాల్సిన సరుకులు మరియు ఇలా అన్ని విషయాలలో సహకారంగా ఉన్నారు.

The above miracle has been typed by: Mrs. Rajarajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

2 comments on “మండుతున్న చితి మంటల్లోనుంచి మా గురువు గారు (తిరుమల శెట్టి సుబ్బారావు) లేచి కూర్చొని – ”నువ్వు పారాయణ చేయించు, ఆపొద్దు” అని చెప్పినట్లు అనిపించింది. 

Sai Baba

యద్భావం తద్భవతి….బాబా వారు ఎప్పుడు చెప్పుతూవుండేవారు …నేను నీ అంతరాత్మనని, నీ హృదయములో ఉంటాను అనే వారు. ఫై లీలలో ఆ భక్తుడి మనసును యెరిగి, అయన కోరికను తీర్చారు.

Sai Baba

Once after completely surrender to Baba then
What We feel then He feel and will…
Baba was always telling the devotees.
I am the Inner Ruler of all and seated in their hearts.
I envelope all the creatures, the movable and immovable world.
I am the Controller – the wire-puller of the show of this Universe.

Baba reads his mind and fulfills his desire

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles