Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
లక్ష్మి కాంత్ రవి గారి అనుభవములు రెండవ భాగం
మళ్ళీ 2 సంవత్సరాలు అనంతరం డెహ్రాడూన్, హరిద్వార్ అన్నీ చూసుకుని అక్కడ సాయి సత్యవ్రతం చేయాలని అనుకున్నాము.
హరిద్వార్ దగ్గర వాన వస్తుంది. నీళ్ళు అన్ని రోడ్డు మీదకు వచ్చేసి బ్రిడ్జి మీదకు నీళ్ళు వచ్చేస్తున్నాయి.
అందరూ రోడ్డు మీదే ఉండిపోయారు. మేమంతా బ్రిడ్జి దాటాలి (100 అడుగులు దాటాలి) .
నేను ధైర్యం చేసి బాబాను తలచుకుంటూ నామం చెప్పుకుంటూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుంటూ “ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి” అంటూ దాటేసాము.
నీళ్ళు చాలా వేగంగా ప్రవహిస్తున్నాయి. అటువంటి సమయంలో అలా నీళ్ళలో దిగటం అందరూ ప్రమాదం అని అన్నారు. బాబా ఉండగా మనకెందుకు చింత.
డెహ్రాడూన్ లో భోజనం చేస్తుండగా ఒక ముసలాయన అన్నం పెట్ట మంటూ సైగ చేసాడు.
కాళీ ప్లేట్ తెప్పించి అందులో చపాతీలు, కూర అన్నం అన్ని వేసి ఇచ్చాను. అతను గబా గబా తినేసి వెళ్ళిపోయాడు.
ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో చూద్దామని అనుకున్నాము. చూస్తే ఎక్కడా ఆయన కనపడలేదు. బాబాయే ఆలా బిక్షకుని లాగ వచ్చి భోజనం చేసి వెళ్ళాడు అని ఒకాయన అన్నాడు.
ఒకసారి నేను బాబా గుడిలోకి వెళ్తున్నాను. లోపలికి వెళ్తుంటే మాకు తెలిసిన ఆవిడ నాకు ఎదురువచ్చింది.
మేమిద్దరము సాయిరాం, సాయిరాం, అంటూ పలకరించుకున్నాము. ఆవిడతో నేను మీతో నాకు ఇంకా మాట్లాడే పని ఉంది, ఉండండి నేను ఇప్పుడే లోపలి వెళ్లి రెండు నిమిషాల్లో దర్శనం చేసుకుని వచ్చేస్తాను అని అన్నాను.
రెండు నిమిషాలలో ఎలా వస్తావు రాలేవు. అరగంట తక్కువగా రాలేవంది. కాదు వచ్చేస్తాను అన్నాను.
తీరా లోపలికి వెళ్ళాక హారతి సమయం అయ్యింది. అరగంట తరువాత గాని నేను రాలేక పోయాను.
మేము నిన్ననే పండరీపురం లో ‘సచ్చరిత్ర’ పారాయణం (2016 ) పూర్తి చేసుకున్నాము.
కృపా నిధి గురువుగారిని పిలిచాము. ఆయన స్వర్గ నిధి ఆశ్రమం వ్యవస్థాపకులు. పండరీపురం 450 వ సచ్చరిత్ర పారాయణ యజ్ఞం జరిగిందక్కడ.
నిర్వాహకులు ఆయన ద్వారా (కృపా నిధి గురువు గారి ద్వారా) అందరికి ప్యాంటు, షర్ట్ (గిఫ్ట్ గా) ఇప్పించారు.
ఆయన ప్యాంటు షర్ట్ ఇస్తూ – చెన్నై లో నీ ఇల్లు ఫలానా చోట ఉంది, నీ సమస్యలకి సమాధానాలు దొరుకుతాయి, బాబాయే నీకు అన్నీ చూపిస్తాడు అని అన్నారు.
The above miracle has been typed by: Shiva Kumar Bandaru,
లక్ష్మి కాంత్ రవి గారి అనుభవములు మూడవ భాగం తరువాయి భాగం….
Latest Miracles:
- “నిన్న ఎందుకు రాలేదు. నీ కోసం ఎదురు చూసాను” అని బాబా వారి ప్రేరణతో భక్తున్ని అడిగిన అమ్ముల సాంబశివరావు గారు.
- రైలు ప్రమాదం లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన బాబా గారు.(బాబా పైన ఉన్న భక్తి ఎదుటి వ్యక్తిని కాపాడే శక్తి గా మారిన కథ).
- ”నీ కామెర్లు ని బాబా గారు తీసేసుకున్నారు. నీకు నయం అయిపోయింది .”
- సచ్చరిత్ర పారాయణ ఫలితం – కలలో వచ్చి వైద్యం చేసి ఆపరేషన్ అవసరం లేకుండా చేసిన బాబా గారు.
- సచ్చరిత్ర ద్వారా ఉపవాస దీక్ష గురించి తెలిపి తన భక్తురాలి దీక్ష విరమించుకునే లాగా చేసిన బాబా గారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments