“నిన్న ఎందుకు రాలేదు. నీ కోసం ఎదురు చూసాను” అని బాబా వారి ప్రేరణతో భక్తున్ని అడిగిన అమ్ముల సాంబశివరావు గారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


లక్ష్మి కాంత్ రవి గారి అనుభవములు మొదటి భాగం

నా పేరు లక్ష్మి కాంత్ రవి. నేను ఢిల్లీ లో చదివాను. నేను చదువుకుంటున్నప్పుడు ఢిల్లీ లోథియాన్ రోడ్ లో సాయిబాబా గుడి కడుతున్నారు.

నేను అక్కడికి వెళ్లి అప్పుడప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉండేవాడిని.

నా పెళ్ళి అయిన తరువాత మా బావమరిది నాసిక్ లో ఉండేవాడు. మేము నాసిక్ వెళ్ళాము.

షిరిడి అక్కడికి దగ్గరే అవ్వటాన మంచి అవకాశం వచ్చింది అని షిరిడి కి వెళ్ళాము. బాబాను చూడటం అదే మొదటి సారి. నాకు బాగా అనిపించింది.

నాకు ఆస్తమా వ్యాధి ఉంది. దానికి ట్రీట్మెంట్ కోసం ఒక హాస్పిటల్ లో చూపించుకుందాం అని వెళ్ళాను. x – ray తీయించుకుని రమ్మన్నారు.

x -ray తీయించుకోవడానికి నేను లైన్లో నిల్చున్నాను. ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చి, నువ్వు బాబా భక్తుడివి కదూ! నాకు బాబా ఫోటో ఒకటి కావలి ఇస్తారా? అని అడిగింది. నేను ఇస్తానన్నాను.

ఆవిడ ఏదో office లో పని చేస్తుంది. నాకా వివరాలు చెప్పింది. నేను ఇంటికి వచ్చాక ఆవిడకి ఫోటో ఇవ్వాలని నా దగ్గర ఉన్న బాబా ఫొటోలన్నీ ముందు పెట్టుకుని రెండు, మూడు ఫోటోలు మార్చి మార్చి ఒక ద్వారకామాయి బాబా ఫోటో తీసుకుని వెళ్ళి ఇచ్చాను.

ఆవిడ ఆ ఫోటో తీసుకుని ముందు నువ్వు చాలా ఫోటోలు ముందు పెట్టుకుని ఈ ఫోటో కాదు ఆ ఫోటో అంటూ మార్చి మార్చి ఈ ఫోటో పట్టుకు వచ్చావు కదూ! అంది. నేను ఆశ్చర్యం గా అవును అన్నాను.

ఆవిడ ఇంకా ఈ రోజు రాత్రి ఒక పేపర్, పెన్సిల్ దగ్గర పెట్టుకోండి బాబా మీకు మెసేజ్ ఇస్తారు అని చెప్పింది. ఇంకా మా ఇంట్లో దేవుడి గూట్లో ఎటువైపు ఏ ఫోటో ఉందొ కూడా ఆవిడ చెప్పింది.

రాత్రి అయింది. నాకు మధ్యరాత్రి లో మెలకువ వచ్చింది. ఏవో మాటలు వినిపిస్తున్నట్లు అయింది.

అదేంటంటే “నీలో సూర్యునిలో ఏ శక్తి అయితే ఉందొ ఆ శక్తి ఉంది. నారాయణ స్తోత్రం లో ఆఖరి వాక్యం లో చెప్పినట్లు గా హరిహరులు ఒక్కరే వారు వేరు వేరు గా కనిపించినా బేధం లేదు. ఇది సత్యం.” అని నాకు వినపడింది.

“ఆ శివకేశవులంటే బాబాయే అని నాకు నమ్మకం కలిగింది”. అప్పటినుండి నేను సమయం ఉన్నప్పుడల్లా సాకేత్ సౌత్ ఢిల్లీ బాబా మందిరంకు వెళ్ళేవాడిని.

గురువారం మాత్రం తప్పనిసరిగా వెళ్తాను. ఒక గురువారం నాడు మాత్రం ఏదో పని ఉండి నేను గుడికి వెళ్ళలేకపోయాను. ఆ మర్నాడు శుక్రవారం సాయంత్రం వెళ్ళాను.

ఎవరో ఢిల్లీ వాళ్ళు సాయి నామం చేస్తున్నారు. నేను అందులో జాయిన్ అయ్యాను.

కాసేపు భజన చేసి రిలాక్స్ అవుదాం అని లేచాను. అక్కడ చాలా మంది బాబా భక్తులు ఉన్నారు.

అమ్ముల సాంబశివరావు గారని కాకినాడ నుండి వచ్చారు అన్నారు. ఆయన ఛార్ ధామ్ యాత్ర చేసి ఢిల్లీ లో ఆగారు, అని అన్నారు.

ఆయనని చూడటానికి వెళ్ళాను. అప్పుడు అర్దరాత్రి 12 అవుతుంది. ఆయన (సాంబశివరావు గారు) పడుకుని ఉన్నారు.

పడుకున్నారు కదా అని నేను వెనుతిరిగాను. ఆయన నన్ను పిలిచారు. నేను వెళ్లి ఆయన పడుకున్న కాళ్ళ దగ్గర కూర్చున్నాను.

ఆయన అక్కడ కాదు, ఇక్కడ అంటూ తల పక్కకు చూపించారు. నేను లేచి వెళ్లి అక్కడ కూర్చున్నాను.

“నిన్న ఎందుకు రాలేదు. నీ కోసం ఎదురు చూసాను” అని అన్నారు.

ఈయన ఎవరు, నేను ఎవరిని, ఈయన్ని నేను ఇప్పుడే మొదటి సారి చూస్తున్నాను. ఈయన నా గురించి ఎదురు చూడటం ఏమిటి? అని చాలా ఆశ్చర్య పోయాను.

ఆ తర్వాత క్రమంగా అర్ధమయింది. మాట్లాడింది ఆయన కాదు, బాబా అని.

నేను నిన్న గురువారం గుడికి రాలేదు కదా, నా కోసం బాబా ఎదురుచూశారా! ఆయన ఎక్కడో షిరిడి లో ఉండి ఈ ఊర్లో నేను ఆయన గుడికి ఒక్కరోజు వెళ్లకపోతే నా గురించి అడిగాడా బాబా! అది బాబా గొప్పదనం.

అమ్ముల సాంబశివరావు గారిని మర్నాడు నేను అడిగాను. నేను నిన్నరాలేదు అని మీకెలా తెలుసు! ఆ సంగతి మీరు నన్నెలా అడిగారు? అని అడిగాను.

దానికి ఆయన “నేను అలా అడిగానా, నాకేం తెలియదు” అన్నారు.

The above miracle has been typed by: Shiva Kumar Bandaru,

లక్ష్మి కాంత్ రవి గారి అనుభవములు రెండవ భాగం తరువాయి….

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles