Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
ఒక దీపావళి రోజు నేను మా ఇంట్లో వున్న ఒక చిన్న సాయి ఫోటో మరియు విరాట్ సాయి(పూజ్య గురు శ్రీ అమ్ముల సాంబశివ రావు గారిచే నిర్మించబడిన 116 అడుగుల విగ్రహపు ఫోటో) ఫోటో కి బంతి పూల మాలలు వేసాను. ఒకరోజు అయినా కూడా అవి తాజా గానే వున్నాయి కదా అని వాటిని తీసేయక మరుసటి రోజు కుడా అలాగే ఉంచాను. కానీ ,మనసులో అలా నిన్నటి పూల మాలలు బాబా కి వుంచావచ్చో లేదో అనుకుంటున్నాను..అలా బాబా ముందు వున్న టైం లో సడన్ గా విరాట్ సాయి పెద్ద ఫోటో కి వేసిన దండ తెగిపోయి టేబుల్ పయి పడింది..బాబా ఫోటో పైనా పెట్టిన పువ్వు కుడా క్రింద పడిపోయింది..సాధారణంగా మాల బరువుగా వుంది వుంటే అదేరోజు తెగిపోవాలి కానీ మరుసటి రోజు నేను అలా అనుకున్న టైం లో నే అలా జరగడం కాస్త ఆశ్చర్యం కలిగింది.అలాగే మాల తెగడం తో బాటు ఫోటో పైన వున్న పూవు కుడా క్రింద పడింది.
బాబావారి ఈ లీల లో నాకర్ధమయింది ఏంటంటే బాబా నా మనసులోని అలజడి అంటే , నిన్నటి మాల వుంచనా తీసేయనా అని అనుకుంటూ పరద్యానముగా వున్నానని ,దాన్ని తొలగిస్థూ సమాధానం గా అలా తన ,మాల ని తీశేసారని అనిపించింది.,ఇలా బాబా మన మనసులోని ప్రతి ఆలోచన గమనిస్థూ మన వెంటే ఉంటారని రుజువు చెస్తూ వుంటారు..మనం చేయాల్సిందల్ల బాబావారి ఉనికిని గమనిస్తూ,ఆస్వాదిస్తూ ఆయన సేవ లో జీవితం సాగించడమే…బాబా వారిని నాకు పరిచయం చేసిన మా గురుదేవులకి ఏమిచ్చినా నేను ఋణం తీర్చుకోలేను.
జై సాయిరాం
సాయి భావన
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సాయి భావన, జహీరాబాద్
- బాబా , రామకృష్ణపరమహంస వేరు కాదనే భావన రేగే కు కలిగింది–Audio
- నా సాయినాధుల వారే ఈటిక్కట్టు కలెక్టరు పై అధికారి రూపములో వచ్చి నన్ను ఆ కష్టము నుండి రక్షించి నన్నుఆశీర్వదించారనే భావన కలిగింది–సాయిబానిస(శ్రీ రావాడ గోపాలరావు). — 7–Audio
- భావన కాదు యదార్దమే! . …. మహనీయులు – 2020… అక్టోబరు 15
- సాయి అమ్మ.. సాయి నాన్న.. సాయే అన్ని ఈ జీవితానికి, ఇంతకు మించి ఏమి కావాలి
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments