సాయి భావన, జహీరాబాద్



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ్…నాకు జరిగిన బాబా అనుభవం మీ అందరితో పంచుకుంటున్నాను . మా ఇంట్లో పూజా మందిరం లో గోడ మధ్య భాగం లో  కొన్ని దేవుళ్ళ చిత్రాల ప్రింటెడ్ టైల్స్ వున్నాయి..వాటిని మా అమ్మ రోజు పూజిస్తుంటుంది.అందువల్ల నేను పూజించే సాయిబాబా ఫోటోలు రెండు ఆ గది కార్నేర్స్ లో పెట్టబడ్డాయి.ఒకరోజు ఉగాది పండుగ నాడు మా యింట్లో నేను ఒక్కదాన్ని మాత్రమే వున్నాను.అందరు వేరే ఊరికి వెళ్ళడం జరిగింది ..పూజ కి కూర్చున్నపుడు పూజ చేయడానికి మధ్యలో పెడితేనే సౌకర్యం గా చేసుకోవచ్చనే భావనతో ,మా అమ్మ కూడా లేదు కదా అభ్యంతరం చెప్పడానికి  అని అనుకుని బాబా ఫోటోలలో ఒక చివర వున్న ఫోటో ని తీసి గది మధ్య లో నా ఎదురుగ పెట్టుకుని పూజ,ఆరతులు చాల భక్తి గా మనస్పూర్తిగా చేసుకున్నాను.

అలాగే సాయంత్రం ఆరతి కుడా ఇచ్చి రాత్రి పడుకున్నాను..నాకు తెల్లవారు లేచాక ముందు పూజా గది దగ్గరికెళ్ళి బాబా ను చూడటం అలవాటు.,అలా లేచాక పూజా గది కి వెళ్లి చూసేసరికి వొళ్ళు జలదరించింది..అక్కడ గది మధ్య లోని బాబా ఫోటో మల్లీ గది చివరన చేరింది.కొంచం సేపు అలాగే చూస్తూ వుండి పోయాను .ఆ ఫోటో కి గల రెండు అంచులలో ఒక అంచు మాత్రమే గోడ కి ఆనుకుని క్రాస్ గా ఫోటో వుంది..అది బాబా లీల అని మనసుకి అనిపిస్తున్నా చూద్దాం ఈసారి కూడా అని అనుకుని ఆరోజు కుడా నేను బాబా ఫోటో ని మల్లీ మధ్య లో పెట్టి పూజ చేసాను..రాత్రి పడుకుని తిరిగి ఆ మరుసటిరోజు చూసేసరికి మల్లీ బాబా ఫోటో గది చివరకి చేరి వుంది .ఈసారి కుడా క్రాస్ గా ఒక అంచు మాత్రమె ఆనుకుని వుంది..అపుడు నేను బాబా కి మా అమ్మ ఇష్టానికి వ్యతిరేఖంగా ఫోటో పెట్టడం నచ్చలేదేమో అని అర్ధం చేసుకుని యిక అలా చేయడం మానేసాను.అలా మధ్య లో పెడితే శ్రీ వెంకటేశ్వరస్వామి చిత్రం కవర్ అయి పోయి వుంది.. అందువల్ల అయినా బాబా కి అలా ఇష్టం లేదేమోనని తెలుసుకున్నాను.

దీనివల్ల బాబా భక్తులు మనస్పూర్తిగా పూజించిన చోట కొలువై   ఉంటాడని అన్నీ గమనిస్తూ మనలని సరి అయిన మార్గము లో నడిపిస్తుంటాడని మనకి అనుభవం అవుతోంది…జై సాయిరాం.

సాయి భావన

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

సత్పురుష సాంగత్యం, ఆత్మసుఖం, చేసిన తప్పులకు పశ్చాతాపం కలుగుతాయి. అన్నదానం చేయడంవలన శ్రీసాయి కృపకలిగి ఆనందం లభిస్తుంది.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles