Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
చెతన్య మహాప్రభు భక్తుడైన రఘునాథ్ దాస గోస్వామి ఘనతను వర్ణించటానికి నేను అశక్తుడను, అని ప్రముఖ రచయిత అయిన కృష్ణరాజ కవిరాజుల వారే సెలవిచ్చారు.
రఘునాథ దాస గోస్వామి పుట్టటయే జమీందారీ వంశంలో పుట్టాడు. ఆ వంశ వారసుడు ఈయన ఒక్కరే.
ఇంద్ర భోగం అనుభవించగల వనరులున్నాయి. అన్నిటినీ త్యజించి చెతన్య మహాప్రభు కోసం పూరీకి వెళ్లాడు.
తల్లిదండ్రులు తన కుమారుడు ఏ విధమైన ఇబ్బందికి లోను కాకూడదని ఎన్నో ఏర్పాట్లను చేశారు. అతడు విరక్తుడు, చైతన్య మహాప్రభు భక్తుడు.
చెతన్య మహాప్రభు దేహాన్ని వీడే ముందు దగ్గర ఉన్న వారిలో ఆయనొకడు. చైతన్యుని ఆదేశంతో బృందావనం చేరాడు.
అక్కడనే సనాతన గోస్వామి, రూప గోస్వామి, వల్లభాచార్యులను కలిశాడు.
రాధా గోవిందులను గూర్చి ధ్యానించేవాడు. స్మరించే వాడు. ఒకసారి రఘునాథుడు రాధా కుండం వద్ద ధ్యానంలో ఉన్నాడు.
అక్కడకు కొన్ని పులులు వచ్చాయి. సనాతన గోస్వామి దూరం నుండి చూస్తున్నాడు. శ్రీకృష్ణుడే స్వయంగా రఘునాథుల వద్ద ఉండి, క్రూర మృగాల నుండి ఆపద రాకుండా కాపాడాడు.
మరోసారి మధ్యాహ్నం ఎండ మాడిపోతోంది. ఏమీ తెలియని రఘునాథుడు ధ్యానంలోనికి పోయాడు.
రాధా దేవి సూర్యుని తీక్షణ కిరణాలు రఘునాథునిపై పడకుండా చీరతో ఆపింది.
ఈ విషయాన్ని సనాతనుడు స్వయంగా చూచి, రాధా కృష్ణులకు శ్రమ కలిగించకుండా, ఒక కుటీరం ఏర్పరచుకుని, అందులో తపస్సు చేసుకోమన్నాడు సనాతనుడు.
రఘునాథుడు అలాగే చేయసాగాడు. రోజుకున్న 24 గంటలలో 23 గంటలు ధ్యానానికే వినియోగించేవాడు. రఘనాథుని శిష్యుడు శ్రీదాస ఒక ఆకులో మజ్జిగను ఇచ్చేవాడు.
ఒకసారి శ్రీదాస మజ్జిగ తెచ్చాడు. ఒడలు తెలియని స్థితిలో ఉంటే శ్రీదాస వల్లభాచార్యునకు, సనాతన గోస్వామికి చెప్పాడు.
ఇద్దరు వైద్యులు వచ్చి పరిశిలించి, ఆహారం ఎక్కువగా తీసుకొన్నందువల్ల ఇది జరిగింది అన్నారు.
కొంచెం సేపటికి తెలివిలోకి వచ్చిన రఘునాథుడు అసలు విషయం చెప్పాడు.
రాధా గోవిందులకు, పరివారానికి మానసికంగా విందును ఏర్పాటు చేశాడు.
ఆ విందులో అందరూ సంతృప్తిగా భుజించి, మిగిలిన పదార్దాలను ప్రసాదంగా రఘునాథులకు ఇచ్చారు.
పట్టరాని ఆనందంతో ఆ మిగిలిన పదార్దాలన్నిటిని తిన్నాడు. రాధా గోవిందులు అదృశ్యమయ్యారు.
మానసిక సమర్పణ చేసి, మానసికంగా భుజించినా, అది యదార్దమే.
రఘునాథ దాస గోస్వామి ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి నాడు శరీరాన్ని విడిచి ముక్తి పొందాడు.
మానసిక పూజ మనకు కూడా అలవడు గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- మనసా ఎందుకె నీకింతా తొందర…… మహనీయులు – 2020… ఆగస్టు 2
- పదములె చాలును, ఓ సనాతనా! … మహనీయులు – 2020… జూలై 31
- జయ నిత్యనందరాం… …. మహనీయులు – 2020… మార్చి 25
- వైష్ణవ జనతో… …. మహనీయులు – 2020… అక్టోబరు 2
- రాధా కృష్ణమాయి–Radha Krishna Mai –Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments