బూటీ వాడా…..సాయి@366 అక్టోబర్ 16….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


సాయినాథుడు భౌతికంగా లేని అక్టోబరు 15 రాత్రి భారంగానే గడచింది షిరిడీలో.

సాయిబాబా మహా సమాధి చెందక పూర్వం ఎలాంటి లీలలను, మహిమలను చూపేవారో అక్టోబరు 15 రాత్రి పూర్తికాక ముందే, అంటే, ఇక తెల్లవారితే 16 అనగా మొదలు పెట్టాడు లీలలు చూపించటం.

లక్ష్మణ జోషికి సాయి స్వప్నంలో కనిపించి, చేయి పట్టిలాగి, ”త్వరగా లే, జోగ్ నేను మరణించాననుకొని రాడు. నీవు వచ్చి ఆరతి ఇవ్వు” అన్నారు.

సాయి అలా పలకటం బాపూ సాహెబ్‌ జోగ్ ను గూర్చి పలకటం కాదు, సాయి మరణించారని ఎవ్వరైనా అనుకుంటే, అలా అనుకొనిన వారికి వర్తిస్తాయి ఆ అంతరార్ధపు మాటలు.

మౌల్వీలు అడ్డుపెట్టినా పూజచేసి, ఆరతి ఇచ్చి వెళ్ళాడు లక్ష్మణ జోషి. మధ్యాహ్నం సమయానికి బాపూ సాహెబ్‌ సాయి ఆదేశాన్ని గ్రహించి మధ్యాహ్న ఆరతి ఇచ్చాడు.దే రోజు తెల్లవారు జామున దాసగణుకు స్వప్నంలో కనిపించాడు సాయి.

ఎవరు తన జీవితమంతా జగత్కల్యాణానికి వెచ్చించి, మానవత్వాన్ని ప్రబోధించటానికై వెచ్చించారో, ఆయన పార్ధివ దేహాన్ని బూటీ వాడాలోనా లేక వేరొక చోట సమాధి చేయాలా అనే విషయం చర్చకు వచ్చి అందరినీ కలవర పెట్టింది.

గతంలో కశ్మీరులోని రూపాదేవి అనే మహాయోగినిని హైందవ, ముస్లిం వర్గాలు తామంటే తాము అంతిమ సంస్కారాలు చేస్తామని గొడవపడ్డాయి.

కాశీలోని కబీరు పరిస్థితి అంతే. సాయినాథుని పరిస్థితి కూడా అంతే. అయితే తమ బిడ్డలు అలా కలహించుకొనుట గర్విస్తారు మహనీయులు.

సాయిబాబా విషయంలో బూటీ వాడాలో సమాధి చేయటానికి చివరకు అందరూ అంగీకరించారు.

సాయిబాబాను మహా సమాధి చేసే ఘట్టం అత్యంత విషాద భరితం. సాయినాథునికి బూటీ వాడాలో శేజ్‌ ఆరతి ఇచ్చారు.

జ్ఞానేశ్వర్‌ మహా సమాధి అనంతరం, నామదేవుడు ఆ వియోగానికి తట్టుకోలేక పోయాడు.

”నా గుండె ఎండిన కాసారంలా ఉంది. వట్టి శూన్యం ఆవరించింది” అని విలపించాడు.

నామదేవునకు అప్పుడు పాండురంగడు సకల దేవతలలో పరివేష్టింపబడి ఉన్న జ్ఞానేశ్వరుని చూపించాడు. నామదేవునికి శాంతి కలిగింది.

”ఈ భౌతిక దేహానంతర సహితము నేనప్రమత్తుడనే. సమాధి నుండియే నేను సర్వ కార్యములు నిర్వహింతును. సమాధి నుండియే నా మానుష శరీరము మాటలాడును” అను సాయి వాక్కుల నిరంతర స్మరణ, సాయి వియోగ బాధను దూరం చేస్తాయి.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles